సమస్యలపై రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై రాజీలేని పోరాటం

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

గద్వాల: నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2014 సంవత్సరం నుంచి జిల్లాలోని అనేక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నామని సమితి చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ అన్నారు. శువ్రవారం జిల్లాకేంద్రంలో ఆ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను 2018, 2023లో రెండుసార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. రెండు సందర్భాల్లో కూడా ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేశారు. నడిగడ్డలో కుటుంబ పాలనతో అన్నిరంగాల్లో వెనకబడిపోయిందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఈ క్రమంలోనే సామాజిక తెలంగాణ నినాదంతో ఉద్యమిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఆ పార్టీలో ఈ నెల 8న చేరనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో నాయకులు బుచ్చిబాబు, లవన్న, వెంకట్రాములు, రంగస్వామి, గోవిందు, విష్ణు, ప్రేమ్‌రాజు, మునెప్ప, ఆంజనేయులు, రాము, దయాకర్‌, కృష్ణ, గోపాల్‌, లక్ష్మన్న, రామకృష్ణ, రాముడు, సర్వేష్‌, భూపతి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యరంగం అభివృద్ధికి ప్రోత్సాహం

రాజాపూర్‌: గ్రామీణ ప్రాంత యువతకు ఆదాయ వనరులు సమకూర్చి వారికి స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం బాలానగర్‌ మండలంలోని మొదంపల్లిలోనూతనంగా ఏర్పాటు చేసిన బయో ప్లోక్‌ ఫిష్‌ ట్యాంక్స్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త సాంకేతికతలను తీసుకొచ్చి గ్రామీణ యువతకు ప్రాత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అ భివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లుపేర్కొన్నారు. కొత్తగా మంజూరైన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల పను లు ముమ్మరంగా సాగుతున్నాయని, అవి పూర్తయితే లోఓల్టేజి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌, నవోదయ పాఠశాలను బాలానగర్‌ మండలం పెద్దాయపల్లిలో శంకు స్థాప ్డనలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, బాలానగర్‌ సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు మోహన్‌నాయక్‌, బాసునాయక్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఉమ్మడి జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం సమాలోచన, కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత అన్ని నీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక వాదులతో కలిసి పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడికి అక్కడ ఆయా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజలతో మాట్లాడాలని స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే మహబూబ్‌నగర్‌ జిల్లా శాశ్వత వెనుకబాటు తనంలో మిగిలిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ సమావేశాలలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెలలోనే ప్రాజెక్టుల సందర్శన చేపడతామని తెలిపారు. జిల్లా ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలుగా గుర్తించి సహకారం అందించాలని కోరారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ ఎం.రాఘవాచారి, న్యాయవాదులు వీరబ్రహ్మచారి, బి.జనార్దన్‌, పరమేశ్వర్‌, మధుసూదన్‌బాబు, రిటైర్డ్‌ తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, నాయకులు టీజీ శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement