ప్రారంభమైన పీఎంశ్రీ క్రీడాపోటీలు
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పీఎంశ్రీ క్రీడాపోటీలను శనివారం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సర్పంచ్ స్వప్నభాస్కర్ ప్రారంభించారు. విద్యార్థులకు క్రీడలపై మక్కువ పెంచేందుకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాద్యాయుడు రంగస్వామి, సీఆర్పీ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


