
చూడగలగాలే గానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళముందు ఉంచుతుంది. అలాంటి ఒక వింతే దక్షిణ కొరియాలోని మిరాకిల్ ఆఫ్ జిండో. ఏంటి దీని ప్రత్యేకత అని అనుకుంటున్నారా?
సౌత్ కొరియాలోని జిండో సముద్రంలో ఆటుపోట్లు అసాధారణ స్థాయిలో మార్పు చెందడం వలన నీరు రెండు పాయలుగా విడిపోయి, జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు ఒక ఇసుక దారి ఏర్పడుతుంది. ఈ దారి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉండి కేవలం ఒక గంటపాటు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు, స్థానికులు ఈ ఇసుక దారిపై నడిచి, మోడో ద్వీపాన్ని చేరుకుంటారు. దారి ఏర్పడిన గంట తర్వాత, సముద్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని ఈ దారి నీటిలో మునిగి΄ోతుంది. ఈ అరుదైన దృశ్యం సంభవించే సమయంలో, స్థానికులు ‘జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్’ పేరుతో పండుగ జరుపుకుంటారు.
ఇదీ చదవండి: కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్‌తో
ఈ పరిస్థితిని పరిశోధించడానికి వచ్చిన ఫ్రెంచ్ అంబాసిడర్ Pierre Landi ఆశ్చర్యానికి గురై, బైబిల్‌లో మోసెస్ సముద్రాన్ని చీల్చే సన్నివేశంతో పోలుస్తూ ‘కొరియన్ మిరాకిల్ ఆఫ్ మోసెస్’ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో వ్యాసం రాశాడు. దీంతో ఈ జిండో సముద్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. జిండో సముద్ర విభజన గురించి దక్షిణ కొరియా సాహిత్యంలో అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒక జానపద కథను స్థానికులు బలంగా విశ్వసిస్తారు. ఒకప్పుడు జిండో ద్వీపంలో ‘‘హోలాంగి’’ అనే భయంకరమైన పులి నివసించేది. ఈ పులి దాడుల నుండి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి కోల్పోతారు.
చదవండి: ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
అయితే, ఒక వృద్ధ మహిళ అనుకోకుండా వెనుకబడి పోవడం వల్ల ఆమె భయంతో సముద్ర దేవతకు ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రాన్ని విభజించి, ఒక దారిని సృష్టిస్తుంది. ఈ దారి ద్వారా ఆ ముసలమ్మ మోడో ద్వీ΄ానికి చేరుకుని ఆమె కుటుంబంతో తిరిగి కలుస్తుంది.
చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు