ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 33 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ యాదయ్య


