కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..! | Nitanshi Goel Graces The Red Carpet In A Black And Gold Gown At Film Festival 2025, Check Story Inside | Sakshi
Sakshi News home page

Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!

May 16 2025 12:31 PM | Updated on May 16 2025 4:00 PM

Nitanshi Goel Shines At Cannes  Film Festival 2025

లాపతా  లేడీస్‌ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్‌ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల  హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని  ఫూల్‌ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది.  ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.

ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  అరంగేట్రం చేసింది.  అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్‌లో తన లుక్స్‌తో వావ్‌ అనిపించింది.  17 ఏళ్ల యువతార బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ గౌన్‌తో  తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది.  ఆమె లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె డిజైనర్‌ దుస్తులు, స్టైల్‌,  సీనియర్‌ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం   స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.  అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి  లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.

నితాన్షి లుక్‌లో ప్రధాన ఆకర్షణ,  ముత్యాల జడలో 
కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి  బాలీవుడ్‌ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్‌లున్న (miniature photo frames)  కస్టమ్-మేడ్ హెయిర్‌ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న  వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.

చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?

ముత్యాల చీర,
పూసలు, ముత్యాలు,  సీక్విన్లతో తయారు చేసిన  ప్రీ-డ్రేప్డ్ చీరలో  అందంగా ముస్తామైంది. దానిపై  మల్టీ లేయర్ల , 3D వర్క్‌ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు  ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్‌ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్‌లో ఉన్నప్పుడు అలియా భట్‌ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్  డిస్నీడాల్‌గా చాలా ముద్దుగా ఉంది.

నితాన్షి రికార్డు
లాపతా లేడీస్ చిత్రంలో  ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్‌. లోరల్ పారిస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్‌లోకి అడుగుపెట్టింది,  ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది.
 

ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement