కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే
వనపర్తి టౌన్/రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణంలోని 30వ వార్డు సాయినగర్‌కాలనీ, ఐజానగర్‌కాలనీ, జంగిడిపురం, నందిహిల్స్ నుంచి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 60 మంది, శ్రీరంగాపురం మండలం తాటిపాముల ఉపసర్పంచ్ కుర్మయ్యతో పాటు 60 మంది, పెబ్బేరుకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ పార్టీ నేత ఐజాక్‌తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సరైన సమయంలో పార్టీలో చేరడం శుభ పరిణామన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో పదవుల్లో ఉన్నమే తప్ప ఎలాంటి గౌరవ మర్యా దలు దక్కలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.


