ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’ జీ తెలుగులో! | lovestory Jayam Starts July 14th Monday to Saturday at 8 PM ZeeTelugu | Sakshi
Sakshi News home page

ZeeTelugu ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’

Jul 12 2025 9:54 AM | Updated on Jul 12 2025 10:46 AM

lovestory Jayam Starts July 14th Monday to Saturday at 8 PM ZeeTelugu

 సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు

‘జయం’ సీరియల్ జులై 14 నుంచి ప్రసారం

హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం, జులై 14న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, మీ జీ తెలుగులో!

జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే. 

ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. 

ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, "జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం," అన్నారు.

జయం సీరియల్ జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి.  ఈ విషయాన్ని  జీ తెలుగు ప్రేక్షకులు గమనించాలని జీ తెలుగు విజ్ఞప్తి చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement