IBM Company
-
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్‌లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, డెహ్రాడూన్‌లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది. -
చైనాకు టాటా.. బెంగళూరుకు ఐబీఎం ఆఫీస్‌లు!
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) చైనాను వీడుతోంది. అక్కడి కీలక పరిశోధనా విభాగాన్ని మూసివేస్తోంది. దీంతో 1,000 మందికి పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు.ఆర్థిక మాంద్యం, పెరిగిన నియంత్రణ పరిశీలన కారణంగా చైనాను వీడుతున్న కంపెనీల జాబితాలో ఐబీఎం చేరింది. చైనాలో కంపెనీ రీసెర్చ్ & డెవలప్మెంట్, టెస్టింగ్ విభాగాలకు సంబంధించిన రెండు వ్యాపార కార్యకలాపాలను మూసివేస్తోందని ఓ నివేదిక పేర్కొంది. బీజింగ్‌లో స్థానిక వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో విదేశీ పెట్టుబడులు మందగించాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు మార్చాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఐబీఎం తన చైనీస్ ఆర్&డీ కార్యకలాపాలను వేరే చోటకు తరలించాలని యోచిస్తోందని తెలిసిన ఉద్యోగిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇందు కోసం భారత్‌లోని బెంగళూరు లాంటి చోట్ల ఇంజనీర్లు, రీసెర్చర్లను ఈ యూఎస్ కంపెనీ నియమించుకుంటోందని ఈ విషయం గురించి వివరించిన ఉద్యోగులను ఉటంకిస్తూ తెలిపింది. -
పురోగతిలో భారత్.. వారికే ఉద్యోగావకాశాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నప్పటికీ.. ఇందులో నైపుణ్యం కలిగిన వారికి మాత్రం బోలెడన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. ఏఐలో భారత్ గణనీయమైన వాటా కలిగి ఉంది. ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం కోసం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో కూడా పరిశ్రమతో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులకు ముందు కేంద్ర ఆర్ధికమంత్రి కూడా మారుతున్న టెక్నాలజీలో నైపుణ్యం పెంపొందించుకోవాలి.. లేకుంటే ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదని స్పష్టం చేశారు. ఏఐ ఆవశ్యకత గురించి ఐబీఎమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. ఏఐతో ఆత్మ నిర్భర్ లక్ష్యం సాధించాలంటే ప్రపంచంలో ఏఐ వినియోగం, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ టెక్నాలజీలో పురోగతి సాధించాలంటే పాలసీ విధానాల రూపకల్పన, పెట్టుబడులు మాత్రమే కాకుండా స్కిల్స్ కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ మరింత విస్తృతంగా వ్యాపిస్తుంది. కొన్ని సంస్థలు కూడా ఈ టెక్నాలజీలో తమ ఉద్యోగులకు ట్రైనింగ్ వంటివి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి -
‘ఆఫీసుకు వస్తారా.. రారా..?’, ఉద్యోగులకు టెక్ దిగ్గజం వార్నింగ్!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) సీఈఓ అరవింద్ కృష్ణ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేశారు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆఫీస్‌కు రావాలని, లేదంటే సంస్థను వదిలేయాలని సూచించారు. అమెరికాలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్లకు, హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంజెర్ ఓ ఇంటర్నల్ మెయిల్ పంపారు. అందులో ‘ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్లయింట్ లొకేషన్లో కనీసం వారానికి మూడు రోజులు విధులు నిర్వహించాలని’ మెయిల్లో పేర్కొన్నట్లు మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆఫీస్‌కు వస్తారా? రాజీనామా చేస్తారా? ఈ ఏడాది ఆగస్ట్ నుంచి 80 కిలోమీటర్ల లోపు ఇంటి వద్ద నుంచి ఉద్యోగులు స్థానిక ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, లేదంటే మిలటరీ సర్వీసుల్లో పనిచేస్తున్న ఐబీఎం ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ రిమోట్‌గా పనిచేస్తున్న మేనేజర్లు క్లయింట్ లొకషన్ లేదంటే లోకల్ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించకపోతే ఐబీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుందని గ్రాంజర్ స్పష్టం చేశారు. వారానికి మూడు రోజులు ఈ సందర్భంగా మరింత ప్రొడక్టివిటీ, క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. కాబట్టే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి కాకుండా నేరుగా కార్యాలయాల్లో, క్లయింట్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే వాతావరణాన్ని రూపొందించడంపై దృష్టిసారించినట్లు ఐబీఎం ప్రతినిధి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా అమెరికాలోని ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని మేం కోరుతున్నాము’ అని అన్నారు. కృత్తిమ మేధపై దృష్టి ఐబీఎం ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్, సేవలపై దృష్టి తగ్గించింది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కృత్తిమ మేధకు సంబంధించిన ప్రొడక్ట్‌లను మార్కెట్‌కి పరిచయం చేసింది. అదే సమయంలో గత ఏడాది జనవరిలో 3,900 మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఈ ఏడాది సైతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించే పనిలో పడిందని సమాచారం. వారికి అందించే వేతనాన్ని సంస్థ పునర్వ్యవస్థీకరణకు ఖర్చు చేస్తుందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ చెప్పారు. ఇతర కంపెనీల దారిలో ఐబీఎం 2022 చివరి నాటికి ఐబీఎంలో ప్రపంచ వ్యాప్తంగా 288,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించింది. తిరిగి ఇప్పుడు రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని కోరుతుంది. ఇలా ఐబీఎంతో పాటు పలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అందుకు భారీగా ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. తిరస్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోమ్‌తో ప్రమోషన్లు కష్టం ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి హైలెట్ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది మేలో బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్సైట్లో లేని వారికి ప్రమోషన్లు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ఐబీఎంలోని కొన్ని బృందాలు ఇప్పటికే ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. -
వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు IBM వార్నింగ్...
-
వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉద్యోగాలకు ముప్పు తెస్తుందన్న ఆందోళనల మధ్య ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.దాదాపు 7,800 ఉద్యోగాలనుఏఐతో భర్తీ చేసే అంశాన్నిపరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ బాట్ ద్వారా నిర్వహించవచ్చని భావిస్తున్న ఉద్యోగాల్లో కంపెనీ హైరింగ్‌ను నిలిపి వేయనుందని ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇదీ చదవండి: మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు! బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, హెచ్ఆర్ వంటి బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్లలో నియామకాల్లోమందగమనం చూడవచ్చని ఐబీఎం సీఈవో చెప్పారు. అత్యంత వేగంగా పెరుగుతున్న ఏఐలో రాబోయే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని చాలావరకు ఉద్యోగాలకు బదులుగా ఏఐని వాడాలని కంపెనీ భావిస్తోంది. అరవింద్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది శ్రామిక శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఆయా సంబంధిత ఉద్యోగాల నియామకాలను నిలిపివేయనుంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) ముఖ్యంగా ఆర్థికమాంద్యం, ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో 4 వేల ఉద్యోగాలను, కొన్ని వ్యాపార విభాగాలను తొలగించింది. మరోవైపు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 7 వేల మంది కొత్త నియామకాలు కూడా ఉన్నాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐబీఎంలో దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) -
ముదురుతున్న మూన్‌లైటింగ్ వివాదం: ఐబీఎం కీలక వ్యాఖ్యలు
ముంబై: ఐటీ రంగంలో మూన్‌లైటింగ్‌కు (రెండు ఉద్యోగాలు) వివాదం మరింత ముదురుతోంది. దీనికి వ్యతిరేకంగా గళమెత్తే కంపెనీల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. విప్రో, ఇన్ఫోసిస్ తర్వాత ఆ జాబితాలో తాజాగా ఐబీఎం ఇండియా కూడా చేరింది. మూన్‌లైటింగ్ అనైతికమని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ సందీప్ పటేల్ వ్యాఖ్యానించారు. (ఇన్ఫోసిస్ ఉద్యోగులపైకొరడా: అతిక్రమిస్తే అంతే!) ‘ఉద్యోగులు మా దగ్గర చేరేటప్పుడు ఐబీఎం కోసం మాత్రమే పనిచేస్తామన్న ఒప్పందంపై సంతకం చేస్తారు. పని వేళల తర్వాత ఖాళీ సమయాల్లో వారు ఏదైనా చేసుకోవచ్చన్న విషయం పక్కన పెడితే, మూన్‌లైటింగ్ మాత్రం అనైతికమే’ అని పేర్కొన్నారు. (Bank of Baroda: ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు) కాగా తొలుత విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మూన్‌లైటింగ్ విధానం మోసపూరితమన్నారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ మూన్‌లైటింగ్ విధానాన్ని తప్పుబట్టింది. నిబంధనలు అతిక్రమిస్తే టెర్మినేషన్ తప్పదంటూ ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎంలో భారత దేశంలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) -
పుతిన్ వార్నింగ్! టెక్ కంపెనీలకు భారీ షాక్, గీత దాటితే తాటతీస్తాం!!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో దిగ్గజ సంస్థలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై చేస్తున్న దాడుల్లో రష్యాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టెక్ దిగ్గజాలకు వార్నింగ్ ఇచ్చింది. గీత దాటితే సదరు సంస్థలకు చెందిన కార్పొరేట్ సంస్థల ఆస్థులతో పాటు ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న వికృత క్రీడను ఆపాలంటూ టెక్ దిగ్గజాలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యురేపియన్ యూనియన్ దేశాలతో పాటు 50కి పైగా టెక్ కంపెనీలు తమ సర్వీసులను రష్యాలో యుద్ధ ప్రాతిపదికన నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం యురేపియన్ యూనియన్ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఇప్పటికే అనేక కంపెనీలను రష్యా ప్రభుత్వం బెదిరించినట్లు తెలుస్తోంది. మెక్‌డొనాల్డ్స్, ఐబీఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్, యమ్ కార్ప్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, సీఈఓ లాంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేస్తామని సూచించింది. దీంతో పలు కంపెనీలు రష్యా నుంచి ఉన్నతస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌లను బదిలీ చేస్తున్నాయి. తాజాగా రష్యాలో తమ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు, కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. రష్యాలో పనిచేస్తున్న 62వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: గూగుల్ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ! -
వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్..! సరికొత్త ఆవిష్కరణ..!
మనం వాడే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎన్ని రోజుల వరకు వస్తోందంటే..ఏం చెప్తాం..? సుమారు ఒక రోజు లేదా మహా అయితే రెండు రోజులు అది కూడా మనం వాడే వాడకాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్ సుదీర్ఘంగా రెండు రోజులపాటు స్టాండ్ బై ఉంటుంది. బ్యాటరీ సమస్యలనుంచి తప్పించుకోవడం కోసం మనలో చాలా మంది అదనంగా పవర్‌బ్యాంకులను కూడా వాడుతుంటాం. కాగా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కష్టాలకు చెక్ పెడుతూ...ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, శాంసంగ్ సుమారు వారం రోజులపాటు బ్యాటరీ అందించే ఆవిష్కరణకు సిద్ధమైనాయి. స్మార్ట్ఫోన్లలో వాడే సెమీకండక్టర్ల డిజైన్లను మార్చడం ద్వారా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ పొందవచ్చునని ఇరు కంపెనీలు వెల్లడించాయి. వారం రోజులపాటు.. విత్ అవుట్ ఛార్జింగ్..! ఐబీఎమ్, శాంసంగ్ కంపెనీలు దాదాపు వారం రోజులపాటు బ్యాటరీను అందించే సెమీకండక్టర్ డిజైన్‌పై సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ సెమికండక్టర్ విషయంలో పురోగతిని సాధించినట్లు కంపెనీలు వెల్లడించాయి. సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్లను నిలువుగా అమర్చడంతో సిలికాన్ బోర్డులపై ఎక్కువ స్థలాన్ని పొందవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. శాంసంగ్-ఐబీఎమ్ సంయుక్తంగా రూపొందించిన చిప్ సాధారణంగా స్మార్ట్ఫోన్లలో వాడే ఫిన్‌ఫెట్ ట్రాన్సిస్టర్ (ఫిన్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్)తో పోలిస్తే ఐబీఎమ్, శాంసంగ్ సంయుక్తంగా రూపొందించిన కొత్త డిజైన్ వర్టికల్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు(VTFET) సిలికాన్ బోర్డులపై అధిక సాంద్రతను కల్గి ఉండనున్నాయి. ఇలా చేయడంతో బ్యాటరీ శక్తి వినియోగంలో 85 శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు ఐబీఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ట్రాన్సిస్టర్ స్విచింగ్ వేగాన్ని మెరుగుపరచడంలో, విద్యుత్ అవసరాలను తగ్గించడంలో సహాయపడనుందని పేర్కొంది. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
రూ.150 కోట్లు సమీకరిస్తున్న మోల్డ్‌టెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ క్విప్ జారీ ద్వారా రూ.150 కోట్లు సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కాన్పూర్‌తోపాటు ఇతర నగరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు, తయారీ సామర్థ్యం పెంపునకు వినియోగించనుంది. విశాఖపట్నం, మైసూరు ప్లాంట్ల సామర్థ్యం రెండింతలు చేర్చాలని ఒక క్లయింట్ నుంచి డిమాండ్ ఉందని సంస్థ తెలిపింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో భాగంగా కాన్పూర్ ప్లాంటులో ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ (ఐబీఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తామని మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ జె.లక్షణ రావు తెలిపారు. ‘ఈ సాంకేతికతతో ప్యాకేజింగ్ సురక్షితంగా, డిజైన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ముద్రణకు అనువైనది. దేశంలో ఐబీఎం మార్కెట్ రూ.5,000 కోట్లుంది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కాస్మెటిక్స్ విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించాలన్నది లక్ష్యం. ఐబీఎం కోసం రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేశాం’ అని వివరించారు. -
భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం ఐబీఎం..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియలో భాగం కావాలని భావిస్తోంది. భారత్‌లో మరిన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చైర్మన్ అరవింద్ కృష్ణ ఈ విషయాలు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కృష్ణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వంతో కలిసి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మరిన్ని రానున్నాయని వివరించారు. చదవండి: దేశీయంగా యాపిల్ విస్తరణ..10 లక్షల ఉద్యోగాలు టార్గెట్ -
ఐబీఎంకు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై: షేర్లు పతనం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్ జిమ్ వైట్ వైట్‌హర్స్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐబీఎం ధృవీకరించింది. పదవిని చేపట్టిన 14 నెలలకే కంపెనీ ఆయన ధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐబీఎం ప్రకటించింది. అయితే అమెరికాకు చెందిన రెడ్ హ్యాట్ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పదంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది. సీఈవోకి అరవింద్ కృష్ణుడికి సీనియర్ సలహాదారుగా కొనసాగుతారని తెలిపింది. అయితే జిమ్ ఎందుకు వైదొలగుతున్నారు, ఆయన స్థానంలో ఎవర్ని నియమించబోతోందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఐబీఎం 4.8 శాతం కుప్పకూలాయి. ఐదు నెలల కనిష్టానికి చేరాయి. వైట్‌హర్స్ట్ నిష్క్రమణ విశ్లేషకులకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సీఈవో అరవింద్ కృష్ట తరువాతి ఆ స్థానంలో జిమ్ ఉంటారనే అంచనాలున్నాయి. రెడ్ హ్యాట్ విలీనం తరువాత ఐబీఎంలో ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు జిమ్. ఐబీఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ తరువాత ఐబీఎం ఛైర్మన్, సీఈవో గిన్నీ రొమెట్టి వైదొలగడంతో జనవరి 2020 లో అరవింద్ కృష్ట సీఈవోగా ఎంపికయ్యారు. ఒక దశలో అరవింద్ స్థానంలో జిమ్ సీఈవో అవుతారనే కూడా చాలామంది భావించారు. రెడ్ హ్యాట్ విలీనంతో ఐబీఎం క్లౌడ్ మార్కెట్లో ఐబీఎం రూపురేఖలను మార్చడంలో కీలక ప్రాత పోషించిన ఆయన కంపెనీ వీడటం ఎదురుదెబ్బ అని వెడ్బష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మోషే కత్రి వ్యాఖ్యానించారు. సీఈవో పదవిని చేపట్టిన తరువాత అరవింద కృష్ట సంస్థను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన మార్పులు, కార్పొరేట్ కంప్యూటర్ వ్యవస్థలను నిర్వహించే వ్యాపారం నిలిపివేత, గత ఏడాది చివర్లో ఐరోపాలో భారీగా ఉద్యోగ కోతలు పరిణామాలు కారణమా? అని పలువురు భావిస్తున్నారు. -
అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం మనం ఊహించని దానికంటే వేగంగా విస్తరిస్తుంది. దీంతో మనకు మేలు ఎంతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ చిన్న చిన్న తప్పుల కారణంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లకు ఇంకొక పేరు హ్యాకర్స్. వీరి పేరు చెబితే సాదారణ ప్రజల నుంచి ప్రభుత్వాలు, దిగ్గజ ఐటీ కంపెనీలు వరకు ఇలా అందరూ వణికిపోతున్నారు. అంతలా ఉంది వీరి ప్రభావం మన అందరిమీద. ఇప్పుడు క్రైమ్ కేసులలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) ప్రస్తుతం మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అని దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. హ్యాకింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం మన 3జీ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచే భాగా పెరిగి పోయింది. 3జీ రాకముందు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీలను, ధనవంతులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ శాతం వారి ఖాతాలను హ్యాక్ చేసేవారు. కానీ ఈ 3జీ, 4జీ వచ్చాక ఇప్పుడు సాదారణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హ్యాకింగ్ భారీన పడుతున్నారు. అందుకే సైబర్ నిపుణులు ఆన్లైన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చాలా మంది హ్యాకర్స్ 2000 సంవత్సరం తర్వాత పుట్టుకొచ్చారు. కానీ ఒక హ్యాకర్ మాత్రం 1980 నుంచి 2000 వరకు ఈ ప్రపంచాన్ని వణికించాడు. ఇతను ప్రపంచంలోని ఐబీఎమ్, మోటోరోలా, నోకియా వంటి 40కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేశాడు. అలాగే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్ లకు చుక్కలు చూపించాడు. అసలు అతని పేరు చెబితే అమెరికా ప్రభుత్వం వణికిపోయేది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అతని ఎవరో కాదండీ కెవిన్ మిట్నిక్. మీరు ఇతని పేరు ఇప్పటి వరకు వినలేక పోవచ్చు. కెవిన్ మిట్నిక్ బాల్యం: కెవిన్ మిట్నిక్ కాలిఫోర్నియాలోని వన్ నుయ్స్(Van Nuys)లో 1963 ఆగస్టు 6న జన్మించాడు. ఇతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని జేమ్స్ మన్రో హైస్కూల్లో విద్యాభ్యాసం గడించాడు. ఆ సమయంలో అతను ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయ్యాడు. తర్వాత అతను లాస్ ఏంజిల్స్ పియర్స్ కాలేజీలో చేరాడు. కొంతకాలం, అతను స్టీఫెన్ ఎస్. వైజ్ టెంపుల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేశాడు.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) కెవిన్ మిట్నిక్ మొదటి కంప్యూటర్ హ్యాకింగ్: కెవిన్ మిట్నిక్ 12 సంవత్సరాల వయస్సులో లాస్ ఏంజిల్స్ బస్సు వ్యవస్థలో ఉపయోగించే పంచ్ కార్డ్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి సోషల్ ఇంజనీరింగ్, డంప్‌స్టర్ డైవింగ్ అనే టెక్నిక్ ఉపయోగించాడు. “స్కూల్ ప్రాజెక్ట్” కోసం తన సొంత టికెట్ పంచ్ ఎక్కడ కొనవచ్చో చెప్పమని ఒక బస్సు డ్రైవర్‌ను కోరాడు. ఇలా అతను బస్సు కంపెనీ పక్కన ఉన్న డంప్‌స్టర్‌లో దొరికిన ఉపయోగించని బదిలీ స్లిప్‌లను ఉపయోగించి లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రయాణించేవాడు. ఇది అతని మొదటి హ్యాకింగ్ అనే చెప్పుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఇతరుల పేర్లు, పాస్వర్డ్లు, మోడెమ్ ఫోన్ నంబర్లతో సహా సమాచారాన్ని పొందేవాడు. మిట్నిక్ మొట్టమొదట కంప్యూటర్ నెట్‌వర్క్‌కు సంబందించి 1979లో హ్యాక్ చేశాడు. తన 16 ఏళ్ళ వయసులో ఒక స్నేహితుడు కంప్యూటరు సహాయంతో ఆర్ఎస్టిఎస్/ఇ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్(డిఇసి) కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఈ నేరానికి గాను 1988లో12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న కూడా మిట్నిక్ పసిఫిక్ బెల్ వాయిస్ మెయిల్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీంతో మళ్లీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే పోలీసులకు దొరకాకుండా రెండున్నర సంవత్సరాలు పరారీలో ఉన్నాడు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, పోలీసులకు కెవిన్ మిట్నిక్ ఒక పెద్ద తల నొప్పిగా మారిపోయాడు. మిట్నిక్ డజన్ల కొద్దీ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ప్రవేశించేవాడు. అతను తన స్థానాన్ని కనిపెట్టకుండా ఉండటానికి క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లను ఉపయోగించేవాడు. దేశంలోని అతిపెద్ద సెల్యులార్ టెలిఫోన్, కంప్యూటర్ కంపెనీల నుంచి విలువైన సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఇతర కంప్యూటర్ నెట్‌వర్క్‌లను మార్చేవాడు, ప్రైవేట్ ఇ-మెయిల్లను రహస్యంగా చదివేవాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద డాన్ ల ఫోన్ లను హ్యాక్ చేసి వారికీ చుక్కలు చూపించాడు. కెవిన్ మిట్నిక్ అరెస్ట్, జైలు శిక్ష కెవిన్ మిట్నిక్ 1995లో అమెరికాలోని 40 అతిపెద్ద కంపెనీలను హ్యాకింగ్ చేశాడు. వీటిలో ఐబిఎం, నోకియా మరియు మోటరోలా ఉన్నాయి. ఇలా రోజు రోజుకి అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని పట్టించిన వారికి భారీ బహుమతి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15, 1995న ఎఫ్బిఐ నార్త్ కరోలినాలోని రాలీలోని తన అపార్ట్మెంట్ లో మిట్నిక్ ను అరెస్టు చేసింది. రెండున్నర సంవత్సరాల కంప్యూటర్ హ్యాకింగ్ కు సంబంధించిన అనేక నేరాలు అతని మీద ఉన్నాయి. అతను క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లు, 100కి పైగా క్లోన్ సెల్యులార్ ఫోన్ కోడ్లు వంటివి అతనిని అరెస్టు చేసే సమయంలో కనుగొన్నారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) 1997 డిసెంబర్ లో యాహు! వెబ్సైట్ హ్యాక్ చేయబడింది క్రిస్మస్ దినోత్సవం నాటికి మిట్నిక్ విడుదల చేయాలి లేకపోతే ఇంటర్నెట్ “విపత్తు”ను సృష్టిస్తామని ఒక మెసేజ్ భాగా అప్పుడు వైరల్ అయ్యింది. యాహు! మాత్రం కేవలం ఇది ప్రజలను భయపెట్టడానికి మాత్రమే అని పేర్కొంది. మిట్నిక్పై వైర్ మోసం, ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి, ఫెడరల్ కంప్యూటర్ను హ్యాక్ చేయడం వంటి ఆరోపణలపై తనపై ఉన్నాయి. 1999లో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ముందు చివరకు చట్టవిరుద్ధంగా చేసిన తప్పులను అంగీకరించాడు. గతంలో కంప్యూటర్ మోసానికి 1989లో పోలీసుల పర్యవేక్షణ నుంచి పారీపోయినందుకు 22 నెలల జైలు శిక్ష, తర్వాత చట్టవిరుద్దంగా చేసిన తప్పులకు అతని మీద 46 నెలల జైలు శిక్ష విధించబడింది. మిట్నిక్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ జనవరి 21, 2003లో అతను పోలీసుల పర్యవేక్షణ నుంచి విడుదల అయ్యాడు. తన విడుదల అయ్యాక కూడా ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన ఉండేది. కమ్యూనికేషన్ కోసం కేవలం ల్యాండ్‌లైన్ టెలిఫోన్ వినియోగించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ విషయంలో స్థానిక కొర్టులో కెవిన్ మిట్నిక్ పోరాడారు. చివరికి అతనికి అనుకూలంగా ఒక తీర్పును వచ్చిన తర్వాత ఇంటర్నెట్ను యాక్సెస్ వాడుకోవడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోని గూగుల్, ఫేస్బుక్ వంటి అతిపెద్ద కంపెనీలకు టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దీనికి గాను అతను అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు. -
వ్యాక్సిన్ పంపిణీ సంస్థలపై హ్యాకర్ల కన్ను: ఐబీఎం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఫైజన్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్లు ముంపు ఉందని ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరించింది. వ్యాక్సిన్ రవాణా చేసే ఆయా సంస్థల డేటాపై అంతర్జాతీయ హ్యాకర్ల బృందం టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ నిపుణుల బృందం హ్యాకర్ల కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఐబీఎం పేర్కొంది. ఈ సందర్భంగా ఐబీఎం ఆనలిస్ట్ క్లయిర్ జబోయివా మాట్లాడుతూ.. అంతర్జాతీయ హ్యాకర్లు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ అంశంపై సమాచారం సేకరించేందుకు విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ సైబర్ సెక్యూరిటీ బృందం గుర్తించిందన్నారు. (చదవండి: వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్) వివిధ హైయర్ రిఫ్రిజరేషన్ యూనిట్ల తయారి, మోడల్‌తో పాటు ధరలపై హ్యాకర్లు పరిశోధన చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ డేటాను సేకరించేందుకే హ్యాకర్లు ఈమెయిళ్ల రూపంలో వలలు విసురుతున్నారని, పక్కా ప్రణాళికతో డేటాను దొంగలించేందుకు హ్యాకర్లు అసాధారణ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఈమెయిళ్లను చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ అనే కోల్డ్ చైన్ సేవల సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నట్లు గుర్తించామన్నారు. కావునా వ్యాక్సిన్ పంపిణీ చేసే ఆయా సంస్థలు చాలా అప్రమత్తంగా ఉండాలని లేదంటే కరోనా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని జబోయివా హెచ్చిరించారు. (చదవండి: ప్రపంచానికి బ్రిటన్ యువరాజు హెచ్చరిక?) కాగా కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించే క్రమంలో కోల్డ్ చైన్ విధానం పాటించాలని ఐపీఎం తెలిపారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి కేంద్రాల నుంచే అత్యంత శీతలీకరణ ఏర్పాట్లతో రవాణా చేయాలని, ప్రజల వద్దకు వ్యాక్సిన్ డోసులు వెళ్లేవరకు అవి చల్లని వాతావరణంలోనే ఉండాలని వివరించారు. ఒకవేళ రవాణాలో శీతలకరణకు ఆటంకం ఏర్పడితే వ్యాక్సిన్ పాడైపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కరోనా వ్యాక్సిన్లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలని, ప్రస్తుతం ఫైజర్, బయో ఎన్ టెక్ ఎస్ఈ వంటి ఫార్మా కంపెనీలు కోల్డ్ చైన్ విధానంపై ఎలాంటి భద్రతలు పాటిస్తున్నారనే అంశాన్ని గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ ఓ అద్భుతమే!) -
పెట్టుబడులకు ఇదే అనువైన సమయం
న్యూఢిల్లీ: ప్రపంచమంతా మందగమనంలో కొట్టుమిట్టాడుతుంటే భారత్‌లోకి మాత్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది అత్యంత అనువైన సమయమని టెక్ దిగ్గజం అరవింద్ కృష్ణతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా పోటీపడేందుకు, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు ఎదురైనా ఇబ్బందిపడే పరిస్థితి రాకుండా చూసుకునేందుకు భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ’వర్క్ ఫ్రం హోమ్’ విధానం ప్రాచుర్యంలోకి వస్తున్నందున అందుకు అవసరమైన ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నియంత్రణ వ్యవస్థలపరంగా అనువైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐబీఎం తమ సిబ్బందిలో 75% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయం అమలు తీరుతెన్నులు, సవాళ్లు తదితర అంశాల గురించి చర్చించారు. మరోవైపు, భారత్‌లో తమ పెట్టుబడుల ప్రణాళికల గురించి అరవింద్ కృష్ణ వివరించారు. ప్రత్యేకంగా భారత్‌ను దృష్టిలో ఉంచుకుని వైద్య సంబంధ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాధనాలను కనుగొనే అవకాశాలపై దృష్టి పెట్టాలని కృష్ణను మోదీ కోరినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. -
కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తొలగింపులను కంపెనీ ధృవీకరించింది. ఈ నిర్ణయం తమ ఉద్యోగులలో సృష్టించే కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబీఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా సంభవించిన నష్టాలతో భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల లీగ్‌లో చేరింది. అయితే తాజా నిర్ణయంతో ఎంతమంది ప్రభావితమవుతున్నారో ఐబీఎం వెల్లడించలేదు. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. ముఖ్యంగా మధ్య స్థాయి ఉద్యోగులపై వేటు వేయనుంది. అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాల్లో వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వీరిలో భారతదేశంలో కొన్ని వందల ఉద్యోగులు కూడా ప్రభావితం కానున్నారు. బాధిత ఉద్యోగులకు మూడు నెలల వేతనాన్ని చెల్లించనుంది. -
'వైట్‌హౌస్‌లో బర్గర్లకు బదులు సమోసాలు'
మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో మనందరికి తెలిసిందే. తాజాగా ఐబీఎమ్ నూతన సీఈవోగా నియామకమైన భారత సంతతి అరవింద్ కృష్ణకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహీంద్రా చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తుంది.'భారత సంతతికి చెందినవారు పలు అంతర్జాతీయ సంస్థలలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడం దేశానికి గర్వకారణం. అమెరికాలోని పలు దిగ్గజ ఐటీ సంస్థలకు భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్, సుందర్ పిచాయ్, తాజాగా అరవింద్ కృష్ణలు నాయకత్వం వహిస్తున్నారు. ఇది భారతీయ సంతతి మేనేజర్ల సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక మీదట ఎప్పుడైనా వైట్‌హౌస్‌లో టెక్ సంస్థలతో సమావేశం నిర్వహిస్తే స్నాక్స్‌లో బర్గర్‌కు బదులుగా సమోసాలను ఉంచాలంటూ' ఫన్నీగా ట్వీట్ చేశారు. మహీంద్రా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ' ఇక మీదట మీటింగ్స్‌లో సమోసాతో పాటు టీ కూడా ఇవ్వండి' ' వారంతా దక్షిణ భారతీయులు. వాళ్లకు సమోసాలు నచ్చవు కాబట్టి వాటి స్థానంలో దోశ, ఇడ్లీ, ఉప్మాలు స్నాక్స్‌గా ఇవ్వండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన ఐటీ సంస్థలైన గూగుల్ అండ్ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అడోబ్ సిస్టమ్స్‌కు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, శంతను నారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా ఐబీఎమ్ సీఈవోగా 57ఏళ్ల అరవింద్ కృష్ణను నియమిస్తున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. On a lighter note, the next time the White House organises a conclave ot Tech Industry titans, they’ll have to ensure the snacks are Samosas & not Hamburgers... https://t.co/iyA5mBN89P — anand mahindra (@anandmahindra) January 31, 2020 -
మరో టెక్ దిగ్గజం సీఈఓగా మనోడే..!
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. ఐబీఎం సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. ఐబీఎం నవ శకానికి అరవింద్ సరైన నాయకుడని ఐబీఎం ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిఙ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ బాగా కృషి చేశారని కొనియాడారు. రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ఐబీఎం చైర్మన్ అయిన గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో రిటైర్ అవుతారు. అప్పటి వరకు ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. దీంతోపాటు ఐబీఎంలో సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్, రెడ్ హ్యాట్ సీఈఓ అయిన జేమ్స్ వైట్ హర్ట్స్ ఐబీఎం ప్రెసిడెంట్‌గా కంపెనీ డైరెక్టర్లు ఎన్నుకున్నారు. 1990 అరవింద్ కృష్ణా (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ, ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్డీ చేశారు. తనను సీఈఓగా ఎన్నుకోవడం పట్ల అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్లు, ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిఙ్ఞానంతో తమ క్లైంట్లకు ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల-గూగుల్ సీఈఓ, సుందర్ పిచాయ్-ఆల్ఫాబెట్ సీఈఓ, అజయ్ బంగా మాస్టర్ కార్డ్-సీఈఓ, శంతను నారాయణ్ అడోబ్-సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సికో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. -
5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచారు!
న్యూయార్క్: భారత ఉపఖండం ఏటా ఎదుర్కునే వరదలను సమర్థవంతంగా అడ్డుకునే పరిష్కార మార్గాన్ని చూపిన భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందాన్ని 5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ వరించింది. వరదలను సమర్థంగా అడ్డుకుని, అనేకమంది జీవితాలను కాపాడే ఈ పరిష్కారాన్ని కనుగొన్నందుకు గాను టెక్ దిగ్గజం ఐబీఎం ఈ ప్రైజ్‌మనీని ఆ బృందానికి అందజేసింది. ఐబీఎం, డేవిడ్ క్లార్క్ కాజ్ ఫౌండేషన్ కాల్ ఫర్ కోడ్–2019 ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అవార్డులను శనివారం ప్రకటించింది. ‘పూర్వ సూచక్’ పేరుతో కాగ్నిజెంట్ పుణే క్యాంపస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సిద్దమ్మ తిగడి, గణేశ్ కదం, సంగీత నాయర్, శ్రేయాస్ కులకర్ణిలు సంయుక్తంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు తొలి బహుమతి గెలుచుకుంది. ఈ విధానంలో వరదలను అడ్డుకునేందుకు గాను క్రమం తప్పకుండా రిజర్వాయర్లు, డ్యామ్‌లు వంటి వాటిలో నీటి స్థాయిలను గమనిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన సమాచారంతోపాటు వాతావరణ సూచనల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి వరదలను అంచనా వేస్తారు. అనంతరం బ్లాక్‌చైన్ సాంకేతికతను వినియోగించి ఈ వివరాలను ప్రభుత్వ సంస్థలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచుతారు. ఇక కృత్రిమ మేథస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది కోసం రూపొందించిన ప్రొమీటియోకు కాల్ ఫర్ కోడ్ –2019 గ్లోబల్ అవార్డు దక్కింది. ఇందుకు గాను 2 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. గ్లోబల్ రన్నరప్ స్థానాన్ని భారత్, చైనా, అమెరికాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభివృద్ధి చేసిన ‘స్పారో’కు దక్కింది. -
300 మందిని తొలగించిన టెక్ జెయింట్
టెక్నాలజీ జెయింట్ ఐబీఎం భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. సర్వీసు డివిజన్‌నుంచి, ముఖ్యంగా సాప్ట్వేర్ సర్వీసుల ఉద్యోగులను 300 మందిని విధుల నుంచి తప్పించింది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా, వినియోగదారుల ఆధునిక అవసరాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్ధ్యాలపై ఐబీఎం దృష్టిపెట్టనుంది. తమ వ్యాపారంలో మారుతున్న అవసరాలు, కస్టమర్లకు ఆధునిక, మెరుగైన సేవలను అందించడంలో సంస్థ సరికొత్త వ్యుహాలతో పనిచేస్తోందని ఐబీఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారని ఈటీ నౌ రిపోర్టు చేసింది. -
ఐబీఎంతో వొడాఫోన్ ఐడియా భారీ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ టెక్ జెయింట్ ఐబీఎంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం ఐఐఎం టెక్నాలర్తో ఐఐఎంతో ఐబీఎంతో ఐదేళ్లకుగాను మల్టీ డాలర్ ఐటీ ఔట్ సోర్సింగ్ ఒప్పందాన్ని చేసుకున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐబీఎం హైబ్రిడ్ మల్టీక్లౌడ్, ఎనలిటిక్స్, ఏఐ భద్రతా సామర్ధ్యాల వాడకంలో వొడాఫోన్ ఐడియా పురోగతిని ఈ డీల్ వేగవంతం చేస్తుందని ప్రకటించింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, థింగ్స్ ఇంటర్నెట్, ఫాస్ట్ ట్రాక్ లాంటి ఉమ్మడి కార్యక్రమాలు కోసం ఐదు-సంవత్సరాల ఒప్పందం తమకు నూతన అవకాశాలను కల్పిస్తుందని కంపనీ తెలిపింది. వోడాఫోన్- ఐడియా విలీనం లక్ష్యాల సాధనలో ఐటీ సంబంధిత ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఒప్పంద విలువను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 700 మిలియన్ల డాలర్లుగా ఉందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. కాగా 387 మిలియన్ల చందాదారులతో (డిసెంబరు 31, 2018 నాటికి)వొడాఫోన్ ఐడియా కంపెనీకి హైబ్రిడ్ క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్లో వ్యాపార సామర్థ్యత, చురుకుదనం, స్థాయితోపాటు వ్యాపార ప్రక్రియల సరళీకరణకు తోడ్పడనుంది. తద్వారా భారతదేశంలో లక్షలాది వినియోగదారులకు, వ్యాపారులకు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని కూడా అంంచనుంది. -
