luggage missing
-
Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ సిటీ ప్యారిస్‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ రంగ నిపుణులతో ఇక్కడ సందడి నెలకొంది. అయితే భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్ఫ్లుయెన్సర్,ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ ఊహించని దెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివ్‌లో తన తొలి అనుభవం కోసం ఎదురు చూస్తున్న సాక్షి, తన లగేజీని పోగొట్టుకుంది. ఆమెకు సంబంధించిన నాలుగు బిజినెస్ క్లాస్ బ్యాక్‌లు మాయమై పోయాయి. దీంతో సాక్షి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగలాల్సిన కేన్స్ అనుభవం సంక్షోభంలో పడిపోయింది. ఈ విషయాన్ని సాక్షి ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. దయచేసి సాయం చేయండి అంటూ మొర పెట్టుకుంది. అలాగే ఈ సమస్యపై స్పందించని, సహకరించకపోవడం పట్ల లుఫ్తాన్స , స్విస్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ సాక్షికి సానుభూతి ప్రకటించారు .ఇదీ చదవండి: తీవ్ర నష్టాల్లోలగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన'స్టైల్‌మీఅప్ విత్ సాక్షి' అనే హ్యాండిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. నైస్ విమానాశ్రయం మీదుగా కేన్స్‌కు వెళ్లేటప్పుడు లుఫ్తాన్స మరియు స్విస్ ఎయిర్‌లైన్స్ ఆమె చెక్-ఇన్ బ్యాగులను ఒక్కొక్కటి పోగొట్టుకున్నాయని సాక్షి వెల్లడించింది. ఆమె ఇలా రాసింది."నమ్మశక్యం కాని భయంకరమైన సంఘటన జరిగింది. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను నా 4 బ్యాగులూ పోగొట్టుకున్నాను. ఇపుడు నా దగ్గర ఏ వస్తువులూ లేకుండా నేను కేన్స్‌లో ఉన్నాను. నా జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి ఈ మొత్తం ఉదంతంలో లుఫ్తాన్సా , స్విస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’’ అని ఆమె పేర్కొంది.కేన్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన కోసం నెలల తరబడి వేచి ఉన్నాననీ, తన లగేజీ సురక్షితంగా ఉండాలని, “హై ప్రియారిటీ” కింద బిజినెస్ క్లాస్‌లో చెక్ ఇన్ చేశానని తెలిపింది.విమానయాన అధికారుల నుండి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలుఎవరీ సాక్షి సింధ్వానీఢిల్లీకి చెందిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ సైజ్ ఫ్యాషన్ కంటెంట్‌కు పేరుగాంచింది, అంతర్జాతీయ అందాల దిగ్గజం లోరియల్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తూ, కేన్స్ 2025 లో చరిత్ర సృష్టించనున్న భారతీయ ప్రభావశీలురులలో సాక్షి సింద్వానీ ఒకరు. ధైర్యంగా ఫ్యాషన్ స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టి ప్లస్-సైజు ఇన్ఫ్లుయెన్సర్గా తకంటూ ఒక పేరు తెచ్చుకుంది. -
మహ్మద్ సిరాజ్ అభ్యర్థన.. స్పందించిన ఎయిర్‌లైన్స్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్.. విస్తారా విమానంలో ఢాకా నుంచి ముంబయికి చేరుకున్నాడు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండు మాత్రమే వచ్చాయి. ఈ విషయం అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తెచ్చిపెడతామని చెప్పారని, కానీ, ఎంతకీ రాలేదన్నాడు. ఈ మేరకు బ్యాగ్ మిస్సైందని ట్విట్టర్ ద్వారా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ''నేను 26వ తేదీన వరుసగా UK 182, UK 951 విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబయికి ప్రయాణించాను. నేను మూడు బ్యాగ్‌లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో ఒకటి మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బ్యాగ్‌లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వీలైనంత త్వరగా బ్యాగ్‌ను హైదరాబాద్‌కు చేరవేయగలరు'' అంటూ ట్వీట్ చేశాడు. సిరాజ్ ట్వీట్‌పై స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్.. వివరాలు పంపించాలని కోరింది. సిరాజ్ వివరాలు ఇచ్చాడు. అనంతరం సిబ్బంది తన బ్యాగ్ ఎక్కడుందో గుర్తించారని బుధవారం మరో ట్వీట్ ద్వారా సిరాజ్ వెల్లడించాడు. దాన్ని త్వరలోనే తన వద్దకు చేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. @airvistara I was traveling to Mumbai from Dhaka via Delhi on 26th on flight UK182 & UK951 respectively. I had checked in three bags out of which 1 has been misplaced. I was assured the bag will be found and delivered within no time but till now I have not heard anything. 1/2 pic.twitter.com/Z1MMHiaSmR — Mohammed Siraj (@mdsirajofficial) December 27, 2022 Hello Mr. Siraj, this sounds unfortunate. Please note that our staff will try its best to locate your baggage and will update you at the earliest. Rest you to please share your contact number and a convenient time via DM to connect with you. ~Bhumika https://t.co/IaDysdHZUk — Vistara (@airvistara) December 27, 2022 -
కేంద్రమంత్రి లగేజిని పోగొట్టిన ఎయిరిండియా!
