సచివాలయ ఉద్యోగులకు జీతాలివ్వద్దు | Chandrababu govt orders officials not to pay salaries to Secretariat employees | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు జీతాలివ్వద్దు

Feb 26 2026 2:39 AM | Updated on Feb 26 2026 2:39 AM

Chandrababu govt orders officials not to pay salaries to Secretariat employees

అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు

యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే పూర్తి కాలేదంటూ కక్షపూరిత చర్యలు

సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు ఇవ్వాలని హుకుం

ఉద్యోగుల ఆగ్రహం

సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ ఉద్యోగులపై వేధింపుల్లో మరో పర్వానికి తెరతీసింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే వంద శాతం పూర్తి చేయని గ్రామ వార్డు సచివాలయాల  (ప్రస్తుత పేరు స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు) ఉద్యోగుల  వేతనాలు నిలుపుదల చేయాలంటూ సంబంధిత డీడీవోలకు  రాష్ట్రంలో పలుచోట్ల ఎంపీడీఓలు ఆదేశాలు జారీ చేశారు. 

సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు తయారు చేయాలంటూ ఆదేశించారు. సర్వే పూర్తి కాలేదని చెబుతూ జీతాలు ఆపమని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement