నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు.. | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు..

Jan 23 2026 9:10 AM | Updated on Jan 23 2026 9:10 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు..

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు.. జోగుళాంబ గద్వాల : 9 పల్లెలు నారాయణపేట : 119 గ్రామాలు..

ఎక్కడెక్కడ.. ఎలా అంటే

బీటీ రోడ్డున్నా.. బస్సు రాదు..

మూడు కిలోమీటర్లు

నడవాల్సిందే..

ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం..

జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు.

ఇబ్బంది పడుతున్న గ్రామాలు..

మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్‌ (నాగర్‌కర్నూల్‌), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్‌, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి).

జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్‌)కి మాత్రమే సర్వీస్‌లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇబ్బంది పడుతున్న గ్రామాలు..

రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్‌), ఇటిక్యాలపాడు (మానవపాడు).

జిల్లాలో మొత్తం 276 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 157 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. 119 పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉజ్జని (మాగనూర్‌), సంగంబండ (మక్తల్‌), రాయికోడ్‌ (నర్వ) గ్రామాలకు ఆర్టీసీ బస్‌ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంది.

ఏయే గ్రామాలు అంటే..

షేర్నపల్లి, మేకహనుమాన్‌తండా, వందరగుట్ట తండా, పిల్లిగుండ్లతండా, బోయిన్‌పల్లి తండా (నారాయణపేట), చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి (ఊట్కూరు), అల్లీపూర్‌, తిమ్మారెడ్డిపల్లి (కొత్తపల్లి), ఎలిగండ్ల, పసుపుల, మాధవరం (మరికల్‌).

వనపర్తి జిల్లాలో గోపాల్‌పేట మండలంలో జింకలబీడు, తండా, లక్ష్మీదేవిపల్లి, ఆముదాలకుంట తండాలకు బస్సు సౌకర్యం లేదు. పోలికేపాడు, మున్ననూరు, తిర్మలాపూర్‌కు బస్సు సౌకర్యం ఉన్నా పాఠశాల సమయానికి రావడం లేదు. రేవల్లి మండలంలోని కేశంపేట, కేశంపేట పాతతండా, కొత్త తండాకు బస్సు సౌకర్యం లేదు. ప్రతిరోజూ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకుంటున్నారు. వీపనగండ్ల మండలంలో నాగర్లబండతండాకు చెందిన విద్యార్థులు తూంకుంట జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు వెళ్తున్నారు. వీరు ప్రతిరోజూ పది కిలోమీటర్లు కాలిబాటన ప్రయాణిస్తున్నారు. కొత్తకోట మండలంలో 24 గ్రామాలకు గాను రామనంతపురం, నిర్వేన్‌, నాటవెళ్లిపెద్దతండా గ్రామాలకు చెందిన విద్యార్థులు 5 కి.మీ.,లు కాలినడకన హైస్కూల్‌కు వెళ్తున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నా.. బస్సు సర్వీసులు లేకపోవడం వారికి శాపంగా మారింది.

మా గ్రామానికి బీటీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో చదువుకోవాలంటే నడక తప్పడం లేదు. అరగంట ముందుగానే పాఠశాలకు బయలుదేరాల్సి వస్తుంది. బస్సు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికై నా స్పందించి ఇబ్బందులు తొలగించాలి.

– గోపాలకృష్ణ,

10వ తరగతి గోప్లాపూర్‌ (పాన్‌గల్‌)

బస్సు సౌకర్యం లేకపోవడంతో మా ఇద్దరు పిల్లలు రోజు పాఠశాలకు ఆటోకు వెళ్తున్నారు. రోజు రూ.40 ఖర్చు అవుతుంది. ఆటో లేకపోతే బ్యాగులు వేసుకొని 3 కిలోమీటర్లు నడిచి కంచిరావుపల్లికి చేరుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్లాల్సి వస్తుంది. గ్రామానికి రెండు పూటల బస్సు సౌకర్యం కల్పించాలి. – చెన్నకేశవరెడ్డి,

తాటిపాముల, శ్రీరంగాపురం

అవకాశం ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. రహదారి వెసులుబాటు ఉన్న ప్రతి ప్రాంతానికి బస్సు సౌకర్యం ఉంది. రహదారి సరిగాలేని ప్రాంతాలకు రాకపోకలు ఉండకపోవచ్చు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తే ప్రతి పల్లెకు ఆర్టీసీ సేవలు అందేలా చొరవ తీసుకుంటాం.

– దేవేందర్‌గౌడ్‌,

ఆర్టీసీ డిపో మేనేజర్‌, వనపర్తి

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు.. 
1
1/2

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు..

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు.. 
2
2/2

నాగర్‌కర్నూల్‌ : 85 గ్రామాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement