
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్‌కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్‌కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్‌తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు.
సోషల్ మీడియాలోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో పాటు అన్ని యాప్‌లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్‌జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్‌గా మార్చేస్తున్నారు.