ఐబీఎం - హెచ్‌సీఎల్ మెగా డీల్
సాక్షి,ముంబై: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని భారతీయ టెక్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించ నుంది. ఐబీఎం ఇందుకు1.80 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12,700కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు ఒక తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తిచేసే అవకాశమున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా అధిక వృద్ధికి వీలున్న సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ విభాగాలకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొడక్టులను ఐబీఎం నుంచి సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయకుమార్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల పరిధిలో తమకు మొత్తం 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఉన్నట్లు ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది. బిగ్ ఫిక్స్, మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ యూనికా తదితర ఏడు ఉత్తులను హెచ్‌సీఎల్‌కు విక్రయించనున్నామని తెలిపింది. కాగా ఐబీఎం కూడా అమెరికాకు చెందిన ఐటీ సంస్థ రెడ్ హ్యాట్‌ను 34 బిలియన్ డాలర్ల( రుణంతో సహా) కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఈ మెగా డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ఈ షేరు ఒక దశలో దాదాపు 7శాతం పతనాన్ని నమోదుచేసింది. -
మైక్రోసాఫ్ట్ ఆఫీసర్‌పై ఐబీఎం దావా
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొత్త చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే రే మెక్‌ఇంటైర్‌పై ఐబీఎం దావా వేసింది. వన్-ఇయర్ నాన్-కంపిటీటివ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై ఈ దావా దాఖలు చేసింది. లిండ్సే-రే అంతకముందు ఐబీఎంలో హెచ్ఆర్ అధినేతగా పనిచేశారు. ఐబీఎం నుంచి అకస్మాత్తుగా రాజీనామా చేసిన లిండ్సే, కంపెనీకి సంబంధించి ఎంతో కీలకమైన, రహస్య సమాచారం కలిగి ఉన్నారని పేర్కొంది. ఐబీఎం డైవర్సిటీ స్ట్రాటజీస్, హైరింగ్ టార్గెట్స్, టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ వంటి సమాచారమంతా ఆమె వద్ద ఉందని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో తెలిపింది. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు. తాత్కాలికంగా లిండ్సేను మైక్రోసాఫ్ట్‌కు వెళ్లకుండా జడ్జి నిషేధం విధించారు. లిండ్సే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె ఇంకా ఐబీఎంకి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌గానే పనిచేస్తున్నట్టు ఉంది. ఆమె తమ ఏడాది ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐబీఎం తెలిపింది.అయితే లిండ్సే వద్దనున్న ట్రేడ్ సీక్రెట్లు మైక్రోసాఫ్ట్‌కు అంత అవసరమైనవి కావని, తన కొత్త బాధ్యతల్లో వీటిని ఉపయోగించే అవకాశం లేదని ఆమె లాయర్లు చెబుతున్నారు. -
బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం
బెంగళూరు: యాపిల్ గ్యారేజ్ కోసం ఐబీఎం కంపెనీ బెంగళూరులో ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రం (హబ్) ఏర్పాటు చేసింది. మొబైల్ ఫస్ట్ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ కేంద్రంలో ఐఓఎస్ యాప్స్ రూపకల్పన జరగనుంది. డిజైన్ దగ్గర నుంచి అభివృద్ధి, టెస్టింగ్, డెలివరీ, నిర్వహణ వరకు అన్ని రకాల సేవలను అందించే తొలి కేంద్రం ఇదే కావడం విశేషం. క్లయింట్లు తమ డిజిటల్ మొబిలిటీ ప్రాజెక్టులను వేగవంతంగా ఇక్కడ పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని ఐబీఎం యాపిల్ పార్ట్నర్షిప్ జనరల్ మేనేజర్ మహమ్మద్ నాగ్‌షినే తెలిపారు. ఈ కేంద్రం ఐఓఎస్ యాప్స్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుందని... ప్రస్తుత డిజైన్ కేంద్రాలైన అట్లాంటా, చికాగో, క్యుపర్టినో, టొరొంటో కేంద్రాలతో కలసి పనిచేస్తుందని చెప్పారు. యాప్స్ అభివృద్ధిలో భారత ఇంజనీర్ల కీలక పాత్ర యాప్స్ అభివృద్ధి కోసం ఐబీఎం 2014లో యాపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భారత్‌లోని ఉద్యోగుల పాత్ర కీలకమని నాగ్‌షినే తెలిపారు. ఇప్పటి వరకు 100 యాప్స్‌ను అభివృద్ధి చేయగా, అందులో సగంపైన యాప్స్ అభివృద్ధిలో ఇక్కడి టీమ్ పాత్ర కీలకమని చెప్పారు.