
సోలాపూర్: పట్టణానికి చెందిన రామేశ్వర్ సంతోష్ ఉదుగిరి అమెరికాలోని బోస్టన్ వద్ద నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ నందు మాస్టర్ డిగ్రీ పొందాడు. ఇటీవల అమెరికాలో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రామేశ్వర్ ప్రముఖుల చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.
రామేశ్వర్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఆర్కేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత ఉన్నత డిగ్రీని అభ్యసించడానికి యూఎస్‌లోని బోస్టన్ నందు గల నార్త్ ఈస్టర్న్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఆర్కిడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ దీపక్ సొంగే, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేతన్ తను విద్యాపరంగా ఎదుగుదల సాధించేందుకు ఎంతగానో మార్గదర్శనం చేశారని రామేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో సమర్థ అడ్వర్టైజర్స్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీ అధినేత అయిన తన నాన్న సంతోష్ వెన్ను తట్టి విద్యలో రాణించాలని ప్రోత్సహించినందుకు అంకితభావంతో ఇంతవరకు చేరుకోగలిగానని తెలిపారు. పట్టణానికి చెందిన తెలుగువాడు రామేశ్వర్ విద్యాపరంగా ఉన్నత శిఖరాన్ని అందిపుచ్చుకున్నందుకు సర్వత్రా ఆయనకు అభినందనలు వెల్లు వెత్తు తున్నాయి.
ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!