
ఆటపాటలతో సందడిగా మారిన గతి ప్రభుత్వ పాఠశాల
వెంకటేశ్వరకాలనీ వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలియని విషయాలను తెలిసేలా... ఆహ్లాదంగా గడిపి వేసవి సెలవులను మరింత ఆనంద జ్ఞాపకాలుగా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం బడుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 80 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్‌లో అటు కంప్యూటర్ నేర్చుకోవడంతో పాటు ఇటు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. లిటిల్‌స్టార్ హైస్కూల్, గతి హైసూ్కల్, సెయింట్ ఆల్ఫాన్సెస్ హైసూ్కల్, ప్రాక్టీసింగ్ హైసూ్కల్, పంజగుట్ట పడవ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి: సక్సెస్ అంటే...‘సాఫ్ట్‌వేర్’ ఒక్కటే కాదు బాస్!
ఈనెల 15వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు..
ఈ సమ్మర్ క్యాంప్ ఉదయం 8నుంచి 11గంటల వరకు ఉంటుందన్నారు. ఈ క్యాంపు ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కంప్యూటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, మెడిటేషన్, ఇంగ్లిష్, సైన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. గణితం ట్రిక్స్ ఇందులో నేర్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్‌బాబు ఈ సమ్మర్ క్యాంప్ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనేలా చేసి విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలు స్తున్నారు. సమ్మర్ క్యాంప్ తమకెంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వచ్చే నెలా 10వ తేదీ వరకు పొడిగిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు.