హ్యాట్సాఫ్‌.. పోలీస్‌.. ఇంట్రస్టింగ్‌ స్టోరీ | women aftey wing a hyderabad woman doctor experience impress you | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌.. పోలీస్‌.. ఇంట్రస్టింగ్‌ స్టోరీ

May 16 2025 4:01 PM | Updated on May 16 2025 5:00 PM

women aftey wing a hyderabad woman doctor experience  impress you

అబిడ్స్‌: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్‌ ఉమెన్‌ పోలీస్‌ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్‌ జోన్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్‌ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా డాక్టర్‌ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్‌స్టేన్‌కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. 

చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!

ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.   

ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement