రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత | Temples across the state closed due to lunar eclipse effect | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత

Mar 4 2026 5:04 AM | Updated on Mar 4 2026 5:04 AM

Temples across the state closed due to lunar eclipse effect

చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌

శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ప్రారంభం 

పలు ఆర్జిత సేవలు రద్దు

కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల తరువాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి  8.30 గంటలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.  – తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/సింహాచలం/శ్రీశైలం టెంపుల్‌

తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8.30 గంటల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణ 
ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం కొంతమంది భక్తులు కుమారధార తీర్థం ముక్కో­టిని ఆచరించారు. అయితే చంద్రగ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు తీర్థంలో పవిత్రస్నానం చేసి మధ్యాహ్వానికే తిరిగి వెళ్లిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారాలను కవాట బంధనం చేశారు.  

బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసిశారు. రాత్రి 7గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు చేశారు. 

బుధవారం ఉదయం 6.30గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ ద్వారాలు  చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. తిరిగి రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తదితర పూజాదికాల తరువాత రాత్రి 9గంటలకు స్వామిఅమ్మవార్ల దర్శనాలను పునఃప్రారంభించారు.  

గ్రహణ కాలానికి అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయం
శ్రీకాళహస్తి: దేశంలో ఉన్న ఆలయా­లు గ్రహణ కాలంలో మూసివేయడం ఆనవాయితీ. అయి­తే శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణా­లకు అతీతంగా ఉంటుంది. గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరచి ఉంచుతారు. స్వామి, అమ్మ­వార్ల­కు ప్రత్యేక అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణ కాలంలో రాహు–కేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  

శివయ్య సేవలో నెలరేడు 
గ్రహణానంతరం పౌర్ణమి చంద్రుడు శివయ్యను సేవిస్తున్నాడా..? అన్నట్టుగా శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఉన్న భక్త కన్నప్ప­కొండపై గల శివపార్వతుల ముందు దర్శనమిచ్చారు. భక్తులు పున్నమి చంద్రుడ్ని ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement