
పాల్వంచ సంస్థానంలో కుక్కునూరులో ఉన్న ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం (1925 మార్చి 25) గోదావరి తీరంలో ఉన్న ‘అమరవరం’లో ‘గౌతమి ఆశ్రమం’తో పాటు ఈ గ్రంథాలయాన్నీ, ఒక పత్రికా పఠన మందిరాన్ని, ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు, ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహూకరించారు. వీటితో పాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు. అందుకే ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ అని దీనికి పేరుపెట్టారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు.
గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ‘ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంpని, జన్మ భూమి, త్రిలింVýæ, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కృష్ణా పత్రిక’ వంటివి... కోటగిరి వెంకట అప్పారావు, మాజేటి రామచంద్ర రావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ‘గ్రంథాలయ యాత్ర’ చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం ఉన్నతికి కృషి చేశారు. 1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించు కున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది, కారణం ఆర్థిక వన రులూ, మానవ వనరుల కొరత, నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం వంటి కారణాలతో 1980–85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపద అంతరించి పోయింది.
– డా. రవి కుమార్ చేగొని
తెలంగాణ గ్రంథాలయ సంఘం కార్యదర్శి
(నేటితో దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయానికి వందేళ్లు)