IBM కీలక ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై: షేర్లు భారీ పతనం

Top IBM executive quits, shares suffer biggest fall in 5 months - Sakshi

 ఐబీఎం ప్రెసిడెంట్‌  జిమ్‌ వైట్‌ వైట్‌హర్స్ట్ అనూహ్య రాజీనామా

5 నెలల కనిష్టానికి షేర్లు పతనం

సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్‌ జిమ్‌ వైట్‌ వైట్‌హర్స్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐబీఎం ధృవీకరించింది. పదవిని చేపట్టిన 14 నెలలకే కంపెనీ ఆయన ధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐబీఎం ప్రకటించింది. అయితే అమెరికాకు చెందిన రెడ్ హ్యాట్ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పదంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది. సీఈవోకి అరవింద్‌ కృష్ణుడికి సీనియర్ సలహాదారుగా కొనసాగుతారని తెలిపింది. అయితే జిమ్‌ ఎందుకు వైదొలగుతున్నారు, ఆయన స్థానంలో ఎవర్ని నియమించబోతోందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఐబీఎం 4.8 శాతం కుప్పకూలాయి.  ఐదు నెలల కనిష్టానికి చేరాయి. 

వైట్‌హర్స్ట్ నిష్క్రమణ విశ్లేషకులకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సీఈవో  అరవింద్‌ కృష్ట  తరువాతి ఆ స్థానంలో జిమ్‌ ఉంటారనే అంచనాలున్నాయి. రెడ్ హ్యాట్ విలీనం తరువాత ఐబీఎంలో ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు జిమ్‌. ఐబీఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ తరువాత ఐబీఎం ఛైర్మన్‌, సీఈవో గిన్నీ రొమెట్టి  వైదొలగడంతో జనవరి 2020 లో అరవింద్‌ కృష్ట సీఈవోగా ఎంపికయ్యారు. ఒక దశలో అరవింద్‌ స్థానంలో జిమ్‌ సీఈవో అవుతారనే కూడా చాలామంది భావించారు. రెడ్ హ్యాట్ విలీనంతో ఐబీఎం క్లౌడ్‌ మార్కెట్‌లో ఐబీఎం రూపురేఖలను మార్చడంలో కీలక ప్రాత పోషించిన ఆయన కంపెనీ వీడటం ఎదురుదెబ్బ అని వెడ్బష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మోషే కత్రి వ్యాఖ్యానించారు. సీఈవో పదవిని చేపట్టిన తరువాత అరవింద కృష్ట సంస్థను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన మార్పులు, కార్పొరేట్ కంప్యూటర్ వ్యవస్థలను నిర్వహించే వ్యాపారం నిలిపివేత, గత ఏడాది చివర్లో ఐరోపాలో భారీగా ఉద్యోగ కోతలు పరిణామాలు కారణమా? అని పలువురు భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top