
బెంబేలెత్తించిన పైపు నీరు: స్థానిక జయదేవ భవన్ పరిసరాల్లో నీటి పైపు చిట్లడంతో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా తాగు నీరు సరఫరా చేసే ప్రధాన అనుసంధాన పైపు కావడంతో నీటి ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. ఈ పైపు చిల్లుబడి సుమారు 50 అడుగుల ఎత్తుకు నీరు చిమ్మడంతో చేరువలో 30 అడుగుల ఎత్తున 30 కేవీ విద్యుత్ సరఫరా అనుసంధాన వ్యవస్థని అధిగమించి నీరు నింగికి ఎగసింది. – భువనేశ్వర్
చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు

కాడెద్దులు లేకున్నా..
ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు.
– కొరాపుట్
ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!