
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా. ఇది ఎందరెందరో మహమహులు, సాధువులు, సెలబ్రిటీలు ప్రముఖులను ఒక చోట చేర్చి అంత ఒక్కటే అనే భావన కలగజేసిన గొప్ప కార్యక్రమం. ఈ కుంభమేళ సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమా అని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేగాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నెలవుగా మారింది. తాజాగా ఏళ్ల నాటి స్నేహబంధాన్ని హైలెట్ చేసింది. ఎప్పుడో చదువుకుని విడిపోయిన స్నేహితులను కలిపి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్లెరవంటే..
వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళా కారణంగా కలుసుకున్నాం అని చెబుతున్నారు ఆ స్నేహితులు.
సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా, అతడి స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన స్నేహితుడు చాలా సైలెంట్ అని, మాట్లాడటం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామె. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానే సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ..రష్మీ, వాళ్ల గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసేదంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజేమనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రితో చివరి స్నానం ముగిసింది. ఈ మేళా అనేక లక్షలాదిమంది ప్రజలను ఒక చోట ఏకం చేసిన గొప్ప దైవ కార్యక్రమం.
Pehle log Kumbh me kho jate the.
Fire officer Sanjeev Kumar Singh 1988 ke baad MahaKumbh me apni classmate se mile.
Such a cute conversation! pic.twitter.com/WQzSa35nsd— Swami (@Swami_65) February 26, 2025
(చదవండి: అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి.)