
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనం గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నాగుల చవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటే కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి జరుపుకుంటారు. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం.
ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగి΄ోతాయని ప్రతీతి. ఈ నాగుల చవితి నాడు నాగులను పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుపాము’ అని అంటారు.
అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ము’ ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ‘శ్రీమహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువు గా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ పుట్టలో పాలు పోయటంలోగల ఆంతర్యమని పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం తొలగుతుంది. కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ శనివారం(అక్టోబర్ 25న) నాగుల చవితి సందర్భంగా..
(చదవండి: అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ)