పెట్‌ పేరెంట్స్‌ ఈ మార్గదర్శకాలు మీకోసమే.. లేదంటే! | Are you a A Pet Owner Here Are important guidelines to follow | Sakshi
Sakshi News home page

పెట్‌ పేరెంట్స్‌ ఈ మార్గదర్శకాలు మీకోసమే.. లేదంటే!

Published Sat, Apr 26 2025 4:25 PM | Last Updated on Sat, Apr 26 2025 5:25 PM

Are you a A Pet Owner Here Are important guidelines to follow

National Pet Parents Day

ఆధునిక కాలంలో పెట్స్‌ను పెంచుకోవడం చాలాకామన్‌.వీటిల్లో ప్రధానంగా కుక్కలు. పిల్లులను పెంచుకుంటున్నవారి సంఖ్య కూడా తక్కువేమీకాదు. అయితే పెట్‌ యజమానులు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. పెంపుడు జంతువులైనా కొన్ని రకాల కుక్కలు చాలా  ఎగ్రెస్సివ్‌గా ఉంటాయి. ఒక్క ఉదుటున మీదికి భౌ మంటూ మీదికి వస్తూ ఉంటాయి. కరిచి గాయపరుస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రేపు ( ప్రిల్‌ 27)  నేషనల్‌ పెట్‌ పేరెంట్స్‌ డే (National Pet Parents Day) సందర్భంగా  పెట్స్‌ను పెంచుకునేవారు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను చూద్దాం.

పెంపుడు జంతువుల యజమానుల కోసం బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)ఆరోగ్య శాఖ త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. వీటిని తప్పనిసరిగా పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో ఊర కుక్కల సంఖ్య కొంత శాతం తగ్గింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంవల్లే ఇది సాధ్యపడిందని బీఎంసీ పేర్కొంది. 2014 చివరలో నిర్వహించిన అధ్యయనంలో ఆయా ప్రాంతాల్లో 95,172 ఊరకుక్కలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. సరిగ్గా పదేళ్లకు నిర్వహించిన సర్వేలు ఆ సంఖ్య 90.757కు తగ్గింది. దీన్ని బట్టి కుక్కలకు నిర్వహిస్తున్న కు.ని ఆపరేషన్లు సఫలీకృతమవుతున్నట్లు స్పష్టమవుతోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా బీఎంసీ ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా అనేక మంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారు. వాటి మెడలో లైసెన్స్‌ బిళ్లలు లేకపోవడంతో అది ఊర కుక్కా లేదా పెంపుడు కుక్కా అనేది తెలుసుకోవడం బీఎంసీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది.   అనేక సందర్బాలలో ఈ పెంపుడు కుక్కల వల్ల ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మలమూత్ర విసర్జన, వేళ పాళ లేకుండా అరుపులు వంటి కారణాల వల్ల గొడవలు జరుగుతున్నట్లు బీఎంసీ దృష్టికి వచి్చంది. ఇక సొసైటీలు, టవర్లలో నివసించేవారు తమ పెంపుడు జంతువులను ఉదయం, సాయంత్రాల్లో వాకింగ్‌కు తీసుకువెళ్తుంటారు. ఆ సమయంలో వీటి మల, మూత్ర విసర్జనలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటూ బాటసారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వినూత్నంగా అవగాహన కార్యక్రమం  
చాలా మంది యజమానులకు పెంపుడు జంతువులకు సంబంధించిన నియమ, నిబంధనలు, లైసెన్స్‌ గురించిన వివరాలు తెలియవు. వాటి బాగోగులు, వైద్య పర్యవేక్షణ వంటివేవీ తెలుసుకోకుండానే స్టేటస్‌ కోసమో, ప్రేమతోనో పెంచుకుంటుంటారు. ఈ విషయాలపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని భావించిన బీఎంసీ ఇందుకోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ మేరకు బీఎంసీ ఆరోగ్య శాఖ సిబ్బంది, యానిమల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యకర్తలు ప్రతీ వార్డు, నివాస సొసైటీలో సంచరిస్తూ పెంపుడు జంతువుల యజమానులకు నియమ, నిబంధనలు, మార్గదర్శక సూచనలను గుర్తు చేస్తున్నారు. లైసెన్స్‌ కోసం ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను తెలియజేస్తున్నారు.  

పెట్‌ పేరెంట్స్‌ కోసం మార్గదర్శకాలు 

  • ప్రతీ ఆరు నెలలకొకసారి పెంపుడు  జంతువులకు వైద్య పరీక్షలు చేయించి రోగ నిరోధక ఇంజక్షన్లు ఇప్పించాలి. 

  • పెంపుడు జంతువును పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. వాటిపై ఎప్పుడూ నిçఘా ఉంచాలి. 

  • మెడలో బెల్టు కట్టి మాత్రమే బయటకు తీసుకువెళ్లాలి.  పెంపుడు జంతువులు జనాలను కరవకుండా  జాగ్రత్తగా చూడాలి.  

  • ఎట్టి పరిస్ధితుల్లో తమ పెంపుడు జంతువుల లైసెన్స్‌ ఇతరులకు ఇవ్వకూడదు. 

  • ఒకవేళ వాటిని వేరేవాళ్లకు ఇచ్చినా, విక్రయించినా లైసెన్స్‌ను వారి పేర బదిలీ చేయాలి. లైసెన్స్‌ను ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేయించాలి.  

  • పెంపుడు జంతువులు మరణించినా లేదా తప్పిపోయినా సంబంధిత లైసెన్స్‌ అ«ధారిటీ కార్యాలయానికి సమాచారమందించాలి. లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలి.  

  • పెంపుడు జంతువులను సార్వజనిక, బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పడు వాటి మలమూత్రాలను శుభ్రం చేసే సామాగ్రి వెంట తీసుకెళ్లాలి. 

  • జంతువులు ఒకవేళ పరిసరాలను అపరిశుభ్రం చేస్తే యజమానులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

  • ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి, కఠిన చర్యలు తప్పవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement