
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన మనసుకి హత్తుకున్న వంటకాలు, ప్రదేశాల గురించి షేర్‌చే స్తుంటారు. అలానే ఈసారి తన మేఘాలయ పర్యటనలో తనను ఎంతో ఇంప్రెస్ చేసిన గ్రామం గురించి తన అభిమానులతో పంచుకున్నారు. అంతేగాదు అందుకు సంబధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
సచిన్‌ని అంతలా ఆకర్షించిన గ్రామమే మేఘాలయలోని మావ్లిన్నాంగ్. ఇది ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుతెచ్చుకుంది. ఆ వీడియోలో సచిన్ మావ్లిన్నాంగ్ గ్రామంలో తిరుగుతూ..స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అలాగే ఆ ప్రదేశం గురించి మరింత తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది కూడా.
అక్కడ కలియ తిరుగుతుంటే..పచ్చదనంతో నిండిన పరిసరాల్లో తిరుగుతున్నట్లు ఉందని మెచ్చుకున్నారు. అక్కడ చుట్టు పక్కల పరిసరాలు నన్నుఎంతాగనో కట్టిపడేశాయని అన్నారు. అంతేగాక అక్కడ ఉండే స్థానిక పిలల్లతో ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చారు సచిన్.
అలాగే పోస్ట్‌లో ఏ గ్రామం అయినా మావ్లిన్నాంగ్ లాగా అందంగా ఉంటే ఫ్లిల్టర్లతో పనేంముంటుంది. పరిసరాలు ఇంత స్వచ్ఛంగా ఉంటే..అంతరంగంలో కూడా ఆటోమేటిగ్గా ప్రశాంతతతో కూడిన ఆనందం సొంత అవుతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
మావ్లిన్నాంగ్ గ్రామం ప్రత్యేకత..
ఇది దేవుని స్వంత తోటగా పిలిచి అందమైన ప్రదేశం. అంతేగాదు డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ దీనిని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేర్కొంది. ఇది తూర్పు ఖాసీ కొండలలో ఉంది. ఆ అందమైన ప్రాంతం ఖాసీ ప్రజలకు నిలయం. అక్కడ ప్రజల తమ సాంప్రదాయ జీవనశైలికి కట్టుబడి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఇంతలా పరిశుభ్రంగా ఉంచడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు.
ఇక్కడ ఉండే వివిధ పండ్ల తోటలు, ప్రవహించే వాగులు, సతత హరిత వృక్షసంపద సమతుల్యతకు పెద్దపీట వేసినట్లుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే దట్టమైన అడువులు సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని అందించేలా కొండలతో పెనవేసుకుని ఉంటాయి.
ముఖ్యంగా టూరిస్టులను అత్యంత ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ అత్యంత ఫేమస్ నోహ్వెట్ లివింగ్ రూట్ బ్రిడ్జి. ఇది ఫికస్ ఎలాస్టికా చెట్టు వేళ్లతో ఏర్పరిచి సంక్లిష్టమైన బ్రిడ్జి. దీని వల్లే అక్కడ ప్రజలు వివిధ భూభాగాలకు సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. పైగా ఈబ్రిడ్జ్ పొడవు, నిర్మాణం కూడా ఆశ్చర్యానికిలోను చేస్తుందట.
(చదవండి: