
ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ సిటీ ప్యారిస్‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ రంగ నిపుణులతో ఇక్కడ సందడి నెలకొంది. అయితే భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ ఊహించని దెబ్బ తగిలింది.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివ్‌లో తన తొలి అనుభవం కోసం ఎదురు చూస్తున్న సాక్షి, తన లగేజీని పోగొట్టుకుంది. ఆమెకు సంబంధించిన నాలుగు బిజినెస్ క్లాస్ బ్యాక్‌లు మాయమై పోయాయి. దీంతో సాక్షి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగలాల్సిన కేన్స్ అనుభవం సంక్షోభంలో పడిపోయింది. ఈ విషయాన్ని సాక్షి ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. దయచేసి సాయం చేయండి అంటూ మొర పెట్టుకుంది. అలాగే ఈ సమస్యపై స్పందించని, సహకరించకపోవడం పట్ల లుఫ్తాన్స , స్విస్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ సాక్షికి సానుభూతి ప్రకటించారు .
ఇదీ చదవండి: తీవ్ర నష్టాల్లోలగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన
'స్టైల్‌మీఅప్ విత్ సాక్షి' అనే హ్యాండిల్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. నైస్ విమానాశ్రయం మీదుగా కేన్స్‌కు వెళ్లేటప్పుడు లుఫ్తాన్స మరియు స్విస్ ఎయిర్‌లైన్స్ ఆమె చెక్-ఇన్ బ్యాగులను ఒక్కొక్కటి పోగొట్టుకున్నాయని సాక్షి వెల్లడించింది. ఆమె ఇలా రాసింది.
"నమ్మశక్యం కాని భయంకరమైన సంఘటన జరిగింది. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను నా 4 బ్యాగులూ పోగొట్టుకున్నాను. ఇపుడు నా దగ్గర ఏ వస్తువులూ లేకుండా నేను కేన్స్‌లో ఉన్నాను. నా జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి ఈ మొత్తం ఉదంతంలో లుఫ్తాన్సా , స్విస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’’ అని ఆమె పేర్కొంది.
కేన్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన కోసం నెలల తరబడి వేచి ఉన్నాననీ, తన లగేజీ సురక్షితంగా ఉండాలని, “హై ప్రియారిటీ” కింద బిజినెస్ క్లాస్‌లో చెక్ ఇన్ చేశానని తెలిపింది.విమానయాన అధికారుల నుండి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలు
ఎవరీ సాక్షి సింధ్వానీ
ఢిల్లీకి చెందిన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్లస్ సైజ్ ఫ్యాషన్ కంటెంట్‌కు పేరుగాంచింది, అంతర్జాతీయ అందాల దిగ్గజం లోరియల్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తూ, కేన్స్ 2025 లో చరిత్ర సృష్టించనున్న భారతీయ ప్రభావశీలురులలో సాక్షి సింద్వానీ ఒకరు. ధైర్యంగా ఫ్యాషన్ స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టి ప్లస్-సైజు ఇన్ఫ్లుయెన్సర్‌గా తకంటూ ఒక పేరు తెచ్చుకుంది.