అంతటా అంతేగా..! | - | Sakshi
Sakshi News home page

అంతటా అంతేగా..!

Jan 5 2026 11:38 AM | Updated on Jan 5 2026 11:38 AM

అంతటా

అంతటా అంతేగా..!

ఆన్‌లైన్‌ నమోదులో..

మొత్తం 291 ఫిర్యాదులు

ప్రహసనంగా మారడం..

సర్దుబాటు చేయడంతో..

మహబూబ్‌నగర్‌

కార్పొరేషన్‌లో

ఇతర జిల్లాల ఓటర్లు

ఉమ్మడి పాలమూరులోని

అన్ని పురపాలికల్లోనూ గందరగోళం

ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 98

అధికారుల నిర్లక్ష్య వైఖరిపై

విమర్శల వెల్లువ

బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.

మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు

మ.నగర్‌ (కా) 60 98

భూత్పూర్‌ 10 20

దేవరకద్ర 12 03

నాగర్‌కర్నూల్‌ 24 51

కొల్లాపూర్‌ 19 05

కల్వకుర్తి 22 32

నారాయణపేట 24 –

మక్తల్‌ 16 07

కోస్గి 16 03

మద్దూర్‌ 16 03

గద్వాల 37 06

అలంపూర్‌ 10 –

అయిజ 20 06

వడ్డేపల్లి 10 01

వనపర్తి 33 18

కొత్తకోట 15 01

అమరచింత 10 –

ఆత్మకూర్‌ 10 06

పెబ్బేరు 12 31

మొత్తం 376 291

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల

కమిషన్‌ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

మ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రఽదానంగా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్‌ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో

వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక

● మున్సిపాలిటీల్లో గ్రామాలకు

సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం..

● జాబితాలో

ఇంటి నంబర్లు

వరుసగా

లేకపోవడం..

తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

అంతటా అంతేగా..! 1
1/1

అంతటా అంతేగా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement