యూనియన్ నేతలతో మంత్రి సంధ్యారాణి చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీలకు వేతనాల పెంపుపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. అంగన్‌వాడీలకు చెందిన 3 యూనియన్లు ఉద్యమ కార్యాచణ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి సంఘం నేతలతో సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
దీంతో మంగళవారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారితో కలిసి జరిపిన చర్చల్లో వేతనాల పెంపు తప్ప, మిగిలిన అంశాలను చర్చించడంతో యూనియన్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


