ఐటీ ఉద్యోగం, అదీ ఎంఎన్‌సీ ఉంటే ఐదెంకల్లో జీతం, చక్కని జీవితం. అవసరానికి తగ్గట్లు సెలవులు. వీటితోపాటు ఇంకా ఎన్నో మెరుగైనా అవకాశాలు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు జీతంతోకూడిన లాంగ్ సిక్ లీవ్ కూడా ఇస్తాయి. అలాంటి ఐటీ కంపెనీలో సిక్‌లీవ్‌కు సంబంధించి ఒక విచిత్రకరమైన ఉదంతం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ కథా కమామిష్షు ఏంటో తెలిస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
సిక్ లీవ్ మూడో, ఆరో నెలలు, మహా అయితే సంవత్సరం. అలాంటిది 15 ఏళ్లంటే ఊహించుకోండి. ఒక ఐటీ ఉద్యోగికి ఇది కూడా సరిపోలేదు ఊహించగలరా? ఈ పదిహేనేళ్లూ కంపెనీ అతనికి జీతం ఇస్తూనే ఉంది. 15 ఏళ్ల కాలంలో తనకు జీతం పెరగలేదంటూ కోర్టు కెక్కాడు. టెక్ దిగ్గజం ఐబీఎంకు అసాధారణమైన రియల్ స్టోరీ. ఇంతకీ ఏమైందీ మరి.
యూకేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్, మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెప్టెంబర్ 2008లో ఐబీఎం నుండి అనారోగ్య సెలవు తీసుకున్నారు. అతనికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్
ఐదేళ్ల పాటు పనికి దూరంగా క్లిఫోర్డ్ 2013లో ఐబీ ఎంపై అధికారిక ఫిర్యాదు చేశాడు. ఈ కాలంలో తనకు ఒక్క ఇంక్రిమెంట్ లేదా జీతం పెంపు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. అయితే అతను కోర్టులో కేసు వేసినా కూడా కంపెనీ అతని జీతాన్ని ఆప లేదు. ప్రతీ ఏడాది దాదాపు 55.34 లక్షల రూపాయలు పొందుతూనే వచ్చాడు. దీని ప్రకారం గత 15 ఏళ్లలో అతను అందుకున్న జీతం విలువ మొత్తం. 8 కోట్ల రూపాయలు. దీనికి తోడు కంపెనీ హెల్త్ అండ్ ప్రమాద బీమా పథకంలో కూడా చేర్చారు. ఈ పథకం ప్రకారం, అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం అతను చివరిగా తీసుకున్న జీతంలో 75 శాతం లభిస్తుంది.
2022లో మళ్లీ కోర్టుకు
దాదాపు పదేళ్ల తర్వాత, 2022లో, క్లిఫోర్డ్ మళ్ళీ ఐబీఎంపై దావా వేశాడు. ఈసారి తనపై వైకల్య వివక్ష చూపారని ఆరోపిస్తూ ఉపాధి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఈ 15 ఏళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని, అయినా తన జీతం మాత్రం కొంచెం కూడా పెరగలేదని ఆరోపించాడు. కనుక తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోర్టులో వాదించాడు.
కోర్టు తీర్పు ఎలా ఉంది?
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, క్లిఫోర్డ్ వాదనను,డిమాండ్‌ను తిరస్కరించింది. మీ కోసం కల్పించిన ప్రత్యేక ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలను పొందనందుకు , వివక్ష జరిగిందని ఆరోపించరేని కొట్టిపారేసింది. కాబట్టి, క్లిఫోర్డ్ డిమాండ్‌లో న్యాయం లేదని తీర్పు చెప్పింది.


