ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు | High Court gives green signal to land acquisition notifications during Jagans tenure | Sakshi
Sakshi News home page

ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు

Mar 5 2026 2:48 AM | Updated on Mar 5 2026 2:48 AM

High Court gives green signal to land acquisition notifications during Jagans tenure

జగన్‌ హయాంలో భూ సేకరణ నోటిఫికేషన్లకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ 

బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై పిటిషన్ల కొట్టివేత

సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్‌ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్‌ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.

అంతా సక్రమమే: హైకోర్టు
బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం వైఎస్సార్‌ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్‌ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. 

» జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్‌లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. 
»   భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదు. 
»   జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్‌ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది.  ఆ పత్రికల సర్క్యులేషన్‌ ఎంత అన్నది అవసరం లేదు.  
»   సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది.  
»  పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు.  
»  పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు.  
»  డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే.  
»   సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement