వడ్డీ సొమ్ము వాపస్..
మహిళా సంఘాలకు చేయూత
● వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం
● ప్రతినెలా బ్యాంకు కంతులు చెల్లించే వారికి ప్రాధాన్యత
● జిల్లాలో 956 సంఘాలకు లబ్ధి
●
డబ్బులు వచ్చాయి.
బ్యాంకు ద్వారా తీసుకు న్న రుణం క్రమం త ప్పకుండా తిరిగి చెల్లించ డంతో తమ సంఘానికి వడ్డీ డబ్బులు వచ్చాయి. మొత్తం రూ. 6,920 బ్యాంకు ఖాతాలో జమ కావడం సంతోషంగా ఉంది. గతంలో వడ్డీ ఇస్తామని ఆశ చూపారే తప్ప చెల్లించలేదు. – భాగ్యమ్మ,
గణపతి మహిళా సంఘం, అమరచింత
సంతోషంగా ఉంది..
వడ్డీ లేని రుణాలు ఇస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతినెలా ఎంతో ప్రయాసతో అనుకున్న సమయానికి బ్యాంకు అప్పు తీరుస్తున్నాం. తమ సంఘానికి ప్రభుత్వం రూ. 5,600 వడ్డీ చెల్లించింది. వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సునీత,
మధూరి మహిళా సంఘం, అమరచింత
క్రమం తప్పకుండా
చెల్లించిన వారికే..
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన మహిళా సంఘాలకు మాత్రమే పావలా వడ్డీ వర్తిస్తుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను రెగ్యులర్‌గా చెల్లించి తిరిగి కొత్త రుణాలను తీసుకుంటున్న వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. మొత్తం 956 సంఘాలకు రూ. 3.16కోట్లు మంజూరయ్యాయి.
– బాల్‌రాజ్, జిల్లా కోఆర్డినేటర్, మెప్మా
అమరచింత: స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహిస్తూ, భారీగా రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డీ డబ్బులను తిరిగి చెల్లిస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా తీరుస్తున్న 956 సంఘాలను గుర్తించిన అధికారులు... మొత్తం రూ. 3,16,92,822 వడ్డీని ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తం 13వేల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. వడ్డీ చెల్లింపు డబ్బులకు సంబంధించిన చెక్కులను జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఆయా పట్టణ సమాఖ్యలకు అందజేశారు.
జిల్లాలో సంఘాలు, వడ్డీ డబ్బుల చెల్లింపు ఇలా (రూ.పాలలో)
మున్సిపాలిటీ సంఘాలు వడ్డీ డబ్బులు
అమరచింత 124 61,40,579
ఆత్మకూరు 53 13,95,206
కొత్తకోట 174 65,29,903
పెబ్బేరు 76 15,56,683
వనపర్తి 529 1,60,61,651
మొత్తం 956 3,16,92,822
పదేళ్లుగా రాని వడ్డీ..
గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను చెల్లించలేకపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంపై పొదుపు సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమే కాకుండా పెట్రోల్‌బంక్‌ల నిర్వహణ, అద్దెకు ఆర్టీసీ బస్సులను ఇవ్వడం, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో మహిళలు ఆర్థికంగా ముందుకెళ్తున్నారు.
వడ్డీ సొమ్ము వాపస్..
వడ్డీ సొమ్ము వాపస్..
వడ్డీ సొమ్ము వాపస్..
వడ్డీ సొమ్ము వాపస్..


