నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Two Days Visit To Pulivendula On Feb 24: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Feb 24 2026 2:14 AM | Updated on Feb 24 2026 8:30 AM

YS Jagan Two Days Visit To Pulivendula On Feb 24: Andhra Pradesh

రెండు రోజుల పర్యటన  

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యా­హ్నం పైన పులివెందుల చేరుకుని భాకరా­పురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యా­హ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

 

పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్

Advertisement
 
Advertisement
Advertisement