కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, శశాంక్‌ స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహా హోమం నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, దీరేంద్రదాసు పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉద్యోగులపై కలెక్టర్‌ కొరడా

గద్వాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) సక్రమంగా నిర్వహించకపోవడంపై కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం విద్యాశాఖలోని 76 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఫేషియ ల్‌ రికగ్నిషన్‌ సిస్టం హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది సక్రమంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం చేయకపోవడాన్ని గుర్తించారు. దీంతో 61 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 76 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశా రు. మూడురోజుల్లో సరైన సంజాయిషీ ఇవ్వా లని ఆదేశించారు. ఇకపై అందరూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తప్పకుండా పాటించాలని,సమయ పాలన తప్పనిసరి అన్నారు. భవిష్యత్‌లో ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

సమయపాలన

పాటించాలి

ధరూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మండలంలోని చెన్నారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులు, విద్యార్థుల హాజరు తదితర రిజిష్టర్లను పరిశీలించారు. మిడ్‌లైన్‌, బేస్‌ లైన్‌, ఎండ్‌ లైన్‌, ఎఫ్‌ల్‌ఎన్‌ల తీరుపై ఆరాతీశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం అమలు తీరు గురించి తెలుసుకున్నా రు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వంటలు రుచితో పాటు శుచి, శుభ్రతగా ఉండాల ని వంట ఏజెన్సీ వారిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాగా చదివి ప్రయోజకులు కా వాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, పేరెంట్స్‌ తమ పిల్లలను ప్రభుత్వ పా ఠశాలల్లోనే చదివించాలని కోరారు. వచ్చే వి ద్యా సంవత్సరం మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టిజన్ల సమస్యలు

పరిష్కరించాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): తమ న్యాయమైన డిమాండ్ల సాధించే దాక పోరాటాన్ని కొనసాగిస్తామని ఆర్టిజన్‌ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ అన్నారు. ఆర్టిజన్‌ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్‌ భవన్‌ ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్‌ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ మాట్లాడుతూ.. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్‌ ఉద్యోగుల కన్వర్షన్‌ చేయాలని కోరారు. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్థల్లో 2016 డిసెంబర్‌ 4వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలుండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌గా గుర్తించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement