గద్వాల: జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని చెనుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. అదేవిధంగా బాల్యవివాహాలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రతిఒక్కరు స్పందించి వాటి నిర్మూలనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, మండల ప్రత్యేకాధికారి నూకరాజు, డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చంద్రకళ, హౌసింగ్ డీఈ కాశీనాథ్ పాల్గొన్నారు.


