
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) కింద ఎస్‌ఎంఎస్ ఆధారత ఓటీపీకి అదనంగా మరిన్ని మార్గాలకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. పాస్‌వర్డ్, ఎస్‌ఎంఎస్ ఆధారిత ఓటీపీ, పాస్‌ఫ్రేజ్, పిన్, కార్డ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టోకెన్, ఫింగర్‌ప్రింట్ లేదా ఇతర బయోమెట్రిక్స్ (ఆధార్ ఆధారిత) ఆథెంటికేషన్‌కు వీలు కల్పించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2ఎఫ్‌ఏ తప్పనిసరి అంటూ, ఇకపైనా ఎస్‌ఎంఎస్ ఓటీపీని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎస్‌ఎంఎస్ ఓటీపీకి అదనంగా ఇతర ప్రత్యామ్యాయ ఆథెంటికేషన్ కోసం చెల్లింపుల వ్యవస్థలను అప్‌గ్రెడేషన్ చేసుకోవాలంటూ 2024 ఫిబ్రవరిలోనే ఆర్‌బీఐ కోరడం గమనార్హం.