ప్రయాణికుల విషయంలో ఎయిరిండియా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి వెల్లడైంది. సాక్షాత్తు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ సూట్కేసునే ఎయిరిండియా సిబ్బంది పోగొట్టారు. దాంతో ఆమె జి-20 మంత్రుల గౌరవార్థం ఏర్పాటుచేసిన విందుకు హాజరు కాలేకపోయారు. పాలమ్ కోవ్‌లో జరుగుతున్న రిసెప్షన్‌కు హాజరు కాలేకపోయినందుకు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా సారీ చెప్పారు. తాను రూంలోనే ఉండిపోయానని, ఎయిరిండియా అధికారులు ఇంతవరకు తన లగేజి గురించి ఏమీ చెప్పలేదని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న జి-20 సదస్సుకు భారత ప్రతినిధిగా హాజరైన ఆమె లగేజి ఎయిరిండియా విమానంలో పోయింది. ఆమె ముందుగా సిడ్నీలో దిగి, అక్కడి నుంచి మరో విమానంలో కెయిర్న్స్ వెళ్లారు. అక్కడ తన లగేజి కోసం చూసుకోగా.. ఎక్కడా కనపడలేదు. తన దుస్తులన్నీ ఆ సూట్‌కేసులోనే ఉండిపోయాయని, కెయిర్న్స్‌లో తాను కొనుక్కుందామన్నా చీరలు దొరుకుతాయన్న నమ్మకం లేదని అంతకుముందు మరో ట్వీట్లో తెలిపారు. చిట్ట చివరకు తన లగేజి ఎలాగోలా దొరికిందని, అందులోనే తన ఫోన్, ఐప్యాడ్ ఛార్జర్ కూడా ఉన్నాయని ఆమె చివరకు తెలిపారు. సూట్‌కేసు తిరిగిచ్చిన ఎయిరిండియాకు కృతజ్ఞతలు చెప్పారు. Landed in Sydney to take a connecting flight to Cairns. My checked in luggage not traceable. :( :( — Nirmala Sitharaman (@nsitharaman) September 18, 2014 On board my connecting flight to Cairns. All my formal wear in the lost suitcase! Not sure I can buy Saris in Cairns! Situation precarious! — Nirmala Sitharaman (@nsitharaman) September 18, 2014 #Air India - had a word of praise for the music collection on board. But now my luggage missing. Hopefully, you'll get it in time for me. — Nirmala Sitharaman (@nsitharaman) September 18, 2014 Sorry to miss the evening reception at the Palm Cove, Cairns. Staying put in the room. No word yet on my lost luggage. — Nirmala Sitharaman (@nsitharaman) September 19, 2014 At last, my lost luggage arrives. Thanks every one for your wishes.Thanks #Air India.Oh yes, relief first to get the phone & iPad chargers! — Nirmala Sitharaman (@nsitharaman) September 19, 2014