
ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్‌స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్‌కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.
ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్‌లైన్‌తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్‌లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)
ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టత
తన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్‌ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్‌ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్‌స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు.