ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్ | Prakash Raj Reacts To Youtuber Prashna Raavan Arrest, Questions AP Govt Over Repeated Arrests, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Prakash Raj: ప్రజలు గమనిస్తున్నారు.. ఇవన్నీ దేనికి?

Jul 3 2026 7:47 AM | Updated on Jul 3 2026 9:40 AM

Prakash Raj Reacts Youtuber Prashna Raavan Arrest

యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రావణ్‌ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్‌ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం రావణ్‌ని మచిలీపట్నం తరలించారు.

(ఇదీ చదవండి: నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత)

ఇక రావణ్ అరెస్ట్ వివాదంపై ఓ వీడియో విడుదల చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు? అని ప్రశ్నిస్తూ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై వరుస కేసులు పెట్టడాన్ని తప్పు పట్టాడు.  ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు బెయిల్ ఇస్తున్నా మరో కేసు వేసి మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు. ఓ 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా? ఇలా అధికారాన్ని దుర్వినియోగంతో ఎంత దూరం వెళ్తారు?  ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి? ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో రావణ్‌ని వదిలేస్తారని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో వీడియోని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: బెయిల్‌.. అరెస్ట్‌.. రిపీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement