
తాహతుకుమించి అప్పులు చేస్తే ఎవరికైనా అనర్థమే. కుటుంబ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను అర్థం చేసుకొని అప్పులు తీసుకోవడం ఉత్తమం. గత్యంతరం లేక అప్పు చేసిన వెంటనే దాన్ని తిరిగి చెల్లించడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కష్టాలు తప్పవు. అవమానాలు, తప్పవు. అందుకూ ఆచితూచి వ్యవహరించాలి.
రుణ భారం నుంచి బయటపడాలంటే కొన్ని( Astrological remedies ) టిప్స్
- అప్పులు లేనివారు అధికసంపన్నులు అంటారు. అయితే అప్పులు కొందరికి తప్పదు. అలా తరచు అప్పుల పాలవుతూ ఉంటే... ప్రతినెలా పున్నమి, అమావాస్య రోజుల్లో శ్మశాన వాటికలకు చేరువలో ఉండే శివాలయాన్ని దర్శించుకుని అక్కడి శివలింగానికి పంచామృతాభిషేకం చేయించాలి. దశముఖ రుద్రాక్షను ధరించాలి.
- అష్టగంధాల మిశ్రమంతో 108 రావి ఆకులపై ‘శ్రీరామ’ అని రాసి, వాటిని మాలగా తయారు చేసి ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ ఆలయంలో స్వామికి అలంకరణగా సమర్పించాలి.
- రాహు కేతువుల శాంతికి హోమం చేయించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత హోమకుండం నుంచి సేకరించిన విభూదిని తెల్లని వస్త్రంలో మూటగా కట్టి, ఆ మూటను ఇంట్లో లేదా వ్యా΄ార ప్రదేశంలో డబ్బు భద్రపరచే చోట
ఉంచాలి. - వ్యాపారంలో తరచు సమస్యల కారణంగా రుణబాధ ఎదురవుతున్నట్లయితే, వ్యాపారం కోసం కొనే వస్తువులతో పాటు పిల్లల ఆట వస్తువులను కొన్ని కొని వాటిని చిన్నారులకు కానుకగా ఇవ్వండి.
- ఆకలితో ఉన్న వృద్ధులు, అంధులు, వికలాంగులు తారసపడినట్లయితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి.
– సాంఖ్యాయన
నోట్: ఇవి కేవలం ఆస్ట్రాలజీపరంగా, అవగాహన కోసం అందించిన టిప్స్ మాత్రమే నని గమనించగలరు.