ఐబీఎంతో వొడాఫోన్‌ ఐడియా భారీ ఒప్పందం

Vodafone Idea Signs multi million dollar IT deal with IBM - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్   టెక్‌ జెయింట్‌ ఐబీఎంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం ఐఐఎం టెక్నాలర్తో ఐఐఎంతో  ఐబీఎంతో ఐదేళ్లకుగాను మల్టీ డాలర్‌ ఐటీ  ఔట్‌  సోర్సింగ్‌ ఒప్పందాన్ని చేసుకున్నామని  శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐబీఎం హైబ్రిడ్ మల్టీక్లౌడ్, ఎనలిటిక్స్‌,  ఏఐ భద్రతా సామర్ధ్యాల వాడకంలో వొడాఫోన్ ఐడియా పురోగతిని ఈ డీల్‌ వేగవంతం చేస్తుందని ప్రకటించింది.

ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌,  థింగ్స్ ఇంటర్నెట్, ఫాస్ట్ ట్రాక్ లాంటి ఉమ్మడి కార్యక్రమాలు కోసం ఐదు-సంవత్సరాల  ఒప్పందం తమకు నూతన అవకాశాలను కల్పిస్తుందని కంపనీ  తెలిపింది. వోడాఫోన్- ఐడియా  విలీనం లక్ష్యాల సాధనలో ఐటీ సంబంధిత ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని  వొడాఫోన్‌ ఐడియా తెలిపింది.

ఒప్పంద  విలువను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 700 మిలియన్ల  డాలర్లుగా  ఉందని  కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 

కాగా  387 మిలియన్ల చందాదారులతో (డిసెంబరు 31, 2018 నాటికి)వొడాఫోన్‌  ఐడియా కంపెనీకి హైబ్రిడ్ క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో  వ్యాపార సామర్థ్యత,  చురుకుదనం, స్థాయితోపాటు వ్యాపార ప్రక్రియల సరళీకరణకు తోడ్పడనుంది. తద్వారా భారతదేశంలో లక్షలాది వినియోగదారులకు, వ్యాపారులకు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని కూడా అంంచనుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top