
కష్టాల్లో ఉన్న వారికి అండగా...శాలిని
కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!
‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.
ఇదీ చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన శాలిని ΄ార్ట్ టైమ్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది.
చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన
‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్‌కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.
రోడ్డు ప్రమాదంలో తండ్రి... సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్‌లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని...
అలా ఎప్పుడూ చేయలేదు
ఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్ కాదు. ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని