జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్‌పేట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ జాతీయస్థాయి అండర్–17 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నల్గొండలో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చినందుకు జాతీయస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీ ల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ను ప్రధానోపాధ్యాయుడు రంగస్వా మి, ఉపాద్యాయ బృందం అభినందించారు.
చేసిన అభివృద్ధే
గెలిపిస్తుంది : బీఆర్‌ఎస్
వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో బీఆర్‌ఎస్ హయంలో చేసిన అభివృద్ధి పనులే త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టి తీరుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పార్టీపై కన్నబిడ్డపై ఉన్న ప్రేమ ఉందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్‌పార్టీపై కసిగా ఉన్నారని, ఓట్ల రూపంలో ఒడిసిపట్టుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసే నాయకులకు తప్పక ఆదరణ లభిస్తుందని.. ప్రతి నాయకుడు, కార్యకర్త వారి వారి వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సూచించారు. పురపాలికలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని.. అవకాశమిస్తే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని.. సంఘటితంగా ఉండి పురపాలికపై గులాబీజెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా పని చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కేసీఆర్, బీఆర్‌ఎస్ పాలన కోరుకుంటున్నారని చె ప్పారు. పుర మాజీ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, నాయకులు కురుమూర్తి యాదవ్, గంధం బాలపీరు పాల్గొన్నారు.
నేడు పాలమూరుకు
కేటీఆర్ రాక
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాలమూరుకు రానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో సన్మాన కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. మరోవైపు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో గులాబీ తోరణాలతో అలంకరించి.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మ న్ యాదయ్య, నాయకులు శివరాజు, ప్రభాక ర్, మున్నూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక


