యూత్‌లోనయా ట్రెండ్‌, F3 : ఫుల్‌ టైం ఎంటర్‌టైన్‌మెంట్‌ | food fun and frinds naya trend in hyderabad youth | Sakshi
Sakshi News home page

యూత్‌లో నయా ట్రెండ్‌, F3 : ఫుల్‌ టైం ఎంటర్‌టైన్‌మెంట్‌

Apr 20 2025 12:54 PM | Updated on Apr 29 2025 1:31 PM

food fun and frinds naya trend in hyderabad youth

నగర సంస్కృతిలో భాగమైన స్నూకర్, పూల్, డార్ట్, షాఫుల్‌ బోర్డు, బోర్డ్‌ గేమ్స్‌ 

హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి,  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో నయా పోకడ

సిటీలో కలిసిపోయిన బ్రిటన్‌ ట్రెండ్‌ యూత్‌కు స్టేటస్‌ సింబల్‌గా పార్టీ గేమ్స్‌ 

ఫుడ్‌ + ఫన్‌ + ఫ్రెండ్స్‌ =  ఎఫ్‌ 3

జనరేషన్‌ మారింది.. యూత్‌ లైఫ్‌స్టైల్‌ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్‌ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్‌ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్‌ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్‌ కల్చర్‌కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్‌ అనేవి మోడరన్‌ యూత్‌ ఫన్‌ థీమ్స్‌గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‌‘, ‘పూల్‌‘, ‘డార్ట్‌‘, ‘షాఫుల్‌ బోర్డు‘, ‘బోర్డ్‌ గేమ్స్‌‘ లాంటి గేమ్స్‌ పబ్స్, లాంజ్‌లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్‌ హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వంటి హై ఎండ్‌ జోన్‌లను దాటింది.  – సాక్షి, సిటీ బ్యూరో

పార్టీ గేమ్స్‌ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్‌ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్‌ కల్చర్‌ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్‌ + ఫన్‌ + ఫ్రెండ్స్‌ = ఫుల్‌ టైం ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్‌ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్‌ ఔట్‌‘ అంటే కేవలం ఫుడ్‌ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్‌ లాంజ్‌లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, హిమాయత్‌ నగర్‌లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్‌ బోర్డు గేమ్స్‌ గండిపేట్, ఫైనాన్షియల్‌ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్‌లో బోర్డ్‌ గేమ్స్, సాఫ్ట్‌ గేమింగ్‌ లాంజ్‌లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్‌లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్‌ టు భారత్‌... 

పార్టీ గేమ్స్‌ కల్చర్‌ పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్‌లోని బ్రిటన్‌ దేశంలో స్నూకర్‌ పురుడు పోసుకుంది. అక్కడి పబ్‌ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్‌ వంటి గేమ్స్‌ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్‌ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌ వంటి ఐటీ హబ్‌లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్‌ రిలాక్సేషన్‌తోపాటు టీమ్‌ బాండింగ్‌ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. 

ఇదొక స్టేటస్‌ సింబల్‌... 
ఇప్పుడు పబ్‌కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్‌ కాదని, మినీ టోర్నమెంట్‌లు, ఫ్రెండ్స్‌ సర్కిల్‌ మధ్య స్నూకర్‌ మ్యాచ్‌లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్‌ను కార్పొరేట్‌ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్‌ సింబల్‌గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్పేస్‌లు గేమింగ్‌ కల్చర్‌తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.

ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో

ఫ్రీ లేదా ప్లే అండ్‌ పే... 

నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్‌ క్లబ్, ది హోపరీ, హార్ట్‌ కప్‌ కాఫీ, గేమర్స్‌ డెన్, సోబో కేఫ్‌ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్‌ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్‌ పే అంటూ చార్జ్‌ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్‌ గేమింగ్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

చదవండి: అయ్యో ఎంత విషాదం కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement