breaking news
Jogulamba District News
-
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్‌నగర్ రీజియన్‌కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్‌నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్‌నగర్ దసరా పండుగ రోజుల్లో మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్‌లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్‌నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్‌నగర్ రీజియన్‌లో ఓఆర్‌లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
సమష్టి కృషితోనే..
అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్‌కుమార్, రీజినల్ మేనేజర్ ● -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
● గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వచ్చే వరిధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాలులో ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు సంబంధించి నవంబర్ మొదటి వారం నుంచి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో ఈనెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తూకాలు, తేమను నిర్ధారించే యంత్రాలు, గన్నీబ్యాగుల కొరతలేకుండా చూడాలన్నారు. గత సీజన్లో కొన్ని చోట్ల గన్నీసంచుల కొరత ఇతర ఇబ్బందులు వలన చాలా మంది రైతులు 15రోజులకు పైగా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు వేచిఉన్నారని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణ అనంతరం వెంటనే వాటిని మిల్లులకు తరలించేలా వాహనాలు, హమాలీ వంటివి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం ఈసారి క్వింటాల్‌కు రూ.69లు పెంచిన నేపథ్యంలో సన్నరకానికి క్వింటాల్‌కు రూ.2389లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.97లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని, ఇందుకనుగుణంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సివిల్సప్లై డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన గద్వాల మున్సిపాలిటీలోని 14వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పనుల ఫొటోలు ఎప్పటికప్పుడు తీసి అందుకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జానకిరామ్, సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం రామాయణ గ్రంథాన్ని లోకానికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అలా.. అయితే ఇలా!
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా?.. నిబంధనలకు విరుద్ధమంటూ రద్దు చేస్తారా?..ఒకవేళ రద్దు చేసిన పక్షంలో పాతవే కొనసాగుతాయా?.. అవే కొనసాగితే గత రిజర్వేషన్ల స్థానాలు మారుతాయా?.. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అమలు చేస్తుందా?.. మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి? ..ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా.. ఆశావహులు ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పక్షంలో అనుకూల రిజర్వేషన్లు వచ్చిన వారు పోరు సన్నాహాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు మారుతాయనే ఆశతో ఉన్నారు. ఏదేమైనా ఆయా వర్గాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పరిస్థితులకు అనుగుణంగా రెండు రకాల ప్రణాళికలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్పార్టీల పరంగానైనా 40శాతం అవకాశం..మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ప్రధానంగా కారు, కాంగ్రెస్ మధ్యనే పోరు కొనసాగగా.. బీజేపీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు బీసీ నినాదామే ఎజెండాగా ముందుకెళ్తున్న క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన పక్షంలో 42 శాతం బీసీలకు టికెట్లు దక్కనున్నాయి. లేనిపక్షంలో పార్టీల పరంగా అమలు చేస్తే వెనుకబడిన వర్గాలకు 40 శాతమైనా ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నట్లు బీసీ మేధావులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలిచారని.. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 38 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 43 శాతం వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారని ఉదహరిస్తున్నారు. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు తగిన అవకాశం దక్కలేదని వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 బీసీలకు రిజర్వ్ కాగా.. మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ గెలుపొందారని చెబుతున్నారు. ఈ లెక్కన 26 మంది బీసీలు జెడ్పీటీసీలుగా ఎన్నిక కాగా.. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే 32 స్థానాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి అమలుతీరుపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం అలంపూర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు అన్నారు. అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బీఆర్ గవాయ్‌పై ఈ నెల 6వ తేదీన దాడి ప్రయత్నానికి నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. దాడి ప్రయత్నానికి నిరసనగా రెండు రోజులపాటు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మా, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఈదుర్ బాష, గజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
శిక్షకులు లేక.. క్రీడలు దూరం
గద్వాలటౌన్: క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవి అమలుకాకపోవడంతో కళాశాలల విద్యార్థులు క్రీడా నైపుణ్యాలకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను దేశం గర్వించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పునాది పడాలి. విద్యార్థులను ఆటగాళ్లుగా తీర్చిదిద్దే బాధ్యతను విద్యాసంస్థలు స్వీకరించాలి. పాఠశాల మొదలుకొని కళాశాల వరకు క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. కానీ, వాస్తవానికి వచ్చే సరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు.ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్, మానవపాడు, అలంపూర్, ధరూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. తరువాత క్రమంలో గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరగుతున్న సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.డిగ్రీ కళాశాలల్లోనూ అంతే..ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ పోస్టు మంజూరైంది. కానీ, పదేళ్లుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తప్పక వ్యాయామ అధ్యాపకులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. లేనిపక్షంలో కళాశాల ప్రారంభానికి అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినప్పటికి ప్రైవేటు కళాశాలల వారు వ్యాయామ అధ్యాపకులను నియమించలేదు.మరుగున పడుతున్న నైపుణ్యంక్రీడల ప్రోత్సాహానికి పాఠశాల స్థాయిలోనే పునాది పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులను తరుచూ భర్తీ చేస్తున్నా రు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయలో క్రీడోత్సవాలను నిర్వహిస్తుండటంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అండర్–14, అండర్–17 విభాగంలో ఏటా పాఠశాలల్లో క్రీడలు జరుగుతాయి. మన జిల్లా నుంచి యేటా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఈ విద్యార్థులు అండర్–19 వి భాగంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా, వారికి శిక్షణ ఇవ్వడానికి వ్యాయా మ అధ్యాపకులు లేరు. దీంతో పాఠశాల స్థాయి పోటీలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలల నుంచి జూనియర్ కళాశాలల్లో చేరిన వారికి అక్కడ శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. -
సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్య
గద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్‌చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని శిక్షించాలి సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌పై సోమవారం కోర్టుహాలులో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, దేశఅత్యున్నత ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేదంటే అణగారిన వర్గాలపై వివక్ష, దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అర్థమవుతుందన్నారు. బీజేపీ పాలిత పాలిత రాష్ట్రాలలో మతోన్మాదులు దళితులపై అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రం స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తిని న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. -
ఇప్పటికే ఆలస్యమైంది..
విత్తనాలు విత్తేందుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తారనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే అధికారులు కాలయాపన చేస్తున్నారు. వెంటనే విత్తనాలు ఇస్తే విత్తుకుంటాం. – గోవిందు, రైతు, రాజాపురం పదును పోతుంది ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంట సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వలేదు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలి. – కాశిమన్న, రైతు, ఎక్లాస్పురం ● -
అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం
అలంపూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కై వలం చేసుకుంటుందన్నారు. బీజేపీ నుంచి పోటీదారులు అధికంగా ఉన్నారని, ఒక్కో స్థానానికి కనీసం ఐదుగురు పోటీదారులు ఉండటం సంతోషమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, వారి పథకాలను చూసి ప్రస్తుతం ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ అవినీతి తప్ప ప్రజలకు మేలు చేయలేదన్నారు. అందుకే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు కావాల్సిన వస్తు సేవలు దసరా కానుకగా పూర్తిగా తగ్గించిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చినవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగమల్లయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్, వినీత్ కుమార్, రంగస్వామి, సుధాకర్, రవికుమార్, లక్ష్మన్ నాయుడు, సాయిబాబ, దానారెడ్డి, రాఘవేంద్ర, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించారు!
● వేరుశనగ విత్తనాలు ఉచితంగా ఇస్తామని హామీ ● జిల్లాలో ప్రారంభంకాని సబ్సిడీ విత్తనాల పంపిణీ ● సాంకేతిక సమస్యలతో అడ్డంకులు ● సాగుకు ఆలస్యం అవుతుందని రైతుల ఆందోళన అయిజ: దేశ వ్యాప్తంగా ‘నేషనల్ మిషన్ ఎన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈఓ– ఓఎస్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వేరుశనగ విత్తనాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని అయిజ, ఇటిక్యాల, గట్టు మండలాల రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓ), వ్యవసాయ అధికారులు కలిసి ఉచితంగా వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తామని ప్రకటించినా సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఏఈఓలకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. సాగుకు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎదురుచూపులు.. అయిజలో సెప్టెంబర్ 27న ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా వేరుశనుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 30న రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 29న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీఓ) కార్యాలయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు రైతులు వెళ్లగా ఇవ్వలేదు. సెప్టెంబర్ 30న టోకెన్లు, విత్తనాలు ఒకేసారి ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆ మరుసటి రోజు ఎఫ్‌పీఓ కార్యాలయంవద్ద టోకెన్లు రాయించుకొని, రైతు వేదిక భవనం వద్దకు వెళ్లారు. అయితే ఏఈఓలకు యాప్ డౌన్లోడ్ కావడం లేదని, ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. వారంరోజుల అనంతరం విత్తనాలు ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందారు. ఇటీవల సరైన వర్షాలు కురిసాయని, ఆలస్యం అయితే పదును ఆరిపోతుందని, పొలంలో గడ్డి మెలుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన వేరుశనగ విత్తనాల వివరాలిలా.. మండలం రకం క్వింటాళ్లు అయిజ జీజేజీ–32 587.20 ’’ ’’ గిరినార్ – 5 150 ఇటిక్యాల జీజేజీ –32 582 ’’ ’’ గిరినార్ – 5 150 గట్టు జీజేజీ – 32 587 ’’ ’’ గిరినార్ – 5 150 సాంకేతిక సమస్యలతోనే.. విత్తనాలు ఇవ్వలేకపోవడానికి సాంకేతిక కారణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈఓల ఫోన్లలో యాప్‌లు డౌన్లోడ్ కావడంలేదు. శిక్షణ ఇవ్వనిదే ఏఈఓలు ప్రక్రియను పూర్తి చేయలేమంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకొని విత్తనాలు పంపిణీ చేస్తాం. – జనార్ధన్, ఏఓ త్వరలో పంపిణీ చేస్తాం జిల్లాలోని మూడు మండలాల్లో రైతులకు ఉచితంగా వేరుశనుగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉంది. త్వరగా పంపిణీ చేయాలని ఏఓలకు ఇంతవరకే సూచించాను. పంపిణీ చేయలేదనే విషయం నాకు తెలియదు. త్వరగా పంపిణీ చేసేలా ఆదేశిస్తా. – సక్రియానాయక్, డీఏఓ -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నుంచి వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,009 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 238 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5009, కనిష్టం రూ. 2729, సరాసరి రూ. 4809 ధరలు లభించాయి. అలాగే, 377 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5802, కనిష్టం రూ. 5661, సరాసరి రూ. 5720 ధరలు పలికాయి. టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్‌తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుల తడక..
● మృతిచెందిన, ఉద్యోగ విరమణ చేసిన వారికి డ్యూటీలు ● ఎన్నికల విధుల్లో బయటపడిన అధికార యంత్రాంగ డొల్లతనం గద్వాలటౌన్: ఎన్నికల నిర్వహణకు ముందే అధికార యంత్రాంగం డొల్లతనం బయటపడుతోంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ తయారు చేసిన జాబితాలు తప్పుల తడకగా మారాయి. చనిపోయిన వారికి, ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి, నెల రోజుల వ్యవధిలో పదవీ విరమణ పొందుతున్న వారికి చోటు కల్పించారు. ఇలా ఇష్టారాజ్యంగా, నిర్లక్ష్యంగా జాబితాలు రూపొందంచడంపై విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆర్ఓలు, పీఆర్ఓలుగా ఉపాధ్యాయులను నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు హాజరు కావాలని జాబితా విడుదల చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారులకు ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణకు హాజరైన క్రమంలో ఉపాధ్యాయులు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించారు. జాబితాలో తప్పులు దొర్లడం, సీనియర్లకు బదులు జూనియర్లకు పైస్థాయి హోదా కలిగిన బాధ్యతలు అప్పగించడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. జాబితాలో దొర్లిన తప్పులపై పలువురు ఉపాధ్యాయులు ఎంపీడీఓలతో వాదనకు దిగడంతో సరిచేస్తామని హామీఇచ్చారు. మచ్చుకు కొన్ని... ● కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న హుస్సేని రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కేటీదొడ్డి మండలంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ కావడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● గద్వాల మండలం గోనుపాడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం శేషయ్య గత నెల పదవీ విరమణ పొందారు. ఆయనకు పీఓగా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా పదవీ విరమణ చెందిన మరికొందరికి ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● కేటీదొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల జీహెచ్ఎం వెంకటనర్సయ్య డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలల లోపు పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వారికి ఎన్నికల విధులు కేటాయించారు. జిల్లాలో చాలా చోట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎంకు పీఓగా నియమిస్తే.. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఆయన కంటే పైస్థాయి ఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా జాబితాలో చోటు చేసుకున్న తప్పులపై ఉపాధ్యాయులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సరిదిద్దే పనిలో ఎంపీడీఓలు ఉన్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
అలంపూర్: పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులో చెత్తను తొలగించే పనులను మున్సిపల్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించే పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నివాస గృహాలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని సూచించారు. అయితే మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చెత్త తరలించే బండ్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఉదయం అందరూ పనులకు వెళ్లిన తర్వాత వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
ప్రారంభం ఘనం.. సేవలు శూన్యం
రూ.17 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ● రెండేళ్లు కావస్తున్నా అందుబాటులోకి రాని వైనం ● షాపులకు డిపాజిట్లు సరిగ్గా లేకపోవడంతో ఆగిన ప్రక్రియ అందుబాటులోకి ఎప్పుడో? నిర్మాణం పూర్తి అయి, ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ ఈమార్కెట్ దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అడిషనల్ కలెక్టర్ అధికారులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు కూరగాయల, ఫ్రూట్ ,మటన్, చికెన్, ఫిష్ వ్యాపారుల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. తరువాత షాపులకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే షాపుల కేటాయింపులో అవలంభించిన రిజర్వేషన్లు, అదేవిధంగా షాపులకు సంబంధించి వచ్చిన డిపాజిట్లు కూడా అనుకున్నంతమేర రాలేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి తీసుకరావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కూరగాయలు, నిత్యవసర సరుకులు, మటన్, ఫిష్, చికెన్ ఇలా అన్ని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడతాయి. ఇప్పటికై నా అధికారులు త్వరతితగిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాల్సి ఆవశ్యకత ఉంది. గద్వాల: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా కేంద్రం గద్వాల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ఈమార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖాళీ స్థలంలో 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో మార్కెట్ నిర్మించారు కానీ, అందుబాటులోకి తీసుకరావడంలో ఇక్కడి అధికారులు విఫలమవుతున్నారు. అన్ని ఒకేచోట గద్వాల పట్టణం జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం చాలా మంది పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. పట్టణం నలువైపులా విస్తరిస్తోంది. ఈక్రమంలో ప్రజలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై పాలకులు, అధికారులు దృష్టి సారించారు. పట్టణంలో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే ఉన్నది. అన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మార్కెట్‌యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్ డెవలెప్మెంట్ ఫండ్ దాదాపు రూ.17 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. 2021 సెప్టెంబర్ 14న శంకుస్థాపన అయిన మార్కెట్‌ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రారంభించారు. -
అధునాతన హంగులతో..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు బ్లాక్ వైస్‌గా వెజ్, నాన్‌వెజ్, సూపర్‌మార్కెట్, కమర్షియల్ దుకాణాలను వేరువేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్ బ్లాక్‌లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్ వైజ్‌గా కట్టారు. ఇక నాన్‌వెజ్‌కు సంబందించి మటన్, ఫిష్, చికెన్ దుకాణాల్లో ప్రతి దుకాణంలో నాన్‌వెజ్‌ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్‌ను, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్ రాడ్లను ఏర్పాటు చేశారు. నాన్‌వెజ్ బ్లాక్‌లో దుకాణాలు -
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు. -
ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ., దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
న్యాయఫలాలు అందరికీ అందాలి
● వనపర్తిలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ● వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్కుమార్సింగ్ వనపర్తి టౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్సింగ్ అన్నారు. ఆదివారం వనపర్తిలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని.. దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు ఆర్అండ్బీ అతిథిగృహంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పూలమొక్కలు అందజేసి సాధారంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి, తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీపీ కిరణ్‌కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మరో కొత్త రహదారి
అచ్చంపేట: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారితోపాటు శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్– శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ నుంచి ఆమనగల్, కొట్ర, డిండి, హాజీపూర్ (బ్రాహ్మణపల్లి) వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ణయించారు. ఈ రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితమే కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారితో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆకుతోటపల్లి– మన్ననూర్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఫ్యూచర్ (ఫోర్త్) సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెండు జాతీయ రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు.. అక్కడి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్ (ఆకుతోటపల్లి) వరకు ప్రతిపాదించిన 330 అడుగుల రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు రూ.1,665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ., రోడ్డును రిత్విక్ సంస్థ, రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమనగల్ వరకు చేపట్టనున్న 22.3 కి.మీ. రోడ్డును ఎల్అండ్టీ సంస్థ రూ.2,365 కోట్లకు దక్కించుకున్నాయి. భూ సేకరణ, టెండర్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఇటు నుంచి మన్ననూర్ వరకు కొత్త రోడ్డును విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి), ఆర్ఆర్ఆర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నుంచి అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు కొత్త రోడ్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి– చారకొండ మధ్య నుంచి భైరాపూర్, డిండి తూర్పుభాగం మీదుగా గువ్వలోనిపల్లి, రాయిచేడ్, బుడ్డతండా, బ్రాహ్మణపల్లి వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ సుమారు 50 కి.మీ., దూరం అవుతుంది. ప్రతిపాదిత రోడ్డు ఏర్పాటైతే హైదరాబాద్– శ్రీశైలం మధ్య 40 కి.మీ., దూరం తగ్గడంతోపాటు రెండు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, నంద్యాల వరకు తిరుపతి మార్గంగా, రావిర్యాల నుంచి మన్ననూర్ వరకు శ్రీశైలం రహదారులు వేరు కానున్నాయి. కొత్త రహదారితో ట్రాఫిక్ సమస్య తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్‌కు సుముఖత.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రూ.7,700 కోట్ల అంచనాలతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో ఏపీలోని కృష్ణపట్నం రేవుతోపాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరు, తిరుపతికి రాకపోకలు సులువు అవుతాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొందించగా.. 62.5 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్‌లో 56.2 కి.మీ., అటవీ మార్గం, 6.3 కి.మీ., అటవీయేతర ప్రాంతం. స్వల్ప మార్పులతో ఎన్హెచ్ఏఐ అధికారులు మన్ననూర్, వటువర్లపల్లి వద్ద ఎక్కి, దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నాలుగు వరుసలతో 30 అడుగల ఎత్తులో ఈ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈగలపెంట (కృష్ణగిరి)– సున్నిపెంట మధ్య ఉన్న డ్యాంపై ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య గంట ప్రయాణ సమయం, 9 కి.మీ.. దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మన్ననూర్ వరకు అనుసంధానం రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ప్రతిపాదనలు మన్ననూర్– శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో 40 కి.మీ., తగ్గనున్న దూరం -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతధికారుల సూచనలను ప్రజలు గుర్తించాలి. సులువుగా డబ్బు లు వస్తున్నాయంటేనే మోసం చేయడానికి అవతలి వారు వేస్తున్న వల అని నమ్మాలి. ఇప్పటి వరకు నమోదైన సైబర్ కేసుల విషయంలో విచారణ జరుగుతుంది. సైబర్ మోసాలపై ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యం దిశగా తీసుకువస్తున్నాం. అనధికారిక యాప్‌లు, ప్లాట్‌ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్, వాట్సాప్ ఇతర సామాజిక మాద్యమాల్లో వచ్చే సందేశాలు లేదా లింక్‌లను ఓపెన్ చేయరాదు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
సేవా దృక్పథం అలవర్చుకోవాలి
గద్వాలటౌన్ : విద్యార్థులకు చదువుతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరన్న పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, 2 ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని గుంటిపల్లి, కొత్తపల్లి గ్రామాలలో స్పెషల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండే సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలపై చైతన్యం కలిగించాలన్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు పవన్‌కుమార్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.యువతి మృతికి కారకుడిని అరెస్టు చేయాలిగద్వాల: ప్రేమపేరుతో మోసం చేసి యువతి మృతికి కారకులైన చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్‌గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్‌గౌడ్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకను ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరువాత మోసం చేశాడని, దీనిపై గతంలోనే ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈమేరకు చీటింగ్ కేసు నమోదు కాగా రఘునాథ్‌గౌడ్ జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రియాంక రఘునాథ్‌గౌడ్ ఇంట్లోనే నివసిస్తుందన్నారు. ఇదిలా ఉండగా పెళ్లికి నిరాకరిచండంతో రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఈకేసులో నిందితుడిని గతంలోనే కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంక ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదన్నారు. ఇప్పటికై న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, రాజు, సునందం, ప్రవీణ్, వేమన్న సాదతుల్లా పాల్గొన్నారు.కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిరాజోళి: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే హవా అని బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాజోళిలో మండల అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాల్లో బీజేపి గెలుపు తథ్యమని, మిగతా రెండు పార్టీలు కలిసినా బీజేపి మెజార్టీకి దరిదాపులకు రాలేవని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కారు చేత కాని పాలనలో ప్రజలు, గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు చరమ గీతం పాడిన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే దైర్యం కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలలను మోసం చేసిన గత పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, వీటిని ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి,నర్సింహులు,ఈసీ అంజనేయులు,రాజేష్, కొంకతి రాము,దస్తగిరి, బీమన్న,మధు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టంమదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 757 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. -
ఆరుగాలం ఆశలు.. నీటిపాలు
నదికి నీరు వచ్చిందని విస్తారంగా పంటల సాగు ● అధిక వర్షాలు, ముంచెత్తిన వాగులతో నీట మునిగిన పంటలు ● పత్తి, కంది పంటలకు భారీ నష్టం పత్తి పంట మొత్తం పోయింది వాగుల్లో నీటరు రావడంతో ఆదిలోనే మంచి జరుగుతుందని ఆశించి పత్తి పంటను సాగు చేశాం. కానీ తర్వాత వచ్చిన వర్షాలు, వాగు ల్లో వచ్చిన అధిక ప్రవాహం కారణంగా సాగు చేసిన పంటలు మొత్తం నీట మునిగాయి. దీంతో పంట ఏ మాత్రం చేతికి రాకుండా పోయింది. పత్తి కాయలు పూర్తిగా మాడిపో యి, ఎందుకు పనికి రాకుండా పోయాయి.ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – పురుషోత్తం, రైతు, ముండ్లదిన్నె ఆశలన్నీ జలమయం వాగులో ఉన్న నీటితోనే ప్రతి ఏడాది సుభిక్షమైన పంటలను పండించుకునే వాళ్లం. ఈ ఏడాది కూడా అలాగే సాగు చేద్దామని విత్తనాలు వేశాం. ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ నదులకు అధిక వరద రావడం, ఆ నీరు వాగులకు చేరడం, కుండపోత వర్షాలు కారణంగా పంటలు కనీసం కాపాడుకునే స్థితిలో కూడా లేకుండా పోయాయి. పత్తి, కంది పంటలు చాలా దెబ్బతిన్నాయి. రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. – ఉప్పరి మహేష్, ముండ్లదిన్నె, రాజోళి మండలం రాజోళి: కోటి ఆశలతో వాగుల కింద సేద్యం చేసిన రైతులకు సాగు సమయం పూర్తికాక ముందే నష్టం వాటిల్లింది. నీరు పుష్కలంగా వచ్చి పంటలకు ప్రాణం పోస్తుందనుకుంటే, నారు పెంచాల్సిన నీరు ఉసురు తీసిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది రైతులు వాగుల కింద వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఆశలకు జీవం పోసేలా వచ్చిన వాగులను నమ్ముకుని పంటలు సాగు చేస్తే, అధికంగా కురిసిన వర్షాలు, ముంచెత్తిన వాగులు, వంకలతో పంటలు రోజుల తరబడి నీటిలో మునిగిపోయి కోలుకోని నష్టాన్ని మిగిల్చాయి. వాగుల కింద జోరుగా సాగు అలంపూర్ నియోజకవర్గంలో వాగుల పరిదిలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వేల ఎకరాల్లో సాగును మొదలు పెట్టారు. రైతులు ఎక్కువగా పత్తి, కంది,వరి, అక్కడక్కడా మిరప పంటలు సాగు చేయగా.. సింహభాగం పత్తి పంటను సాగు చేశారు. సీజన్ ఆరంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తనాలు వేసినప్పటికీ, అనంతరం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి తుంగభద్ర, కృష్ణా నదులకు వచ్చిన వరద నీటితో వాగులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సాగు జోరు మరింతగా పెరిగింది. కానీ ఒక్కసారిగా కురిసిన అధిక వర్షాలతో వాగుల్లో కూడా ప్రవాహం పెరిగి, వాగుల పరిదిలో ఉన్న పంటలు నీట ముగినిపోయాయి. దీనికి తోడు రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆ పంటలు మరింత దెబ్బతిన్నాయి. సాధారణ ప్రదేశాల్లో సాగు అవుతున్న పంటలకు కేవలం వర్షాభావ పరిస్థితులే ఇబ్బందిగా మారగా..వాగుల కింద సాగవుతున్న పంటలకు వర్షాలతో పాటు, వాగుల నుండి వచ్చిన వరద నీరు కూడా ప్రభావం చూపింది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తే రానున్న సీజన్లోనైనా సాగును చేసుకుని నష్టాన్ని పూడ్చుకుంటామని రైతులు అంటున్నారు. ఆగం చేసిన వాగులు రాజోళి, మాన్‌దొడ్డి, ముండ్లదిన్నె వాగులతో పాటు, మానవపాడు మండలంలోని కలుకుంట్ల,ఉండవెళ్లి మండలం బొంకూరు గ్రా వాగు శివారులోని ఆయా గ్రామాల పరిదిలో ప్రవహించే లింకు వాగులు, వంకల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో ఎన్నో ఆశలతో సాగు మొదలుపెట్టిన రైతులను అధికంగా ప్రవహించిన వాగులు ఆగం చేశాయి. -
బీసీ జోష్..!
42 శాతం రిజర్వేషన్లతో వెనుకబడిన వర్గాల్లో ఉత్సాహం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆ వర్గంలో జోష్ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 20 శాతం మేర ప్రాతినిధ్యం పెరగనుండడంతో వారిలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2019 స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 22 శాతం రిజర్వేషన్ కల్పించగా.. ఆ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటడంతోపాటు జనరల్ స్థానాల్లోనూ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపుతో రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. జనరల్ స్థానాల్లోనూ హవా.. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 1,690 సర్పంచ్ స్థానాలు ఉండగా.. 406 బీసీ రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు మరో 238 జనరల్ స్థానాల్లోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు విజయం సాధించారు. అంటే మొత్తంగా 644 మంది బీసీలు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ● 2019 స్థానిక ఎన్నికల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 788 ఎంపీటీసీ స్థానాలు కాగా.. ఇందులో 217 స్థానాలను బీసీలకు కేటాయించారు. వీటితోపాటు మరో 125 జనరల్ స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటారు. మొత్తంగా 342 మంది బీసీలు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ● గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. మొత్తంగా 26 మంది బీసీ నాయకులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే.. 2019 స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన బీసీలు, ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గానికి రిజర్వేషన్లను పరిశీలిస్తే సర్పంచ్, ఎంపీటీసీల మధ్య పెద్దగా తేడా లేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 644 మంది బీసీలు సర్పంచ్‌లుగా ఎన్నిక కాగా.. ప్రస్తుత ఎన్ని కల్లో 621 స్థానాలు మాత్రమే ఆ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 342 మంది బీసీలు విజయం సాధించగా.. ఈసారి ఆ వర్గానికి 341 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం రిజర్వేషన్లు బీసీలకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వాటితోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీల లెక్క (మొత్తం 26 స్థానాలు)తో పోలిస్తే.. ఈసారి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం మరో ఏడు స్థానాల్లోనూ ఆ వర్గాల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తంగా గత జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 20 స్థానాలు రిజర్వ్ కాగా.. ఈసారి 33 స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన 13 స్థానాలు పెరిగాయి. కుల సంఘాలకు బాధ్యతలు.. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశంపై ఉత్కంఠతోపాటు సందిగ్ధం నెలకొన్నా.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉండడం.. తగ్గిన అన్ రిజర్వ్డ్ (జనరల్) స్థానాల్లో అభ్యర్థిత్వాల కోసం ఆయా వర్గాలకు చెందిన వారు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాలు, మండలాల వారీగా ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కుల సంఘాలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం పార్టీదే అయినప్పటికీ.. రిజర్వేషన్లకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో గెలుపొందే అభ్యర్థుల వడపోత బాధ్యతలను పలు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉన్న కుల సంఘాల నాయకులకు అప్పగించినట్లు సమాచారం. గత స్థానిక ఎన్నికలతో పోలిస్తే 20 శాతం అధికం 2019లో జనరల్ స్థానాల్లోనూ వారిదే హవా జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఆశాజనకం రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు పెరిగిన ప్రాధాన్యం -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కీలకంగా వ్యవహరించాలి ● ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. -
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
గద్వాల: విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన మాక్ ఎక్సర్సైజులను నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం, టేబుల్‌టాప్ వ్యాయమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన అలంపూర్‌లోని తుంగభద్రనది వద్ద ఉదయం 10గంటల నుంచి 1గంట వరకు ప్రధాన మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నాకె. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ దామోదర్‌సింగ్,అసిస్టెంట్ కమాండెంట్ ఫాణి, పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ -
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
● వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం ● దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు ● విభిన్న మార్గాల్లో సంస్థకూసమకూరనున్న ఆదాయం నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్‌నగర్ సుజాత 99592 26286 షాద్‌నగర్ ఉష 99592 26287 నాగర్‌కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్‌గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్‌గౌడ్ 90004 05878 బస్సుల స్థాయికి చార్జీలు ఇలా.. కి.మీ., ఎక్స్‌ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ (రూపాయలలో..) 201– 300 38,782 32,587 29,752 301– 400 38,782 38,782 35,002 401– 500 44,977 44,977 40,252 బస్సులో సీట్లు 50 40 34 దాతలు ముందుకు రావాలి.. తెలంగాణ ఆర్టీసీ నూతనంగా శ్రీకారం చుట్టిన యాత్ర దానం నిరుపేదలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు ఎవరైనా సహకరించి విరాళాలు ఇస్తే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇళ్లలో జరుపుకొనే వేడుకలకు సమాంతరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం ఇవ్వడానికి ముందుకు రావాలి. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ -
ప్రముఖుల ప్రత్యేక పూజలు
దసరా వేడుకలలో గద్వాల సంస్థానాధీశుల వారసుడు కృష్ణరాంభూపాల్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు వేర్వేరుగా పాల్గొన్నారు. గురువారం రాత్రి స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు శమీ వృక్షానికి సామూహికంగా హారతులు సమర్పించారు. అనంతరం శమీవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్థానిక పెద్ద ఆగ్రహారంలోని శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఉత్సవమూర్తుల మహా రథోత్సవం వైభవంగా సాగింది. -
అంగరంగ వైభవంగా..!
జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు● అలంపూర్ జోగుళాంబ ఆలయ సన్నిధి, జములమ్మ ఆలయంలో ఉట్టిపడిన దసరా శోభ ● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు గద్వాలటౌన్: చెడుపై మంచికి విజయం.. దుష్టశిక్షణ శిష్టరక్షణ..కోటి ఆశలతో కొంగొత్త జీవితాలకు శ్రీకారం.. శమీపూజల సందడి.. సరదా సరదాగా దసరా సంబరం.. ఆశ్వీయుజ మాసం దశమిని పురస్కరించుకొని గురువారం గద్వాలలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతంలో అర్జునుడు చేసిన శమీ పూజలు గుర్తు చేసుకుంటూ పూజలు చేశారు. శమీ ఆకులను(బంగారం) ఇచ్చి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ జోగుళాంబ సన్నిధిలో దసరా శోభ ఉట్టిపడింది. మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి అలయం, పాగుంట శ్రీవెంకటేశ్వర ఆలయం, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాలలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టారు. ఆయా ఆలయాల దగ్గర శమీపూజ, పల్లకి సేవ నిర్వహించారు. ఉదయం ఇంటిల్లి పాదీ కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు, అర్చనలు నిర్వహించారు. దుర్గా మాత మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరి పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న శమీవృక్షం (జమ్మిచెట్టు) చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో 9 రోజుల పాటు పూజలందుకున్న స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. కోట నుంచి గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. గద్వాల సంస్థానాఽధీశుల వారసుడు కృష్ణరామభూపాల్కు స్వాగతం పలుకుతూ.. కనులపండువగా తెప్పోత్సవం ఉత్సవాలను పురస్కరించుకొని నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి తెప్పోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్త జన సందోహంతో గద్వాల పులకించింది. గురువారం రాత్రి 7గంటల ప్రాంతంలో పండితులు పూజలు నిర్వహించి వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి ఊరేగింపునకు ముందు భజన మండలి సభ్యులు భక్తి గీతాలు పాడుతూ సాగారు. విద్యుద్దీపాకాంతులతో సుందరంగా అలంకరించిన పుష్కర ఘాట్‌లో నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవం వేడుకల్లో పాల్గొని భక్తులు తరించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు తెప్పోత్సవ వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
గట్టు: త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గట్టులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామాల రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గవిభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ సర్పంచు మోహన్‌గౌడు, నాయకులు రామన్‌గౌడు, రామకృష్ణారెడ్డి, గద్వాలతిమ్మప్ప,మాచర్ల అలి,రాయాపురం రాముడు తదితరులు పాల్గొన్నారు. -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్‌లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్‌కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్‌తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
దుర్గామాత నిమజ్జనోత్సవం
లోకాలను కాపాడే లోకపావనీ.. నీకు వీడ్కోలు అంటూ దుర్గామాతాను కొలిచారు. దేవీ శరన్నవరాత్రుల్లో విశేష పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కనులపండువగా. స్థానిక బాలాజీ వీధిలో ఆరెకటిక సంఘం, రాంనగర్ రామాలయం, తెలుగుపేట శివాలయం, ఆర్యవైశ్య సంఘం, శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతల విగ్రహాలను రాత్రి ఊరేగించారు. ఈ సందర్భంగా డప్పుమేళాలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని తరలించారు. ఆయా ఆలయాల నిర్వాహకులు చేపట్టిన అమ్మవారి శోభయాత్రలో వాయిద్యకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిమల రథాలకు మహిళలు ఎదురుగా వచ్చి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారి నిమజ్జనోత్సవం ప్రతిమ ముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం కృష్ణానదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. నవధాన్యాల మొలకల నిమజ్జనం గట్టు: విజయ దశమి వేడుకల్లో భాగంగా గట్టులోని భవాని ఆలయం పక్కనే ఉన్న శేషంబావిలో నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా గట్టులోని ఎప్ఎస్కే సమాజ్ తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో నవ ధాన్యాల మొలకలను పెంచి, విజయ దశమి పండుగ రోజున గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భవాని ఆలయం పక్కనే ఉన్న పూరాతన కాలం నాటి శేషంబావిలొ నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు. -
గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం
గద్వాలటౌన్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత గాంధీజీకి మాత్రమే సాధ్యమైందని.. సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌లోని గాంధీజీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, పలు సంఘాల నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన నాయకులు వేర్వేరుగా గాంధీ జయంతిని నిర్వహించారు. స్థానిక చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సాంఘిక, ఆర్థిక విషయాలను జోడించి పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. సరిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సైతం గాంఽధీచౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంఽధీ చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ● గద్వాల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా నేతలు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సేవలు కొనియాడారు. వీరితో పాటు పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నిండాలి
గద్వాల న్యూటౌన్: స్థానిక సఖీ కేంద్రం ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా సంక్షేమ అధికారి సునంద ముఖ్య అతిథిగా హాజరై రంగురంగుల పుష్పాలతో చూడముచ్చటగా రూపొందించచిన బతుకమ్మకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు ఇంట్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సహదేవుడు, శైలజ, డీసీపీఓ నరసింహ, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్, సఖీ, భరోసా, బాలసదనం విభాగాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో బతకమ్మ సంబురాలు అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో తొలిసారి వైద్య అధికారులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వైద్య విధాన పరిషత్ సంచాలకులు రమేష్‌చంద్ర ఆధ్వర్యంలో వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది రంగు రంగు పూలతో బతకమ్మలను సిద్ధం చేశారు. అదేవిధంగా దుర్గాష్టమి సందర్భంగా వైద్య పరికరాలకు ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ అమీర్, వైద్యులు దివ్య, వృషాలి, ప్రవీణ్, మహేష్, వైద్య సిబ్బంది, పారమెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గద్వాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్నికల అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు నిబద్ధతో పనిచేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల విగ్రహాలకు మాస్కులు వేయించాలని, పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు పనులు జిల్లా నోడల్ అధికారులతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు, జీపీఓలు పర్యవేక్షించాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం, ప్రచార సమయం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం వంటి విషయాలపై సమగ్రంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, భూ సేకరణ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, డీపీఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు. నాయకులు సహకరించాలి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియామావళిపై ప్రతి గ్రామంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కనీసం ఒక్క కార్యకర్తకై నా అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై రాజకీయ ప్రచారాలకు సంబంధించి రాతలు, పోస్టర్లు అతికిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు భవనాలపై సైతం ఏమైనా పోస్టర్లు అతికిస్తే సంబంధిత యజమానుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సంబందిత అధికారులకు సంప్రదించాలని సూచించారు. -
ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ
గద్వాల క్రైం: విజయదశమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ దళ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆయుధ పూజ సతీసమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజంలో చెడును నిలువరించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకముందు జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, సిబ్బందికి ఎస్పీ ముందుస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు శ్రీను, రవిబాబు, టాటబాబు, ఆర్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు. 1,259 ఎకరాల్లో వరిపంట నష్టం కృష్ణా: కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లో వరదల కారణంగా మండలంలో 1,259 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరి, పత్తి పంట కూడా దెబ్బతిందని.. రెండు పంటల నష్టం వివరాల పూర్తి నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
పశు సంపదతోనేవ్యవసాయాభివృద్ధి
గద్వాల న్యూటౌన్: పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతాపురంలో కేఆర్‌ఐబీహెచ్‌సీఓ సంస్థ సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పశు సంపదతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా, మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడుగా ఉంటాయని తెలిపారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు చేయించాలన్నారు. శిబిరంలో భాగంగా 21 పశువులకు గర్భకోశ పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు. అవసరమైన పశువులకు మందులు అందించడంతో పాటు, రాయితీ గడ్డి విత్తనాలు రైతులకు అందజేశారు. కార్యక్రమంలో కేఆర్‌ఐబీహెచ్‌సీఓ సంస్థ ప్రతినిధి రవికుమార్, గద్వాల మండల పశువైద్యాధికారి డాక్టర్ అర్పిత, డాక్టర్ పుష్పలత, డాక్టర్ మల్లేష్, డాక్టర్ హరిప్రియ, వెటర్నరీ అసిస్టెంట్ ప్రభాకర్, గోపాలమిత్రలు రామాంజనేయులు, ప్రభాకర్, పాడి రైతులు పాల్గొన్నారు. మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం ● నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు ● మిగిలిన జిల్లాల్లో నమోదు కాని టెండర్లు మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్‌కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నది పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటాం ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కృష్ణా: వరదల కారణంగా కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లిందని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వాసూనగర్, తంగిడి, కుసుమర్తి, సూకూర్ లింగంపల్లిలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన రైతులను తాము అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వరదలతో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు పంటనష్టంతో పాటు ఇతరాత్ర నష్టం వివరాలను పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. తంగిడి, కుసుమర్తిలో తాగునీటి అవసరాలకు చేతిపంపులు మంజూరు చేశారు. కృష్ణాలో రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెనుక స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతోష్ పాటిల్, సర్ఫరాజ్‌ఖాన్, విజప్పగౌడ, వీరేంద్రపాటిల్, నాగప్ప, మహదేవ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. -
గడువు తక్కువ..లక్ష్యం ఎక్కువ
జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పా తవి కాగా.. అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ లు కొత్తగా ఏర్పడ్డాయి. అధికారులకు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వలన ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అధికారులు పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా జిల్లాలోని మున్సిపాలిటీల్లో పావు వంతు పన్నులు కూడా వసూలు కాలేదు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీని కూడా కొంతమంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ పథకంపై అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంతకాలం మిన్నకుండిన అధికారు లు గడువు సమీపిస్తుండటం, మరోవైపు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు పన్ను వసూళ్లలో వేగం పెంచే పనిలో ఉన్నారు. సకాలంలో చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా నోటీసులు అందజేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపడతాం ఆస్తిపన్నుతో పాటు బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఆ దిశగా చర్యలు చేపడుతున్నాం. పన్ను బకాయిదారులకు అవగాహన కల్పించాం. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి అనుకున్న పన్ను వసూళ్లను రాబడతాం. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. – జానకీరామ్, కమిషనర్,ఽ గద్వాల● -
పాలనలో నిస్తేజం..!
జిల్లాలోని మున్సిపాలిటీల్లో 50 శాతం దాటని పన్ను వసూళ్లు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ● అభివృద్ధి పనులపై ప్రభావం ● సిబ్బందిలో సమన్వయ లోపం గద్వాల టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలన నిస్తేజంగా మారింది. అధికారులకు కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ లేకుండా పోయింది. చివరకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిర్దేశించిన లక్ష్యంలో రెవెన్యూ సిబ్బంది కనీసం సగటును కూడా సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా 50 శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యాన్ని దాటలేదు. ఈ విషయాలను చక్కదిద్దే ప్రయత్నం చేయని అధికారులు.. అభివృద్ధిపై, నిధుల మంజూరుపై ఊకదంపుడు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. అధికారుల హడావుడి ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ గడువులోగా పన్నులు చెల్లించాలంటూ పేదవారిపైనే ఒత్తిడి చేస్తున్న అధికారులు.. పలుకుబడి కలిగిన వారిపై మెతక వైఖరి అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025–26వ ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. మిగతా కాలంలోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అధికారులు హడాహుడి చేస్తున్నారు. పట్టింపు కరువు మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు లేవని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పన్నుల వసూళ్లలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్ల బకాయిదారులపై కొరడా ఝులింపించి పన్ను వసూళ్లు చేయగలిగారు. ప్రస్తుతం అధికారుల ఉదాసీనత వల్ల ఏటా రూ.కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. గద్వాల మున్సిపాలిటీలో రెగ్యులర్ ఆస్తిపన్ను కాకుండా, రూ.5.10 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. అయిజ మున్సిపాలిటీలో రూ.30.26 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ విభాగంలో సిబ్బంది కొరతతో పాటు, కొత్తగా నియామకం అయిన వార్డు ఆఫీసర్లకు ఇతర విభాగాల బాధ్యతలను అప్పగించడం.. ఆరు నెలల్లోనే మిగిలిన 70 శాతం మేర పన్నులను వసూలు చేయాల్సి ఉంది. -
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
గద్వాల: సమాచార హక్కు చట్టం–2025 ప్రకారం పౌరులు ఆయా శాఖల నిర్ధేశిత సమాచారం నిబంధనల ప్రకారం అడిగినప్పుడు నిర్ణీత సమయంలో ఇవ్వడం అధికారుల బాధ్యత అని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. సమాచార హక్కుచట్టం కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా స్థాయి అప్పిలేట్ అథారిటీ, పబ్లీక్ ఇన్‌ర్మేషన్ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులపై ప్రతిమూడు నెలలకోసారి సమీక్షించేవాళ్లమని, ఇప్పుడు నెలకోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను వాటికి ఇచ్చిన సమాచారం వివరాలను ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సమాచారహక్కు బోర్డులో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల వివరాలు డిస్ప్లే చేయాలన్నారు. ఈసమావేశంలో కలెక్టరేట్ ఏవో భూపాల్‌రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రహదారులే గోదారులు..
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడితే చాలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటితో నిలిచి గోదారిని తలపించాయి. కూరగాయల మార్కెట్, రథశాల, రాజీవ్‌మార్గ్, సోమనాద్రి స్టేడియం తదితర ప్రాంతాలలో నీరు నిలవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, పాదచారులు వర్షం ధాటికి ఇబ్బందులు పడ్డారు. చెత్త మురుగుతో కలిసి వర్షపునీరు రోడ్లపై పారింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీళ్లతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై పేరుకుపోయిన వర్షపు నీటిని, మురుగును సకాలంలో తొలగించి చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. అలాగే, సంతలో చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బురద నీటిలోనే కూర్చొని వ్యాపారాలను నిర్వహించుకున్నారు. దుస్తుల వ్యాపారులు తమ గుడారాలను తొలగించుకున్నారు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సంత జరుగుతున్న తేరుమైదానం వర్షం నీటితో బురదమయంగా మారింది. బురద నీటిలోనే కూరగాయలను విక్రయించారు. కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం సంత వ్యాపారులకు నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చింది. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్దకల్: వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సిద్దప్ప వైద్యసిబ్బందికి సూచించారు. సోమవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసిబ్బంది, రోగుల నమోదు రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన స్వస్థి నారీ స్వశక్తి పరీవార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి వివిధ విభాగాలకు సంబంధించిన 8మంది వైద్యులు మల్దకల్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో 302మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అవసరమైన వారికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేసినట్లు డాక్టర్ స్వరూపరాణి తెలిపారు. మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకుని వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబం అన్ని విధాలా బాగుంటుందన్నారు.డాక్టర్లు సంధ్య కిరణ్మయి, రిజ్వానా, ప్రసూన పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 12 అర్జీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు మొత్తం 12 మంది అర్జీలు అందాయి. సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
వాడవాడలా బతుకమ్మ సంబరాలు
గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మను మహిళలు కీర్తించారు. సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జామాయే సందమామ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పడుతూ ఆటలు ఆడారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అధ్యాపకులు, విద్యార్థినులు కళాశాల ఆవరణలో బతుకమ్మలను ఒకచోట చేర్చి పాటలకు అనుగుణంగా లయబద్దంగా చప్పట్లు చరుస్తూ ఆడారు. ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. అధ్యాపకుల, విద్యార్థినులతో కలిసి బొడ్డెమ్మలు వేశారు. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం రెండు రోజుల పాటు బతుకమ్మ పాటలు హోరెత్తించాయి. పట్టణంలోని సగ భాగం కాలనీలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రెండవ వార్డులోని తాయమ్మ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆటపాటలతో ఉత్సహంగా గడిపారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీలో బతుకమ్మ సందడి కనిపించింది. బొడ్డెమ్మలు, కోలాటాలతో సందడి చేశారు. 03, 06, 12, 27, 28 33, 34 తదితర వార్డులలో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం అందుబాటులో ఉన్న జలశయాలలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి జ్యోతి మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. బతుకమ్మ మహిళలకు ప్రత్యేకమైన పండగ అని వివరించారు. బతుకమ్మ పండగ వారసత్వ సంపదగా మిగిలి ఉందని చెప్పారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
బీచుపల్లిలో నీట మునిగిన గుడిసెలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతుండడంతో జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.70లక్షల క్యూసెక్కులకుపైగా వరద దిగువన ఉన్న శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో బీచుపల్లి వద్ద కృష్ణనది ఉగ్రరూపం దాల్చుతోంది. పుష్కరఘాట్లు పూర్తిగా వరద నీటిలో మునగడంతో పాటు శివాలయం, పిండప్రదాన గదులు సైతం వరద నీరు చుట్టుముట్టాయి. శివాలయం సమీపంలో పలు హోటల్లు, గుడిసెలు వరద నీటిలో మునగడంతో అధికారులు వారిని అక్కచి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచుపల్లిలోని కోదండ రామస్వామి ఆలయ సమీపంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదండాపురం ఎస్ఐ మురళి తెలిపారు. ప్రస్తుతం కృష్ణానదికి వరద ప్రవాహం అధికంగా ఉందని, నది పరివాహక ప్రాంతంలో నివసించే గొర్లు, బర్రెల కాపరులు మేత కోసం, మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లరాదని తెలిపారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలను దాటేటప్పుడు వాహనదారులు, ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
విద్యాప్రదాయిని సరస్వతీదేవి
గద్వాలటౌన్/ఎర్రవల్లి: అజ్ఞానులకు జ్ఞానం ప్రసాదించే జ్ఞానప్రదాయినిగా... సకల జగత్తుకు ఆధారమైన వేదాలను ప్రసాదించిన వరదాయినిగా... చదువుల నొసగే అభయ ప్రదాయినిగా.. సరస్వతీదేవిగా అమ్మవారు జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దేవిశరన్నవరాత్రుల ఉత్సవాలు గద్వాలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవి రూపంలో, కన్యకాపరమేశ్వరి, రెండవవార్డులోని శక్తిస్వరూణి తాయమ్మ ఆలయంలో, పిలిగుండ్లలోని శివకామేశ్వరి దేవి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో, బాలాజీవీధిలోని శివాలయంలో, కాళికామాత, కుమ్మరివీధిలలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆయా ఆలయాలలో మహిళలు కుంకుమార్చనలు చేశారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ● బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత సరస్వతీదేవి అవతారంలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞానసరస్వతీదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్‌రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ గండికి మట్టి తరలింపు
● నిలిచిన వర్షం.. ఊపిరి పీల్చుకున్న మూడు గ్రామాల రైతులు గట్టు: వర్షాలు నిలిచినప్పటికి చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లోకి వాగులు, వంకల్లో నుంచి నీటి ఉధృతి కొనసాగుతోంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు రిజర్వాయర్ గండిని పూడ్చిన చోట మట్టిని తరలించి ఎత్తును పెంచారు. భారీ వర్షాలకు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి దగ్గర పూడ్చిన మట్టికి సమాంతరంగా రిజర్వాయర్ నీరు వచ్చి చేరారు. వర్షాలు ఇలాగే కొనసాగి ఉంటే గండిని పూడ్చిన చోట రిజర్వాయర్ కట్ట కోతకు గురై నీరంతా బయటకు వెళ్లేది. చిన్నోనిపల్లె, లింగాపురం, బోయలగూడెం గ్రామాలకు చెందిన రైతులు చిన్నోనిపల్లె రిజర్వాయర్ వద్దకు చేరుకుని మట్టి కట్ట తెగిపోకుండా మట్టిని తరలించే విధంగా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజులపాటు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి పూడ్చిన చోట మరికొంత మట్టిని తరలించి, కట్ట ఎత్తు పెంచారు. వరుణుడు శాంతించడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరగకుండా సమాంతర కాల్వ ద్వారా రిజర్వాయర్ నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరగడంతో చిన్నోనిపల్లె గ్రామంలోని ఇళ్ల మధ్యకు బ్యాక్ వాటర్ వచ్చి చేరాయి. గ్రామ శివారుల్లో రైతులు సాగు చేసుకున్న పంట పొలాల్లోకి రిజర్వాయర్ నీరు వచ్చి చేరి, పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముంపునకు గురైన చిన్నోనిపల్లె గ్రామస్తులు పునరావాస కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొందరు తాత్కాలికంగా రేకుల గుడిసెలను వేసుకుని తలదాచుకుంటుండగా, మరికొంత మంది పాత గ్రామంలోని పాత ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. పాత ఊరిని పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మారితే, రిజర్వాయర్ మిగిలిన పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు అవకాశం ఉంటుంది. -
చేతులెత్తేశారు..!
సంక్షోభంలో సీడ్ పత్తి సాగు ● పెట్టుబడుల కోసం రైతుల వెంపర్లాట ● అప్పు చేసి మరీ కూలీలు చెల్లిస్తున్న వైనం ● జిల్లా వ్యాప్తంగా 31,469 ఎకరాల్లో సాగు ● గతేడాది చెల్లింపుల లెక్కలు చేయడంలో ఆర్గనైజర్ల తాత్సారం ● అధిక వర్షాలతో పంటపై మరింత దెబ్బ ●ఎకరా విస్తర్ణంలో సీడు పత్తి సాగు చేశా. మొదట్లో కొంత మేర పెట్టుబడికి ఆర్గనైజర్లు డబ్బులిచ్చారు. క్రాసింగ్ పనుల సమయంలో డబ్బులు ఇవ్వలేక పోవడంతో మధ్యలోనే క్రాసింగ్ పనులను నిలిపి వేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేక ఎక్కువ రోజులు క్రాసింగ్ పనులు చేయకుండా మధ్యలోనే ఆపేశాను. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. ఇప్పటి దాకా సీడ్ పత్తి సాగుకు 80 వేల వరకు ఖర్చు చేశారు. దీనికితోడు ముసురు వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. – గోపాల్, సీడ్‌పత్తి రైతు, రాయాపురం సీడ్ పత్తి సాగును మధ్యలోనే వదులు కోవాల్సి వచ్చింది. ఎకరా విస్తర్ణంలో సీడ్ పత్తిని సాగు చేశా. ఇప్పటి దాకా రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టాను. క్రాసింగ్ పనుల కోసం కూలీలను రప్పించుకున్నా. తీరా ఆర్గనైజర్ డబ్బులు ఇవ్వకపోవడంతో క్రాసింగ్ పనులను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కూలీలకు మరో చోట అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది. దీనికితోడు ఎడతెరపి లేని వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. – వార్ల రాజు, రైతు గట్టు గట్టు: నడిగడ్డలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు ప్రకృతి.. మరో వైపు మధ్యవర్తులు (ఆర్గనైజరు) పత్తివిత్తనోత్పత్తి రైతులకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు సీడ్ పత్తి సాగు చేసే రైతులు పంట నిమిత్తం అప్పు కోసం వెళ్తే.. ఆర్గనైజర్లు ఇట్టే డబ్బులిచ్చేవారు. ఇప్పుడు ఎదురుపడితే ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని కొందరు తప్పించుకు తిరిగే పరిస్థితి నెలకొంది. నేరుగా కలిసినా డబ్బులు ఇవ్వలేమంటూ చేతులెత్తుస్తున్నారు. దీంతో పత్తి రైతులు పత్తివిత్తనోత్పత్తి సాగును చివరివరకు కొనసాగిద్దామా లేక మధ్యలోనే వదిలేద్దామా అనే సందిగ్ధంలో పడ్డారు. పెట్టుబడులకు డబ్బులు లేక కొంత మంది సీడ్ పత్తి సాగును మధ్యలోనే వదిలేస్తుండగా మరి కొంత మంది రైతులు మరో చోట అప్పులు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 31,469 ఎకరాల్లో సీడ్ పత్తిని సాగు చేస్తున్నట్లు అంచనా. రైతులకు సుమారుగా రూ.550 కోట్ల నుంచి రూ.650 కోట్ల వరకు మధ్యవర్తుల ద్వారా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే కంపెనీలు మధ్యవర్తుల ద్వారా రైతులకు రూ.350 కోట్లను వరకు మాత్రమే చెల్లించి, మిగతా రూ.300 కోట్ల చెల్లింపుల గురించి మాట్లాడకుండడంతో రైతులు ఏం దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. కూలీలకు డబ్బులు కరువు ఈ ఏడాది సీడ్ పత్తిని సాగు చేసిన రైతులు పెట్టుబడికి చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రాసింగ్ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు డబ్బులు చెల్లించాలని, డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడుతున్నా..అబ్బే మా దగ్గర డబ్బుల్లేవంటూ ఆర్గనైజర్లు తప్పించుకుని తిరిగే పరిస్థితి నడిగడ్డలో దాపురించింది. దీంతో 60 రోజుల పాటుగా క్రాసింగ్ పనులను సాగించాల్సిన రైతులు 30 నుంచి 40 రోజుల వరకు పనులు చేసి, కూలీలను వెనక్కి పంపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు భోజనం, వసతితో పాటుగా ఒక్కోక్కరికి రూ.18 వేల నుంచి 21 వేలను 30 రోజులకు చెల్లిస్తుంటారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. సీడ్ పత్తిని సాగు చేసిన రైతులు తాము పండించిన పత్తిని నవంబర్, డిసెంబర్ నెలల్లో మిల్లులో జిన్నింగ్ ఆడిస్తారు, పత్తి నుంచి గింజలను బయటకు తీసిన తర్వాత, వాటిని రైతుల సమక్షంలో శ్యాంపిల్స్ తీసి కంపెనీకి పంపుతారు. సంక్రాంతి నాటికి ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే రైతులకు చెల్లించాల్సిన డబ్బులను మాత్రం జూలైలో లెక్కలు చేస్తారు. పంట సాగు కోసం తీసుకున్న అప్పు, దానికి వడ్డీ కలిపి లెక్కకడతారు. తాము పండించిన పంటకు చెల్లించాల్సిన డబ్బులను లెక్క చేసి, మిగులుబాటు ఉంటే రైతులకు చెల్లింపులు చేస్తారు. లేకపోతే కొంత మేరకు పెట్టుబడికి ఇచ్చి, పంట పండించాలని రైతులకు చెబుతారు. అయితే 2024–25 సంవత్సరానికి సంబందించి సీడ్ ఆర్గనైజర్లు కొంత మంది రైతుల లెక్కలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది సీడ్ పత్తి రైతుపై ప్రకృతి పగ పట్టిందని రైతులు వాపోతున్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. క్రాసింగ్ కొనసాగుతున్న తరుణం (ఆగస్టు/సెప్టెంబర్) లో వర్షాలు విరామం లేకుండా కురువడంతో క్రాసింగ్ నిలవడం లేదని పేర్కొంటురు. ప్రస్తుతం ముందస్తు చేసిన క్రాసింగ్ పనుల కారణంగా సీడ్ పత్తి కాయలు పగిలి పత్తి తీసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వర్షాల కారణంగా పత్తి తడిచి దెబ్బతింటున్నట్లు రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలు ఎక్కువ కావడంతో పత్తి చేను ఎర్రబారి దిగుబడిపై ప్రబావం చూపుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సిఐ రవిబాబు, ఎస్సై రవినాయక్ ఉన్నారు. ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది. బీచుపల్లి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ బీచుపల్లి వద్ద వరద ఉధృతిని పరిశీలిస్తున్న డీఎస్పీ మొగిలియ్య -
దుర్గమ్మ తల్లి
కరుణించవమ్మా..● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గద్వాలటౌన్: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. ఆది పరాశక్తి.. అందరినీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వరోజు ఆదివారం అమ్మవారు వివిధ ఆలయాలలో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్యామలదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవి, పిల్లిగుండ్లలోని శ్రీశివ కామేశ్వరి దేవి అమ్మవారు చంద్రవాహిని, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
గద్వాలటౌన్: తన జీవితాన్ని చివరి వరకు ప్రజా పోరాటాలకు అంకితం ఇచ్చిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు వక్తలు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వేరువేరుగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానీయుడు బాపూజీని కొనియాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సమరం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు మాట్లాడుతూ.. చేనేతతో పాటు వివిధ చేతివృత్తుల వారికి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహించారన్నారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాత అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సబ్సిడీ విత్తనాలు వినియోగించుకోవాలి
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం (ఎన్ఎంఈఓ ఓఎస్)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా రైతులకు ఉచితంగా అందజేస్తున్న వేరుశనగ విత్తనాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వంద శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, టెక్నికల్ ఏడీఏ మహాలక్ష్మి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నోనిపల్లి రిజర్వాయర్‌లో పెరిగిన నీటిమట్టం
గట్టు : చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను శనివారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల్లోని వరద రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతున్న తరుణంలో గతంలో గండిని పూడ్చిన చోటుకు సమీపంలో నీరు వచ్చి చేరాయి. రిజర్వాయర్‌లో ఎక్కువైన నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ ఉన్నప్పటికీ నీటికి బయటకు వెళ్లట్లేదు. రిజర్వాయర్‌లోకి వచ్చే నీరు ఎక్కువగా వస్తుండడంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, గిర్ధావర్ రాజు, ఇరిగేషన్ అధికారులు చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వర్షాలు తగ్గిన నేపథ్యంలో మట్టి కట్టను మరి కొంత మేరకు పెంచితే రిజర్వాయర్‌లోని నీరు కాల్వ ద్వారా బయటకు వెళ్లిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ
గద్వాలటౌన్: అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాల్లో శనివారం వైభంగా నిర్వహించారు. ఆరో రోజు స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలరాముడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దేవిగా, తాయమ్మ ఆలయం, కుమ్మరివీధి, అంబాభవాని ఆలయం, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. బాలాజీ వీధుల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. -
ఉధృతంగా పారుతున్న వాగులు
సాతర్ల సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు చెన్నిపాడులో మిరప పంటలో నిలిచిన వర్షం నీరు నీలహళ్లి, పాతపాలెం మధ్య పారుతున్న వాగు ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగు ఉధృతంగా ప్రవహించింది. పంటలు నీట మునగడంతో నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. బొంకూరులో వర్షానికి షాకినాబీ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మానవపాడు మండలంలో భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవపాడు–అమరవాయి, మానవపాడు–గోకులపాడు వాగులు పొంగిపోర్లాయి. సాక్షి, నెట్వర్క్: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసి వర్షాలతో జిల్లావ్యాప్తంగా పలు కుంటలు, చెరువులు అలుగులు పారుతున్నాయి. శనివారం లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉండడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. పంటలు నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. గట్టు పెద్ద చెరువు నిండి అలుగు పారింది. మాజీ ఎంపీటీసీ కృష్ణ చెరువు అలుగు వద్ద గంగమ్మకు పూజలు చేశారు. మండలంలో అత్యధికంగా 118.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధరూరు మండలంలోని నీలహళ్లి, పాతపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిచడంతో 6 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గడంతో రాకపోకలు కొనసాగించారు. రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని షేకుపల్లి, సాసనూలు, గార్లపాడు, ఉదండాపురం, సాతర్ల, శనిగపల్లి, చాగాపురం, ఇటిక్యాల తదితర గ్రామాల సమీపంలోని పలు వాగులు శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాల్లో పత్తి, మిరప, బెండ, పొగాకు, వరి పంటల్లో వర్షపు నీరు చేరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
ఏటీసీల్లో కార్పొరేట్ స్థాయి నైపుణ్య శిక్షణ
గద్వాల టౌన్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం పట్టణ శివారులోని నూతన ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. యువత అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొంది, ఆధునిక నైపుణ్యాలను అభ్యసించి, భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహాకారంతో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఏటీసీలో 172 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.45 కోట్ల వ్యయం చేసిందని, ప్రతి విద్యార్థికి వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల స్టైఫండ్ అందిస్తామన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ఏటీసీలో చదివిన ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేష్‌కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలాక్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్ములు పాల్గొన్నారు. -
విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
గద్వాలన్యూటౌన్: విద్యార్థులు తమతమ లక్ష్యాలను అందుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు అవసరమైన ప్రోత్సాహన్ని అందించాలని ఇంటర్‌బోర్డు జాయింట్ డైరెక్టర్ విశ్వేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు అధ్యాపకులతో పాటు, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రోజు కళాశాలకు వస్తున్నారా.. లేదా.. అని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. తరుచూ కళాశాలకు వస్తూ తమ పిల్లల ప్రతిభ ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక నుంచి తరుచూ పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎడతెరిపి లేకుండా..
గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం గద్వాల: జిల్లా వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి జనజీవనం అతాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారిగా కృష్ణానది పొంగి ప్రవహిస్తుండడంతో గుర్రంగడ్డలోని జములమ్మ అమ్మవారి ఆలయంలోకి నీరువచ్చి చేరింది. అదేవిధంగా చెరువులు, కుంటలు వాననీరు చేరి నిండుకుండలుగా మారాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు.. రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటాయో వాటిని ముందుస్తుగానే గుర్తించి ఆయాప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. జిల్లాలో గద్వాల మండలంలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో కనిష్టంగా 7.2 మి.మీ.ల వర్షం కురిసింది. పంటలకు తీరని నష్టం కేటీదొడ్డి మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంటను వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆవేదన చెందారు. అలాగే,మానవపాడులో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతోతీవ్ర నష్టం వాటిలింది. మండలంలోని మిరప, పత్తి, కంది, పొగాకు పంటలకు ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరూరు మండలంలో ముసురు వర్షానికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పాత ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారు భయం భయంగా కాలం గడిపారు. వ్యవసాయ పనులకు, ముఖ్యంగా సీడ్ పత్తి పనులకు ఆటంకం కలిగింది. మల్దకల్ మండలంలో భారీ వర్షానికి అమరవాయి గ్రామంలో దౌలత్‌బేగ్ ఇల్లు నేలకూలింది. అలాగే బిజ్వారం, మేకలసోంపల్లి, మల్దకల్, తాటికుంట, చర్లగార్లపాడు గ్రామాలలో వర్షానికి పాడుబడిన ఇళ్లు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. అయిజ మండలంలోని అయిజ, ఉత్తనూరు, సింధనూరు, దేవబండ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పట్టణంలోని లోతట్టు కాలనీల రోడ్లు వర్షంనీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాజోళి మండలంలో వర్షం దంచి కొట్టింది. కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ జలమయమై, కనీసం నడవడానికి కూడా రాని విధంగా తయారయ్యాయి. రాజోళి–శాంతిగనర్ ప్రధాన రోడ్డుపై మోకాలి లోతు గుంతలు ఏర్పడి నారు చేరడంతో స్థానికులు, బీజేపి నాయకులతో కలిసి తమ ఇబ్బందిని కలెక్టర్‌కు వాట్సాప్ ద్వారా తెలియచేశారు. జిల్లా వ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ గద్వాలలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో 7.2 మి.మీ వర్షం -
చెక్‌డ్యాంలకు గ్రహణం
● రూ.లక్షలు వెచ్చించి నిర్మాణం ● సైడ్‌వాల్స్ కొట్టుకుపోయి నీటి వృథా ● మరమ్మతుకు నోచుకోని వైనం అయిజ: వర్షంనీరు ఒడిసి పట్టుకొని వాగులు, వంకల్లో నీరు నిలువ చేసి.. భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా చెక్‌డ్యాంలను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్న కొద్ది సైడ్‌వాల్స్ కొట్టుకుపోవడం.. మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఈ నీటిపై ఆధారపడే రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 2001లో కేంద్ర ప్రభుత్వం నాబర్డ్ పథకం ద్వారా జిల్లాలోని వాగులు, వంకల వద్ద చెక్‌డ్యాంలను నిర్మించింది. ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షలు ఖర్చుచేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోకి మొత్తం 20 చెక్ డ్యాంలు వచ్చాయి. వాటిలో 7 చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. 2009లో వచ్చిన వరదల్లో చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు వాటిని పునర్నిర్మించపోవడంతోపాటు మరమ్మతుకు కూడా నోచుకోవడంలేదు. చెక్‌డ్యాంలు నిర్మించిన అనంతరం కొన్నేళ్లు వాగుల్లో వర్షాకాలం సమృద్ధిగా నీరునిలవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల్లో తాగునీరు, సాగునీరు సమృద్ధిగా లభించింది. మూగజీవాల దాహం తీర్చేందుకు ఈచెక్డ్యాంలు ఉపయోగపడ్డాయి. అయితే 2009, మరికొన్ని సార్లు కురిసిన భారి వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ తెగిపోయాయి. కట్టడాలు శిథిలమయ్యాయి. వాటికి మరమత్తులు చేపట్టకపోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వాగుల్లో నీరు నిలువని పరిస్థితి ఏర్పడింది. కనీసం పశువులు దాహంతీర్చెకోవడానికి కూడా నీరు నిలువక పోవడం దూరదృష్టకరం. వర్షాకాలంలో వాగులు ఎడారిని తలపిస్తాయి. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చెక్డాంలన్నింటికి మరమత్తులు చేయించాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఉన్నా.. నిరుపయోగం అయిజ శివారులో మొత్తం 4 చెక్‌డ్యాంలు ఉండగా వాటిలో రెండు శిథిలమయ్యాయి. మానవపాడు మండలంలోని కలుకుంట్ల, మానవపాడు, కొరివిపాడు, జల్లాపూర్, పల్లెపాడు, చందూర్, చిన్న పోతులపాడు, గోకులపాడు, బొరవెల్లి, పెద్ద పోతులపాడు గ్రామ శివార్లలో మొత్తం 13 చెక్ డ్యాంలు ఉండగా వాటిలో 2 చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం– సాతర్ల గ్రామాల మధ్య ఒక్క చెక్‌డ్యాం ఉండగా అది కూడా శిథిలావస్థలో ఉంది. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సులో 2 చెక్‌డ్యాంలు మరమ్మతుకు గురయ్యాయి. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వం జిల్లాలో 7 నూతన చెక్ డ్యాం నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. నందిన్నె శివారులో రూ.1.77 కోట్లు, గుంటిపల్లి శివారులో రూ. 2.06, దయ్యాలవాగు వద్ద రూ.1.96, చందూరులో రూ.1.2, గువ్వలదిన్నెలో రూ.3.7, ఇర్కిచేడులో రూ. 3.85, ఉప్పలలో రూ.2.82 కోట్లతో నూతన చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ, మరమ్మతుకు గురైన చెక్‌డ్యాంలు శిథిలమైనాసరే వాటికి మరమ్మతు చేపట్టడంలేదు. -
నేత్ర పర్వం... అమ్మవారి అలంకారం
గద్వాలటౌన్: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు అన్ని ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మి, మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచే మంగళవాయిద్యాల మధ్య ఆలయాల్లో సుప్రభాత సేవ, అభిషేకాలు, విశేష పూజలు చేశారు. లలిత సహస్రనామ పారాయణములను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చనలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కండేయస్వా మి ఆలయం, అంబాభవాని, కుమ్మరివీధి, బాలాజీవీధి, పిల్లిగుండ్ల ముడుపు ఆంజనేయస్వామి ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారు అశ్వవాహనంపై ఊరేగారు. ఇదిలాఉండగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.5.55 కోట్ల కరెన్సీతో, 2వ వార్డులోని శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ దేవస్థానంలో రూ.51లక్షల కరెన్సీతో అమ్మవారిని అ లకరించారు. మహిళలు అమ్మవారి ఎ దుట దీపాలు వెలిగించి మొక్కులు తీ ర్చుకున్నారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లిని వేడుకున్నారు. -
నదీపరివాహక ప్రాంతాల్లో రక్షణ
కృష్ణానది, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. గద్వాల పట్టణంలోని నదీఅగ్రహారం, జూరాల, బీచుపల్లి కృష్ణానది వద్ద, తుంగభద్రనది ప్రాంతాల్లో రాజోలి, అలంపూరు ప్రాంతాల్లో పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రధానంగా గద్వాల, కెటి.దొడ్డి, గట్టు, ధరూరు, మానవపాడు ఇటిక్యాల మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో చాలాగ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మానవపాడు నుంచి అమరవాయికి వెళ్లే పెద్దవాగు ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపురం అండర్‌రైల్వే బ్రిడ్జి దగ్గర భారీవర్షానికి నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
గద్వాల: తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్రపోషించి మహిళా చైతన్యం, దైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాయలంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్.. చాకలిఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కేవలం ఒక మహిళగానే కాకుండా సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల అన్యాయాలు, దో పిడీదారులకు వ్యతిరేకంగా తన ౖధైర్యసాహసాల తో పోరాటం చేసిన వీరనారి అన్నారు. తనకు ఎ దురైన కష్టాలకు, అవమానాలకు వెనక్కి తగ్గకుండా ప్రజల హక్కుల కోసం ముందుకు సాగారన్నా రు. చాకలి ఐలమ్మ జీవితం ధైర్యం, పట్టుదల, త్యాగస్ఫూర్తికి మారుపేరుగా నిలుస్తుందన్నా రు.అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీపీవో నాగేంద్రం, ఏవో భూపాల్, బీసీసంక్షేమశాఖ అధికారి అక్బర్పాషాపాల్గొన్నారు. ఆదర్శప్రాయురాలు.. గద్వాల క్రైం: పేదల తరుపున పెత్తందార్లతో పోరాడిన వీర నారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఐలమ్మ 130 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేదల సమస్యలపై నిరంరం పోరాటం చేసిన మహిళా యోధురాలని, ఆదిపత్యవాదంపై ఎర్ర జెండాతో ఎదురునిలిచి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసిందన్నారు. ఆమె ఆశయలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు సిబ్బంది పాల్గొన్నారు. వీరవనిత ఐలమ్మ శాంతినగర్: భూమికోసం, భుక్తికోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ అని, ఆమె జీవితం మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ రామాపురం చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయనతోపాటు ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: నవరాత్రి, బతుకమ్మ వేడుకల్లో భక్తులకు ఎలాంటి సమస్య లేకుండా శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దాంతోపాటు అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని కట్టడి చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఉంచాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖాలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్‌కుమార్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు. -
ఇక టెండర్ల జాతర
● నేటి నుంచి వచ్చేనెల 18 వరకుదరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్లు ఆహ్వానం ● ఏర్పాట్లు చేస్తున్నాం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో మద్యం వ్యాపారుల నుంచి టెండర్లు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఒక్కో వ్యాపారి ఎన్ని టెండర్లు అయినా దాఖలు చేయవచ్చు. ఈసారి టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాం. – విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్‌ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గత మూడుసార్లు జరిగిన టెండర్ ప్రక్రియలో వచ్చిన దరఖాస్తుల వివరాలు జిల్లా 2019 2021 2023 మహబూబ్‌నగర్ 1,384 1,525 3,571 /నారాయణపేట నాగర్‌కర్నూల్ 1,064 1,507 2,524 జోగుళాంబ గద్వాల 418 987 1,171 వనపర్తి 516 694 1,329 దుకాణాల కేటాయింపు ఇలా.. -
వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో..
ఆల్మట్టి ఎత్తు పెంచిన పక్షంలో తెలంగాణతోపాటు ఏపీ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో ప్రధానంగా కృష్ణా పరివాహకంలోని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో ఆల్మట్టి గేట్లు తెరవకుంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు నెట్టెంపాడు, భీమా–1, 2, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌కు కృష్ణా నీరు చేరని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా వీటి పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల సాగుపై సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంటుందని.. తాగునీటికీ కటకట ఏర్పడుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. -
వైభవంగా జోగుళాంబ నవరాత్రి ఉత్సవాలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం జోగుళాంబ అమ్మవారు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన, అష్టోత్తర శతనామ అర్చన, దేవి ఖడ్గమాల అర్చన జరిగాయి. కుష్మాండదేవికి కొలువు పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, దర్బారు సేవ మంత్ర పుష్ప నీరాజన పూజలు, దశవిధ హారతులిచ్చారు. కుష్మాండం అంటే బ్రహ్మాండానికి సంకేతమని.. జగన్మాత బ్రహ్మాండమంతా తానై భక్తులను రక్షిస్తుందని అర్చకులు భక్తులకు వివరించారు. అలాగే అమ్మవారి ఆలయంలో రథోత్సవం కనులపండవగా జరగగా.. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టువస్త్రాలు సమర్పించిన ఎస్పీ.. అలంపూర్ ఆలయాలను గురువారం ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. నాలుగో రోజు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనం అమ్మవారి ఆలయంలో కనులపండువగా రథోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన కీర్తి ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. -
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ
● కలెక్టర్ బీఎం సంతోష్ ● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన సంబరాలు గద్వాల/గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం.. మన వారసత్వాన్ని కాపాడే.. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ బీఎం సంతో అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్లో అట్టహాసంగా బతుకమ్మ వేడులకు నిర్వహించారు. హోదా పక్కన బెట్టి స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లా అధికారులు.. వారికి జతగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు... కళాకారుల ఆట పాట.. వెరసి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సంతోష్ బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. వివిధ శాఖల సిబ్బంది పూలతో బతుకమ్మలను పేర్చగా, జిల్లా అధికారులు బతుకమ్మ ఆడారు. జానపద పాటలతో హోరెత్తించారు. కలెక్టర్ సతీమణి డాక్టర్ కెచేరి బతుకమ్మను నెత్తిపై పెట్టుకొని తన నివాసం నుంచి వచ్చారు. దాండియా ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి నుషితతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీరొక్క పూలు.. ఆనందాల జోరు.. జిల్లా కేంద్రంలోని తేరుమైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి పాల్గొన్నారు. వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించి, తేరువైదానానికి చేరుకున్నారు. పగటి వెలుతురు తలపించేలా సంబురాల వేదిక పరిసరాలను విద్యుత్ వెలుగుతో నింపేశారు. స్థానిక తేరుమైదానం మొత్తం బతుకమ్మ ఆట, పాటలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో కలిసి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా అధికారులు బోడ్డెమ్మలు వేశారు. వారితో కలిసి కోలాటం ఆడారు. సమాజంతో స్నేహబంధాన్ని పెంచుకోవడానికి, సుఖాన్ని కలిసి ఆనందించడానికి తెలంగాణలో బతుకమ్మ ఆడుతారనే సందేశాన్ని ఇచ్చారు. అనంతరం తేరుమైదానం నుంచి తెచ్చిన బతుకమ్మలను స్థానిక లింగం బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ఆట పాటలతో అలరిచిన మహిళలకు ప్రోత్సాహ బహుమతులను కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు. -
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
ప్రతి ఏటా వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్తో పాటు ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి. – రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక ● -
సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
కేటీదొడ్డి: సరిహద్దు చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదని ఎస్సీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ మొగులయ్యతో కలిసి ఎస్పీ సందర్శించారు.పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. శాంతిభద్రలలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రికార్డులను, యూనిఫాం టర్న్ ఔట్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముఖ్యంగా రౌడీ షీటర్స్, అనుమానితులపై నిఘా ఉంచడంతో పాటు గ్రామాల్లోని ఎలాంటి సమాచారం అయినా తెలుసుకుని ఉండాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూడడంతో పాటు ఎప్పటి కప్పుడు గ్రామాల్లో గస్తీ నిర్వహించి క్రైం రేటును తగ్గించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేయాలని, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా ఒకే చోటు పని చేసే ఉద్యోగులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ టంగుటూరి శ్రీను, ఎస్సై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన మగ్గం చప్పుడు!
చేనేత రంగంపై భారీ వర్షాల ప్రభావం వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.రాజోళి: నిత్యం చేతిలో పనితో హడావుడిగా ఉండే నేతన్నలు గత నెల రోజుల పైబడి పైసా పని లేక ఉ సూరుమంటున్నారు. ఉదయం లేచింది మొదలు, నిత్యం దారాల అల్లికతో రంగుల కూర్పులతో, మగ్గం చప్పుళ్లతో సాగే చేనేత కార్మిక జీవనం వర్షపు చినుకుల మధ్య ముందుకు సాగలేక స్తంభిస్తుంది. చేనేత మగ్గాలు కావడంతో గుంతల్లో నీరు చేరి పను లు చేసేందుకు వీలులేక దినదినగండంగా గడుపుతున్నారు. గత నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు చేనేత కార్మికులు మరింతగా ఇబ్బందిపడుతున్నారు. వర్షాకాలంలో సమస్య నిత్యకృత్యం.. గత నెలలో కురిసిన వర్షాల నుంచి బయటపడుతున్నామనుకులోగా మళ్లీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేనేత కార్మికులు జీవనం నిలిచింది. జిల్లాలోని గద్వాల, అయిజ, గట్టు, రాజోళిలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారంతా ఎక్కువగా చేతి మగ్గాలనే వాడుతున్నారు. దీని కోసం గుంతల ద్వారా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ సమస్య నిత్యకృత్యమైంది. ప్రతి ఏడాది ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో కార్మికులు వర్షాకాలం వస్తే బిక్కుబిక్కుమంటూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. జిల్లాలో చేనేత కార్మికులకు వర్షాకాలంలో ఇబ్బందులున్నప్పటికీ కొందరు కార్మికులు మరింత దుర్బర జీవితం గడుపుతున్నారు. గత నెలలో వర్షాలు జోరుగా కురవడంతో మగ్గాలు తడిసి పనులు నిలిచాయి. వాటి నుంచి బయట పడి పనులు చేసుకునేలోగా గత పది రోజలుగా వర్షాలు మళ్లీ కురుస్తుండటంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. ఊట గుంతల్లా.. మగ్గం గుంతలు రాజోళిలో చేనేత కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కొత్త రాజోళిలో నివసిస్తున్న చేనేత కార్మికులు ఉదయం నుంచి రాత్రి దాకా నీరు ఎత్తిపోయడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త రాజోళిలో మొత్తం పునరావాస గృహాలే ఉన్నాయి. కాగా ఆ గృహాలు మొత్తం నల్లభూమిలోనే నిర్మించారు. రెండు గదులతో నిర్మించిన ఈ గృహాల్లోనే కార్మికులు ఒక గదిలో మగ్గం గుంతను ఏర్పాటు చేసుకున్నారు. నల్లభూమి కావడంతో నీరంతా గుంతల్లోకి చేరి నిల్వ ఉంటుంది. దీంతో నేసిన చీరలు, నేసేందుకు సిద్ధంగా ఉన్న మెటీరియల్ మొత్తం తడిసిపోయి రెండు రకాలుగా కార్మికులు నష్టపోతున్నారు. దీనికితోడు సరైన డ్రైనేజీలు కూడా లేకపోవడం, వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వృథా నీరంతా ఊట రూపంలో మగ్గం గుంతల్లోకి చేరుతుంది. గుంతల నిండా నీరు చేరడంతో చీరలు నేసేందుకు వీలు కావడం లేదు. మగ్గం కూడా మొత్తం తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టేందుకు సమయం కావాలని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అది కూడా వీలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో నీరు రోడ్లపైన, ఇళ్ల చుట్టుముట్టూ నీరు చేరి కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. దెబ్బ మీద దెబ్బ చేనేత కార్మికుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది. అసలే కరెంట్ మగ్గాల ద్వారా నేసిన చీరలకు గిరాకీ పెరిగి, చేనేత చీరల అమ్మకాలు తగ్గడంతో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుంటుంది. ఆర్డర్లు ఎక్కువగానే తీసుకుంటారు. కానీ మగ్గం గుంతల్లో నీరు చేరడంతో పనులు నిలిచాయి. తడిచిన మగ్గం మెటీరియల్ ఆరి మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతలోగా వర్షం కురవకుంటే పర్లేదు కాని మళ్లీ వర్షం కురిస్తే పనులకు రోజుల తరబడి అంతరాయం కలుగుతుందని కార్మికులు అంటున్నారు. ఈ కారణంగా పండుగ సీజన్లో చీరల ఆర్డర్లు కోల్పోవడంతోపాటు.. ఇటు మెటీరియల్ పాడైపోయి.. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కరెంట్ మగ్గాలు అందించడంతోపాటు.. షెడ్లు నిర్మించేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని కోరుతున్నారు. పాలమూరుకు క్రీడాకళ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. –IVలో u మగ్గం గుంతల్లో రోజుల తరబడి నీరు చేరి పనులకు తీవ్ర ఆటంకం దసరా పండుగ ముందు కార్మికులకు దెబ్బ వర్షాల కారణంగా స్తంభించిన చేనేత కార్మికుల జీవనం -
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పీఆర్ఎల్ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’ పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు 90% పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి.. ఇదే డిమాండ్‌తో పోరుబాటకు బీఆర్ఎస్ సన్నాహాలు దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ ‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి -
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ● వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం గద్వాలటౌన్: ఆది పరాశక్తి... అశ్రిత పక్షపాతి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాలలో అత్యంత వైభంగా చేపట్టారు. మూలప్రతిమలు, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు, అభిషేకాలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. నీ చల్లని చూపులు మాపై ఉండాలంటూ భక్తులు ప్రణమిల్లారు. సాయంత్రం పలు చోట్ల భక్తిగీతాలపన, నృత్య ప్రదర్శనలు, కచేరీలు, అధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణ.. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు గజలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, స్థానిక తాయమ్మ ఆలయంలో, కుమ్మరివీధిలో, అంబాభవాని దేవాలయంలో, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చారు. బాలాజీవీధులలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేపట్టారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. విశేష పూజలు అందుకుంటున్న దుర్గామాత జములమ్మ ఆలయంలో గజలక్ష్మిదేవి అలంకరణలో అమ్మవారు -
పండ్ల తోటలను సంరక్షించుకోవాలి
అయిజ: పండ్ల తోటలను అనేక చీడపీడలు ఆశిస్తాయని, రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ పండ్లతోటలను సంరక్షించుకోవాలని హార్టికల్చర్ జిల్లా అధికారి ఎండీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని తుపత్రాల, బి.తిమ్మాపూర్, దేవబడ శివార్లలో బత్తాయి, దానిమ్మ, ఆయిల్ పాం తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలను జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశరని, మొక్కలు నాటిన సంవత్సరం వరకు అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందని అన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు పురుగుమందులను పిచికారీ చేయాలని సూచించారు. సూక్ష్మదాతువు పోషకాల లోపాలు మొక్కల్లో కనిపిస్తే ఆకులు రంగుమారుతాయన, గిడుసబారిపోతాయని, మెక్కల ఎదుగుదల లోపిస్తుందని వివరించారు. వాటిలోపాన్ని భర్తి చేసేందుకు ఫార్ముల4 లేక ఫార్ముల 6ను ఎంపిక చేసుకొని మొక్కలపై పిచిచారి చేయాలని, లేదా ఎరువుతోపాటు కలిపి మొక్కల వేర్లకు అందేలా చేయాలని రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మహేష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
వర్షం వస్తే మొత్తం ఆగాల్సిందే
వర్షం కురిసిందంటే మా మగ్గం మొత్తం తడిసిపోతుంది. దీంతో చీరలు నేయడం కదరదు. ఇప్పుడు మగ్గం గుంతల్లో నీరు నిలిచింది. ఆ నీటిని తోడుకునేందుకు సమయం సరిపోదు. ఎంత తోడినా ఊట గుంతలో మాదిరి నీరు వస్తూనే ఉంటాయి. అందులో వర్షం కురుస్తుండటంతో నీరు ఇంకా ఎక్కువగా చేరుతుంది. పది రోజులుగా పైసా పని లేకుండా కార్మికులం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. – హేమలత, చేనేత కార్మికురాలు, రాజోళి పండుగ ముందు కార్మికులకు నష్టమే ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుటుంది. కానీ వర్షాలు కురవడంతో మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వర్షం నీరు చేరితే నీరు బయటకు వెళ్లి, మెటీరియల్ సెట్ అయ్యేందుకు రెండు రోజులు పడుతుంది. ఇలా వారంలో ఒక్కసారి వర్షం కురిసినా..పనులు నిలస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్మికుల ఇబ్బందులను తొలగించాలి. – స్వాతి, చేనేత కార్మికురాలు రాజోళి ● -
ఆలయాల నిర్మాణానికి విరాళం
గద్వాలటౌన్/అలంపూర్: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం రూ.2కోట్ల వ్యయంతో చేపట్టగా.. కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తుల నుంచి ఆలయ కమిటీ సభ్యులు విరాళాలను సేకరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షుడు అయ్యపురెడ్డి రూ.2,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్, వెంకట్రాములు, గోపాల్, నల్లారెడ్డి, నాగరాజు శెట్టి, రాజు, బాలాజీ, బుచ్చన్న పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయానికి.. అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు హైదరాబాద్‌కు చెందిన మహేష్‌కుమార్ రెడ్డి – రాధికా రెడ్డి దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. అర్చక స్వాములు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.4,321 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 79 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4321, కనిష్టం రూ.2720, సరాసరి రూ. 3821 ధరలు లభించాయి. అలాగే, 107 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 5930, కనిష్టం రూ. 5792, సరాసరి రూ. 5930 ధరలు పలికాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయికి ఎదగాలి వనపర్తిటౌన్: ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కోసం వెదుక్కోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ రాజు ఆకాంక్షించారు. బుధవారం కళాశాలలో డీసీ–ఎంఎస్ఎంఈ, న్యూఢిల్లీ సహకారంతో ఎంట్రప్రెన్యూర్షిప్పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆలోచన ఉంటే సరిపోదని.. కృషి, పట్టుదల, నమ్మకం ఉండాలని, అన్ని ఉంటేనే జీవితంలో, సమాజంలో రాణించగలమన్నారు. ఎస్ఐసీ –టీఎస్సీ డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్‌లపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాంనరేష్ పాల్గొన్నారు. 26న ఉద్యోగమేళా కందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లాభాలు
శాంతినగర్: డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు లాభాల బాట పట్టవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. వడ్డేపల్లి మండలం కొంకల రైతువేదికలో మంగళవారం డ్రాగన్ ఫ్రూట్ సాగుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో పాటించాల్సిన మెళకువలు, పంటకు ఆశించే చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను ఏఓ రాధతో కలిసి డీఏఓ పరిశీలించారు. వానాకాలం సాగు వివరాల నమోదుపై ఆరా తీశారు. అదే విధంగా శాంతినగర్‌లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల బస్తాలు, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. డీఏఓ వెంట ఏఈఓలు విమల, వినోద్‌కుమార్ ఉన్నారు. -
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సీఐ, ఎస్ఐ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధికంగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్గా గుర్తించాలన్నారు. ప్రతి కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని.. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమో దు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. విలేజ్ పోలీసు అధికారులకు కేటాయించిన గ్రామాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి.. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్ రికార్డులు పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సి బ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్హెచ్ఓకు సూచించారు. ఎస్పీ వెంట సీఐ టాటాబాబు, ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి ఉన్నారు. -
ఆదిపరాశక్తికి విశేష పూజలు
గద్వాలటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు లతితాదేవిగా, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీరాజ రాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో పూజలందుకున్నారు. పిల్లిగుండ్లలోని శ్రీశివకామేశ్వరి అమ్మవారు చంద్రవాహిని రూపంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. అయ్యప్పస్వామి ఆలయంలో అమ్మవారిని మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి
‘ఎన్ఎస్ఎస్’తో విద్యార్థి దశ నుంచే సమాజసేవ వారం రోజులు సామాజిక కార్యక్రమాలు క్యాంపులో వారం రోజుల పటు ఎంపిక చేసుకున్న గ్రామం, ప్రాంతంలో విద్యార్థులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారికి అధికారులు భోజనం, వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, చెత్తా చెదారాన్ని ఊడ్చడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం, ఉదయం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పిస్తారు. చివరి రెండు రోజులు గ్రామంలో ఉండే ప్రజల వివరాలు, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు, తాగునీరు, అందుతున్న వైద్య సేవలు, అధికంగా ప్రబలుతున్న రోగాలు తదితర అంశాలపై సర్వే నిర్వహించి సంబంధిత నివేదికను గ్రామ, పీయూ అధికారులకు అందిస్తారు. నివేదికలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఆస్కారం ఉంది. పలు చోట్ల ప్రజలకు అవసరమైన మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఇప్పటికే పలు చోట్ల క్యాంపులు ప్రారంభమయ్యాయి. పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ఉండగా.. 45 మంది విద్యార్థులు (వలంటీర్ల)తో ఒక్కో యూనిట్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపునకు అయ్యే ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు రూ.35 వేల చొప్పున మంజూరు చేశారు. మొత్తం పీయూ పరిధిలో 100 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో మొదటి విడతగా 51 యూనిట్లకు అధికారులు రూ. 17.75 లక్షలను విడుదల చేశారు. ఇక్కడ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఎన్ఎన్ఎస్ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. వాటితో అడ్మిషన్లు తదితర విషయాల్లో ఎన్ఎన్ఎస్ సర్టిఫికెట్ కీలకంగా మారనుంది. 2025–26 క్యాంపుల నిర్వహణకు నిధులు విడుదల స్వచ్ఛత, పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన జనాభా సంఖ్య, పిల్లలు, వ్యాధులు తదితర అంశాలపై సర్వే పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు -
నిధులు విడుదల చేశాం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి ● -
పకడ్బందీగా వానాకాలం ధాన్యం సేకరణ
గద్వాల: వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యం సేకరణకు అవసరమైన ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోళ్లను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు ధాన్యం క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా రైతుల వద్ద సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. నిఘా ఉంచాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇష్టారాజ్యం!
గద్వాలలో అనుమతులు లేకుండా వెలుస్తున్న ఆకాశహార్మ్యాలు ● ఇష్టానుసారంగా నిర్మాణాలు ● చోద్యం చూస్తున్న అధికారులు ● నోటీసులతోనే సరిపెడుతున్న వైనం ● మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనం ఇది. ఈ భవనానికి సరైన అనుమతులు లేవు. పైగా 20 ఫీట్ల సర్వీస్ రోడ్డుకు సమీపంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా ఏకంగా సెల్లార్ నిర్మాణంతో కూడిన బహుళ అంతస్తు భవంతిని నిర్మిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో కనిపించే ఇంద్ర భవనాలు, ఆకాశహార్మ్యాలు ఇక్కడ కూడా వెలుస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉంటుంది. ఇందుకు ఇటీవల వెలసిన బహుళ అంతస్తుల భవనాలే సాక్ష్యాలు. అదే విధంగా జిల్లా ఏర్పాటు అనంతరం జమ్మిచేడు, దౌదర్పల్లి గ్రామాలను గద్వాల మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో పట్టణ విస్తీర్ణం మరింత పెరిగింది. ప్రభుత్వ భూములు, 10 శాతం స్థలాలు రూ.కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిపై కన్నేసి చెరపట్టారు. వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావడంతో గద్వాల మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. 20 ఫీట్ల సర్వీస్ రోడ్డు కబ్జా.. ఆర్ఓబీ నుంచి జములమ్మ ఆలయం వరకు ప్రధాన రహదారి పక్కన భవిష్యత్ అవసరాలను దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 20 ఫీట్ల సర్వీస్‌రోడ్డు నిర్మించింది. అయితే ఈ రోడ్డును ఆక్రమిస్తూ పలు నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సెట్‌బ్యాక్ స్థలం వదిలేసి.. మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాని ఇవేవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం.. మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో కొన్ని కులాలకు ఇష్టానుసారంగా 10శాతం స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలోనే జ్ఞానప్రభ కళాశాల యాజమాని రవీందర్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన హైకోర్టు.. 10శాతం స్థలాల్లో వాటికి నిర్దేశించిన నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో సదరు వ్యక్తి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
సద్వినియోగం చేసుకోవాలి
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రామాన్ని ప్రతి మహిళ, యువతి, బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, కిశోర బాలికలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయినవారికి మందులు ఉచితంగా అందజేస్తాం. కంటి, చెవి, ముక్కు, చర్మ, సీ్త్ర వ్యాధి సమస్యలు, షుగుర్ తదితర పరీక్షలు చేపడతారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 2వ తేది వరకు ఉంటుంది. – సిద్దప్ప, ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి ● -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
గద్వాల వ్యవసాయం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతికి అనుగుణంగా పంటలు పండించడం ద్వార దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చునని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం గద్వాలలోని బ్రహ్మకుమారీస్ అమృత కుంజు భవనంలో ప్రపంచ సేంద్రియ వ్యవసాయ సాగు దినోత్సవాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల నేల, నీరు, పర్యావరణం కలుషితమవుతాయన్నారు. రసాయనిక మందుల వాడకం తగ్గించడం వల్ల జీవ వైవిధ్యాన్ని పెంచవచ్చునన్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండిన ఆహారంలో పోషక విలువలు అధికంగా ఉంటాయన్నారు. వ్యవసాయంలో పాడి పంటలను కలిపి నిర్వహించడం ద్వార ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చునని చెప్పారు. రైతులు దేశీయ ఆవులను పెంచాలని సూచించారు. వీటి పాలద్వార చేసే ఉత్పత్తులు మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. వర్మీ కంపోస్ట్ సులభంగా తయారు చేసుకోవచ్చునని వివరాలు ఆయన తెలియజేశారు. పంటల మార్పిడి విధానాలు పాటించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో సాగు మేలు కూరగాయలు, మిల్లెట్స్, పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండించే విధంగా రైతులు సిద్ధం కావాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్పూర్తిగా నిలిచిన పలువరు రైతులను ఆయన ఈసందర్భంగా సన్మానించారు. వనపర్తి జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు రాజవర్ధన్, జ్ఞానేశ్వర్‌రెడ్డి, నాగరాజు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అయ్యపురెడ్డి, బ్రహ్మకుమారీస్ సంస్థ వ్యవసాయ సాగు వ్యవస్థ తెలంగాణ ఇంచార్జి అరుంధతి, జిల్లా ఇంచార్జి మంజుల, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
శరన్నవరాత్రి వైభవం
● శైలపుత్రి, పార్వతీదేవిగా జోగుళాంబ, జములమ్మ అమ్మవార్ల దర్శనం ● కనులపండువగా ఉత్సవాలు ప్రారంభం ● ఆలయాల్లో మహిళల ప్రత్యేక పూజలు గద్వాలటౌన్/ఎర్రవల్లి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిచ్చారు. జోగుళాంబ అమ్మవారు శైలపుత్రిగా.. నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారు పార్వతీదేవిగా.. బీచుపల్లిలోని దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవిగా.. గద్వాల కన్యకాపరమేశ్వరి అమ్మవారు వారాహిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ధ్వజారోహణతో కార్యక్రమాలు వైభవంగా చేపట్టారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారిని పూల పల్లకిపై ఊరేగించారు. ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో కాళికాదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ● బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతీదేవి ఆదిలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మొదటిరోజు అర్చకులు సుప్రభాతసేవ, క్షీరామృతాభిషేకం, ఆరాధన, కుంకుమార్చన వంటి పూజలను నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అలాగే, శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. -
అతివలకు ఆరోగ్య భరోసా
ఇటీవల స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ ప్రారంభం ● గుండెజబ్బు, క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర వాటిపై అవగాహన ● అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు ● ఉచితంగా మందుల అందజేత గద్వాల క్రైం: ఓ కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే.. ఆ ఇంటి వెలుగు అయిన మహిళ ఆరోగ్యంగా ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చేపట్టిన ఏ రంగమైనా అభివృద్ధి పథంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహిళలు, యువతులు, బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో వారి ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్య పరీక్షలు.. అవగాహన సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, దంత, రక్తహీనత, సీ్త్ర వ్యాధి సమస్యలు, క్యాన్సర్, కిశోరబాలికలు కౌమరదశలో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో గైనకాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ ఫిజీషియన్, దంత, సంబంధిత తదితర ప్రత్యేక వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మహిళలకు వైద్య సేవలను అందిస్తారు. పోషకాహార ఆవశ్యకతను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. క్షయ వ్యాధి పరీక్షలు, క్షయ వ్యాధి రోగులకు సహకరించేందుకు నిక్షయ్ మిత్ర, సికిల్ సెల్ పరీక్షలతో పాటు కార్డులను అందజేస్తారు. గతంలో నమోదు కాని వారికి ఏబీహెచ్ కార్డు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. 10 శాతం చక్కెర, వంట నూనెలు తగ్గింపుతో ఊబకాయానికి చెక్ పెట్టడం వంటి అంశాలను వైద్యులు తెలియజేస్తారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
పోలీస్ గ్రీవెన్స్‌కు 16 అర్జీలు పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 16 అర్జీలు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా ఫిర్యాదులు అందాయన్నారు. గద్వాల/గద్వాల క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి 41 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలని చెప్పారు. న్యాయం చేయరూ.. ఇజ్రాయిల్ దేశంలో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ధరూరు మండల కేంద్రం పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు చిట్టిబాబు మరో తొమ్మిదిమంది కోరారు. ఈమేరకు వారు సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇజ్రాయిల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.చిట్టిబాబు రూ.5.50లక్షలు, బి.రత్నకుమార్ రూ.7లక్షలు, కె.బేబికిషోర్ రూ.7.50లక్షలు, జె.భారతి రూ.7.50లక్షలు, కె.ప్రభుదాసు రూ.7.50లక్షలు, మేరీ రూ.2.50లక్షలు, ప్రసాద్ రూ.7.50లక్షలు, సునిల్ రూ.7.50లక్షలు, సూజాత రూ.7.50లక్షలు, మేరికుమారి రూ.7.50లక్షలను పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్ తమతో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు మీడియా ముందు వాపోయారు. తీసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పి అందుకు సంబంధించి చెక్కులు ఇచ్చినట్లు, అయితే ఆ చెక్కులు బ్యాంకులో డ్రా చేసుకోవటానికి వెళితే అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలిపారు. దీనిపై పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్‌ను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తీసుకున్న డబ్బును తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
ప్రత్యేక శిబిరాలు ప్రారంభం
మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధి నిర్ధారణ చేసి అన్ని మందులను ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సమస్యలపై సదస్సులు నిర్వహించి సూచనలు, అభిప్రాయాలను తెలియజేస్తారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 618 మంది మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ గుర్తించి మందులు సైతం అందజేస్తారు. మహిళలు సైతం శిబిరాలకు స్వచ్ఛందంగా వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. -
స్థానిక పోరుకు సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీ కులగణన ఆధారంగా.. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి. గ్రా.పంచా: గ్రామ పంచాయతీలుజిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ నాగర్‌కర్నూల్ 20 214 మహబూబ్‌నగర్ 16 175 వనపర్తి 15 136 జోగుళాంబ గద్వాల 13 141 నారాయణపేట 13 136 రెండు రోజుల్లోనే ప్రక్రియ.. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జెడ్పీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఖరారు చేయనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీఓ ఖరారు చేయనుండగా.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీఓలు కేటాయించనున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు, వార్డుల వివరాలు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత -
‘లంపీస్కిన్’ కలకలం..!
జిల్లాలో 20 లేగ దూడలు మృతి ఆగస్టు నుంచి ప్రబలిన వ్యాధి గడిచిన నెల ఆగస్టు చివరివారం నుంచి జిల్లాలో వ్యాది ప్రబలడం ఆరంభం అయ్యింది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటం, పశువుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి మళ్లీ ఆరంభం అయినట్లు పశుసంవర్దకశాఖ అధికారులు అంటున్నారు. కాగా ఈసారి లేగ దూడెల్లో వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. సంబంధిత రైతులు పశువైద్యాధికారుల దగ్గరకు తీసుకెళ్లగా పరిశీలించి వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా గుర్తించి, చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత ఈ వ్యాధి మెల్లగా అన్ని ప్రాంతాలకు ప్రబలుతోంది. లేగదూడలతో పాటు, కోడెళ్లల్లో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దాదాపు ఇప్పటికే 20 లేగదూడలు వ్యాధి భారిన పడి చనిపోయాయి. కాగా వ్యాధి భారిన పడిన దూడలు, కోడెలకు పశువైద్యాధికారులు చికిత్సలు అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఆయా గ్రామాల్లో తెల్లజాతి పశువులకు ముందస్తుగా గోట్‌ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదిలాఉంటే లింపి స్కిన్ వ్యాధి ప్రబలుతుండటం పట్ల పాడి రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా జిల్లాలో 60,528 తెల్లజాతి పశువులు ఉన్నాయి. లేగదూడలు, కోడెలతో పాటు, ఇతర తెల్లజాతి పశువుల్లో ఇప్పటికే అక్కడక్కడ వ్యాధి లక్షణా లు కన్పిస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గద్వాల వ్యవసాయం: లంపీస్కిన్ (ముద్దచర్మ వ్యాధి) వ్యాధి మరోసారి ప్రబలుతోంది. గడిచిన 20 రోజుల నుంచి జిల్లాలోని పలుచోట్ల ప్రధానంగా దూడలు, కోడెదూడల్లో లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు పశువుల్లో కనిపిస్తున్నాయి. వ్యాది భారిన పడి ఇప్పటికే 20 లేగదూడలు మృతి చెందినట్లు సమచారం. దూడలతో పాటు మిగిలిన తెల్లజాతి పశువుల్లో సైతం అక్కడక్కడ వ్యాధి లక్షణాలు గుర్తిస్తున్నారు. వ్యాధి ప్రబలుతుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు పశుసంవర్దకశాఖ చర్యలు ఆరంభించింది. నివారణ చర్యలు చేపట్టాం జిల్లాలోని కొన్ని చోట్ల లేగదూడల్లో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు ఇటీవల గుర్తించాం. లక్షణాలు ఉన్న లేగదూడలు, కోడెలకు చికిత్సలు చేశాం. ఏ గ్రామాల్లో అయితే ఎక్కువగా దూడలు, కోడెలకు ఈవ్యాధి వచ్చిందో మిగిలిన తెల్లజాతి పశువులు వ్యాధి భారిన పడకుండా ముందస్తుగా గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాం. లింపీస్కిన్ వ్యాధి రాకుండా ప్రతి ఏడాది ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి గోట్ ఫాక్స్ వ్యాక్సిన్‌ను వేస్తున్నాం. అప్పుడు పాడి రైతులు తప్పక తమ పశువులకు వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి కలవరపెడుతున్న వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి క్యాట్రీ ఫ్యాక్స్ అనే వైరస్ నుంచి వస్తుంది. ఆవులు, ఎద్దులు, లేగదూడల్లో ఈ వ్యాధి సోకుతుంది. బాహ్య పరాన్న జీవులు, వ్యాధిన్న పశువు తాగిన నీరు, తిన్న గడ్డి వల్ల ఇతర పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, మేత మందగించడం, చర్మంపై బొబ్బలు రావడం వ్యాధి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ముందుగా దేశంలో గుజరాత్, మహారాష్ట్రలో ఈవ్యాధిని గుర్తించారు. సంతల్లో, మార్కెట్లలో పశువుల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. ఒక రాష్ట్రం రైతులు మరో రాష్ట్రానికి వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఈక్రమంలోనే మన రాష్ట్రంలోనూ 2022లో పలు ప్రాంతాల్లో పశువులకు ఈవ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. 2022లో జిల్లాలో గుర్తింపు 2022 ఆగస్టులో జిల్లాలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు పలు ప్రాంతాల్లో పశువుల్లో అగుపించాయి. రైతులు ఆందోళన చెంది పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పశుసంవర్ధకశాఖ పశువులను పరిశీలించి, ముందస్తు టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత 2023 జూలై నెలలో పలు ప్రాంతాల్లో పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు అగుపించాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అప్రమత్తమైంది. వంద మంది సిబ్బందితో మండలానికి మూడు బృందాలుగా ఏర్పాటు చేసి గోట్ ఫాక్స్ వ్యాక్సిన్‌ను పశువులకు వేశారు. కాగా 2024 జులైలో, 2025 మేనెలలో వ్యాధి రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేశారు. జిల్లాలో తెల్లజాతి పశువుల వివరాలిలా.. మరికొన్ని లేగదూడల్లో వ్యాధి లక్షణాలు అప్రమత్తమైన పశువైద్య సిబ్బంది గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్న వైనం -
బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆలయాల్లో భక్తులు ఆదివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున ప్రజలు బీచుపల్లికి చేరుకొని అభయాంజనేయస్వామిని, శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటుగా కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవోలు రామన్‌గౌడ్, సురేంద్ర రాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే ఇ ట్టి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకోవాలని కోరారు. -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
● మహాలయ అమావాస్యతో ప్రత్యేక పూజలు ● చండీహోమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైనంఅలంపూర్: దసరా సెలవులు ప్రారంభం కావడం.. అందులోనూ మహాలయ అమావాస్య రావడంతో జోగుళాంబ క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. ఆదివారం క్షేత్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని దర్శించుకొని అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. భక్తిశ్రద్ధలతో చండీహోమాలు.. అమావాస్య కావడంతో జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో చండీ హోమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాకపోకలు కొనసాగగా.. క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తుల రాకతో ప్రధాన రహదారి రద్దీగా మారింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసమేతంగా జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకస్వాములు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు. -
ఏ క్షణమైనా కూలొచ్చు..!
● ఆందోళన కలిగిస్తున్న శిథిల భవనాలు ● నోటీసులతో సరిపెడుతున్న అధికారులు ● అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ గద్వాలటౌన్: 2010 జూన్ 12 నాడు.. గద్వాల కూరగాయల మార్కెట్లో శిథిలమైన ఓ సముదాయం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో పది మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. ● 2021 అక్టోబరు 09 నాడు.. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో నివాస గుడిసె గోడ పేకమేడలా కూలి పెనువిషాదాన్ని నింపింది. ఇంట్లో నిద్రస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృత్యుఒడిలోకి చేరారు. ● 2024 ఆగస్టు 21 నాడు.. అయిజ మున్సిపాలిటీ పరిఽధిలోని కోత్తపేట కాలనీలో నివాస గుడిసె గోడ కూలీ ఎనిమిదేళ్ల చిన్నారి శ్రీకృతి మృతి చెందింది. మరో చిన్నారి గాయపడింది.. ఈ సంఘటనలను చూస్తే... చేతులు కాలేదాకా కళ్లు తెరుచుకోరు.. కాళ్లు కదలవు అన్నట్లుగా ఉంది ఆయా శాఖల అధికారుల పనితీరు. శిథిలమైన భవనాలు, ఇళ్లు అధికారుల ఎదుట కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో సంబంధిత అధికారులు స్థానికంగా ఉన్న శిథిల భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా.. పురాతన భవనాలు, కట్టడాల విషయంలో అధికారులకు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటంలేదు. శిథిల భవనాల్లో నివసించడం, వ్యాపారాలు చేయడం భయంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఈ స్థితిలో గద్వాలలో పురాతన కట్టడాలు, నివాస గృహాలు, భవనాల భద్రత, నాణ్యత ఎంతమాత్రం అన్న ప్రశ్న రేకెత్తించింది. గత నెల రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుర్తించినా.. పట్టించుకోవటం లేదు వానాకాలం ముందు జిల్లాలో పాత భవనాల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. పట్టణాలు, గ్రామాల్లో అప్రమత్తం చేసినా ఇంటి యజమానుల్లో అవగాహన కలగటం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు ఇళ్ల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 44 మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భయం గుప్పిట్లో 60 కుటుంబాలు జిల్లాకే గర్వకారణంగా నిలిచిన మట్టికోట బురుజులు ప్రమాదకరంగా మారాయి. కోట బురుజుల అంచున ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణాన్నైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో శిథిలావస్థలో ఉన్న కోట బురుజులు ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మట్టి కోట బురుజుల అంచున ఉన్న స్థానిక జివిలి వీధిలో సుమారు 60 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వారందరూ నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించే పరిస్థితి నెలకొంది. అదృష్టవ శాత్తు ఇప్పటి వరకు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే మట్టి కోట బురుజులు కూలలేదు. మిగిలిన అన్ని చోట్ల మట్టి కోట బురుజులు కూలిపోయాయి. విధి వక్రీకరిస్తే మాత్రం.. చాలా ఇళ్లు నేలమట్టమయ్యే అవకాశముంది. అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసి సమాధి అయ్యే ప్రమాదం ఉంది. అధికారులు జివిలి వీధి వాసులకు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయించడం.. రెండు రోజుల అయిన వెంటనే మళ్లి వచ్చి ఇళ్లలో చేరడం పరిపాటిగా మారింది. పొంచి ఉన్న ముప్పు... స్థానిక కృష్ణవేణి చౌరస్తా దగ్గర ఉన్న పీఏసీఎస్ గోదాం కూలడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం పెద్దగాలి వీచిన కుప్పుకూలిపోతుంది. గోదాం షెడ్డుకు ఉన్న దిమ్మెలు శిథిలమై నామమాత్రంగా నిలబడి ఉన్నాయి. ఈ గోదాంలో ఎరువులను ఉంచుతారు. మున్సిపాలిటీకి చెందిన చాలా దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీ, ఈ– బ్లాక్‌లలోని సుమారు 30 దుకాణాలు దెబ్బతిన్నాయి. దుకాణాల పైకప్పులు పెచ్చులుడినాయి. ఆ దుకాణాలలో కొంత మంది కారం కొట్టే యంత్రాలు నిర్వహిస్తున్నారు. యంత్రాల శబ్దానికి దుకాణాల గోడలు అదురుతున్నాయని ఇతర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులు రాజకీయ జోక్యంతో అవి బుట్టదాఖలయ్యాయి. పట్టణంలోని జానకమ్మ సత్రం, బాణాల వెంగన్న దుకాణా సముదాయలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ దుకాణాలు దేవాదాయశాఖ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు సిమెంట్ పెచ్చులూడిపడటం, ఇనుప ఊచలు బయటకు వేలాడుతూ భయం కలిగిస్తున్నాయని అందులోని వ్యాపారులు చెబుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు దాని వెనకభాగంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ క్వార్టర్స్‌లోని కొన్ని బ్లాక్‌లు సైతం దెబ్బతిన్నాయి. కొత్త కలెక్టరేట్ ప్రారంభంతో ఇవన్నీ ఖాళీ అయ్యాయి. అయినప్పటికి శిథిల భవనాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు పలు శాఖల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. అప్రమత్తం చేస్తాం పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. కోట బురుజుల అంచున నివాసం ఉంటున్న జివిలీ వీధివాసులకు గతంలోనే నోటీసులు జారీ చేయడం జరిగింది. శిథిలావస్థ ఇళ్లులో నివాసం ఉంటున్న వారిని గుర్తించి అప్రమత్తం చేశాం. మరోసారి చర్యలు చేపడతాం. – జానకీరామ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
ఉత్సాహంగా సెపక్తక్రా పోటీలు
వనపర్తి: వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్తక్రా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ రెండు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిభకనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా రాణించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలే షియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదికి వనపర్తిలో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. యువత పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
దసరాకు ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లో 641 ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు తిరగనున్నాయి. రీజియన్‌లోని పది డిపోల నుంచి ఈ అదనపు బస్సులు శనివారం ప్రారంభం కాగా.. వచ్చే నెల 2వ తేదీ వరకు నడపనున్నారు. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లోని డిపోల నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు. రీజియన్ వ్యాప్తంగా.. దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ రూట్లో ఎక్కువ అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ రూట్లోనే ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు రూట్లోనూ అదనపు బస్సులు నడవనున్నాయి. మహబూబ్‌నగర్ డిపో నుంచి అధికంగా 93 అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, వారి సౌకర్యార్థం అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, షెల్టర్లు, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో శనివారం బస్టాండ్లలో రద్దీ కొంతమేర కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. పెరగనున్న ఆదాయం.. దసరా పండుగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు కొద్దిమేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభ మూడు రోజులు, ముగింపు అనంతరం రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు వచ్చేనెల 2 వరకు నడపనున్న ఆర్టీసీ హైదరాబాద్ రూట్లో ఎక్కువ స్థాయిలో రాకపోకలు సద్వినియోగం చేసుకోవాలి దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ తరపున అదనపు బస్సులు నడపనున్నాం. బస్సు సౌకర్యాన్ని ప్రయాణికుల సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఆర్టీసీని ఆదరించి బస్సుల్లో ప్రయాణించాలి. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ -
గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గద్వాలటౌన్: గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ముఖ్యమని ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సీనియర్స్ ఫుట్‌బాల్ పోటీల కోసం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం స్థానిక తేరుమైదానంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 20 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొననున్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాలటౌన్: పట్టణాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నదిఆగ్రహారం సమీపంలో ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాలో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనులు చేస్తున్నామని, ఆ దిశగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గద్వాల పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తున్నామన్నారు. -
కేసులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల క్రైం: పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎన్వీ. శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా కోర్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఎన్ ప్రేమలతతో కోర్టుకు సంబంధించిన పలు సమస్యాత్మక కేసులను అడిగి తెలుసుకున్నారు. నూతన కోర్టు సమూదాయం పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం స్థల సేకరణ, నిర్మాణ పనుల విషయంలో న్యాయవాదులు పలు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఆయన దృష్టికి జిల్లా జడ్జి తీసుకెళ్లారు. ప్రభుత్వం వ్యవసాయ సాగుకు అసవరమయ్యే జలవనురుల కోసం, ప్రాజెక్టు నిర్మాణాల కోసం స్థల సేకరణ పూర్తి చేసిన క్రమంలో రైతులకు అందించే ఆర్థిక సహాయ విషయంలో పలు అడ్డంకులు, రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వివిధ సమస్యలపై న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలో సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. సిబ్బంది జీపీఎఫ్, పదవీరమణ, మెడికల్ బిల్లులు తదితర పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై న్యాయమూర్తికి సిబ్బంది తెలియజేశారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తికి పలువురు న్యాయమూర్తులు శాలువా, పూలబోకేతో సత్కరించారు. -
ఓటర్ జాబితా సమర్థవంతంగా పూర్తి చేయాలి
గద్వాల: 2002–2025 ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి సరిపోల్చే ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఓటర్ జాబితా సరిపోల్చే ప్రక్రియ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2002–2025 ఓటరు జాబితా సరిపోల్చే కార్యక్రమాన్ని సమర్ధవంతగా నిర్వహించి ఓటరు జాబితా సరిపోల్చటంలో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పరిశీలించాలని, ఓటరు జాబితా సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటరు వర్గీకరణ ప్రకారం 2002 జాబితాలో ఉన్నవారిని సీ 18–21 మధ్య ఉన్న వారిని బి 22–37 మద్య వయస్సు ఉన్నవారిని సీ 18–21 మధ్య ఉన్న వారిని డీ కేటగిరిలో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఆర్టీఓ అలివేలు, అన్ని మండలాల తహసీల్ధార్లు, ఉన్నారు. -
‘డబుల్’ ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
గద్వాల: జిల్లా శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శనివారం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులందరూ నివాసం ఉండే విధంగా అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పెయింటింగ్, డ్రెనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషర్ జానకిరామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
వాహన ఫిట్నెస్ విషయంలో వాగ్వాదం
● ఎంవీఐ, ఏజెంట్ మధ్య మాటల యుద్ధం● సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్ గద్వాల క్రైం: ఓ వాహన ఫిట్నెస్ పరీక్ష నేపథ్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), ఏజెంట్ వాగ్వాదానికి దిగిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. వారిద్దరూ వాగ్వాదం చేసుకుంటున్న ఓ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ వాహనాదారుడి మినీ డీసీఎంకు సంబంధించి ఫిట్నెస్ అనుమతి కోసం గద్వాల డీటీఓ కార్యాలయానికి ఓ ఏజెంట్ తీసుకువచ్చారు. అయితే, ఎంవీఐ సదరు వాహనం తనిఖీ చేసిన క్రమంలో వాహనానికి ఇరువైపులా పసుపు రంగు స్టిక్కర్ లేకపోవడంతో.. స్టిక్కర్ వేసి తీసుకువస్తే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేస్తామని ఏజెంట్‌కు వివరించాడు. ఈ క్రమంలో ఏజెంట్, అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ పరీక్షలు చేయడం కుదరదని చెప్పడంతో.. నేను ముందే చెప్పాను, ఇప్పుడు చేయను అంటే ఎలా అని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఓ క్రమంలో నా మీదే బ్రతుకుతున్నావ్ అని ఏజెంట్.. నా సంతకంతో బతుకుతున్నావంటూ ఏంవీఐ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్జి డీటీఓ వాకబు విషయం తెలుసుకున్న ఇన్చార్జి డీటీఓ కృష్ణారెడ్డి కార్యాలయానికి వచ్చి వాకబు చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను సిబ్బంది వివరించారు. అనంతరం ఇన్చార్జ్ డీటీఓ మాట్లాడుతూ.. ఎంవీఐ, ఏజెంట్ వాగ్వాదంపై ఇప్పటికే విచారణ చేపట్టామని, ఒకవేళ ఎంవీఐపై తప్పిదమని తెలితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని, కార్యాలయం సమీపంలో ఉన్న ఏజెంట్లను పూర్తి స్థాయిలో నిలువరిస్తామన్నారు. వాహనాదారులు సైతం సేవల కోసం నేరుగా కార్యాలయానికి రావాలని, ఏజెంట్లను ఆశ్రయించవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
గద్వాలటౌన్: చిత్తూ.. చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా.. బంగారు బొమ్మ.. దొరికెనమ్మ ఈ వాడలోన.. అంటూ మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండగను జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో ముందస్తుగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలతో ఆయా విద్యా సంస్థలు మొత్తం సందడిగా మారాయి. మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకొని ముందుకు సాగారు. బతుకమ్మల ముందు పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పలు విద్యా సంస్థలలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని బొడ్డెమ్మలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలతో ఆడపిల్లల ఔన్నత్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరూరులో బతుకమ్మలతో వెళ్తున్న విద్యార్థులు -
పత్తి రైతు ఆశలు ఆవిరి..
● 4 ఎకరాల్లో పత్తి పంట తొలగింపు ఉండవెల్లి: మండలంలోని చిన్న ఆముదలపాడు శివారులో రైతు కొండన్న 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. దాదాపు పంటను సాగు చేసినప్పటి నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. ఇటీవల పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంట మొత్తం దెబ్బతిన్నది. చేసేది లేక.. శుక్రవారం ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులది అందరిదీ ఇదే పరిస్థితి అని, పంట తొలగించినా పట్టించుకునే అధికారులు లేరని, ప్రభుత్వం స్పందించి పత్తి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బాధిత రైతు కోరాడు. -
అట్టహాసంగా బోధనోపకరణ మేళా
గద్వాలటౌన్: సాధారణంగా మేళా అనగానే విద్యార్థులు పాల్గొని తమ ప్రాజెక్టుల గురించి ఆహుతులకు, తోటి విద్యార్థులకు వివరించడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాస్థాయి బోధనాభ్యాసన సామగ్రి (టీఎల్ఎం) మేళా పోటీలను నిర్వహించారు. స్థానిక బాలభవన్‌లో జిల్లాస్థాయి టీఎల్ఎం వేళాను నిర్వహించారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన సుమారు 120 మంది ఉపాధ్యాయులు వేళాలో పాల్గొని తాము తయారు చేసిన బోధనపకరణాలను ప్రదర్శించారు. తెలుగు, ఆంగ్లం, ఈవీఎస్, గణితానికి సంబంధించిన నమూనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వాటిని విద్యార్థుల్లా అందరికి వివరించి ఔరా అనిపించారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మేళాను ప్రారంభించి ఆయా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి బోధనోపకరణ ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా ఉపాధ్యాయులు తమ సత్తాచాటి బోధనలో తమకు సాటిలేరని నిరూపించాలని డీఈఓ అబ్దుల్ ఘనీ ఆకాక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థికి చదవడం, రాయడం వంటివి వచ్చి ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు శ్రమించాల్సిన అవసరముందన్నారు. బోధనాభ్యసన సామగ్రి విద్యార్థిలో ఆసక్తిని పెంపొందించడంతో పాటు సులువుగా నేర్చుకోవడానికి దోహ దపడుతుందని వివరించారు. టీఎల్ఎం వేళాకు న్యాయ నిర్ణేతలుగా జీహెచ్ఎంలు మహేష్, అమీర్‌భాషా, బాలాజీ, విష్ణువర్థన్ వ్యవహరించారు. విజేతలు వీరే.. ప్రతి విభాగంలో ఇద్దరి చొప్పున 8 మంది ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయి టీఎల్ఎం మేళాకు ఎంపిక చేశారు. లక్ష్మి (కొండపల్లి), రమీజాభీ (పెద్దపోతులపాడు), పరమేశ్వరి (అయిజ), మోహిని (తక్కశిల), శ్రీలత (తాటికుంట), నాగరాజు (పెదొడ్డి), కిశోర్‌కుమార్ (నాగర్‌దొడ్డి), శిశిరేఖ (మాచర్ల) విజేతులుగా నిలిచారు. -
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నా రు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి. – హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా ధరలు పెరిగాయి.. భారంగా మారింది.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది. – చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి) అప్పు చేసి నిర్మిస్తున్నాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎంతో ఆనందించాం. ఇల్లు అయితే ప్రారంభించాం కానీ నేటికీ ఇసుక అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్నాం. ఇక సిమెంట్, రాయి, స్టీల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండడంతో దిక్కుతోచడం లేదు. గౌండలకు, సెంట్రింగ్ ఖర్చులు అధికవవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుండగా.. ఇప్పటికే రూ.3 లక్షలు అవుతున్నాయి. అప్పు చేసి ఇల్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – కృష్ణకుమార్, లబ్ధిదారుడు, ఉండవెల్లి ఆధార్‌కార్డుల్లో తప్పులతో ఇబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్‌కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. – వైద్యం భాస్కర్, గృహనిర్మాణ శాఖ పీడీ, మహబూబ్‌నగర్ ● -
పారదర్శకంగా పత్తి కొనుగోలు: కలెక్టర్
గద్వాల: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాఫీగా నిర్వహించేలా అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలుకు సంబంధించి రైతుకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాలలో తూకం, చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. గద్వాలలో రెండు, అలంపూర్‌లో ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నుంచి పత్తికొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పత్తిలో తేమ శాతం 8వరకు ఉండేలా ఇప్పటి నుంచే రైతులకు అవగాహన కల్పించాలని, కిసాన్ యాప్ ద్వారానే రైతులు స్లాట్‌బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయ శాఖ ఏడీ సంగీతలక్ష్మీ, సీసీపై ఏడీ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి పురోగతి సాధించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యలయంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అన్ని మండలాల అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లక్ష్యాన్ని కేటాయించిన నిర్మాణాల లక్ష్యన్ని వీలైనంత త్వరగా చేరుకోవాలని అన్ని గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల వివరాలను త్వరగతిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ నందు అన్లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా పూర్తి చేస్తే బిల్లులు త్వరగా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, శ్రీనివాస్‌రావు, డిపిఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు. ఓటర్ జాబితాను సరిపోల్చండి 2002–2025 ఓటరు జాబితాను సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్పరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 2002–2025 ఓటరు జాబితాలో సరిపోల్చే కార్యక్రమంపై మాట్లాడారు. ఓటరు జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కేటగిరీలుగా విభజించి నిర్దేశాలు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలన్నారు. -
సమీకృత వ్యవసాయంతో సుస్థిర లాభాలు
శాంతినగర్: వ్యవసాయ పంటలతోపాటు అను బంధ సంస్థలపై దృష్టిసారిస్తే రైతులు లాభాల బాటపడతారని ఉద్యానవనశాఖ జిల్లా అధికారి ఎంఏ.అక్బర్ అన్నారు. శుక్రవారం వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామ రైతు వేదికలో వర్షాధార ప్రాంత అభివృద్ధి ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలు, కూరగాయలతోపాటు పాడిపరిశ్రమ, పశువుల పోషణ, చేపల పెంపకం వంటి సమీకృత వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంభిస్తే మంచి దిగుబడులు సాధించి వ్యవసాయం లాభసాటిగా వుంటుందన్నారు. కార్య క్రమంలో డివిజినల్ ఉద్యానవన అధికారి పి. ఇమ్రానా, ఏఈఓ రామనాయుడు, హెచ్ఈఓ శివకుమార్, యశ్వంత్, రైతులు పాల్గొన్నారు. కూరగాయల సాగుతో.. మల్దకల్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు ప్రతి రైతు కూరగాయల సాగు చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అక్బర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుర్తిరావులచెర్వు రైతువేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంటలతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకోవాలన్నారు. రసా యనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకంను పెంచాలన్నారు. అలాగే, పండ్లతోటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం పండ్లతోటల సాగుకు అందిస్తున్న ఆర్థికసాయంను సద్వినియోగం చేసుకుని సాగు పెంచాలన్నారు. క్రీడా క్యాలెండర్నుఆవిష్కరించిన వీసీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో 2025–26 విద్యాసంవత్సంలో జరిగే వివిధ క్రీడలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను వీసీ శ్రీనివాస్ శుక్రవారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నెలల్లో నిర్వహించే క్రీడల వివరాలతో క్రీడా క్యాలెండర్ రూపొందించామని, దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఆయా తేదీల ఆధారంగా విద్యార్థులకు క్రీడలకు సిద్ధం అయ్యేందుకు ఆస్కారం ఉందన్నారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుందని, భవిష్యత్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్ ● ఎంఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్‌కు చెందిన ఓ రైతు తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వీరిని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్‌లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్కే జిలాని, కిషన్‌నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
మల్దకల్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికి మెరుగైన విద్యాబోధన అందజేసి వారి విద్యాభివృద్దికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కళాశాలలో విద్యార్థుల, అధ్యాపకుల హాజరు నమోదును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. పాఠ్యాంశాలను నిరంతరం బోధిస్తూ అంతర్గత పరీక్షలను సమయానుకూలంగా నిర్వహించి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ, అధ్యాపకులు నర్సింహులు, రామాంజనేయులు గౌడ్, గోవర్దన్ శెట్టి భాగ్యలక్ష్మీ, మాధురి, రాఘవేంద్ర, శ్రీకాంత్, బాలకృష్ణ, సుధాకర్, రంగస్వామి, నీలవేణి తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
గద్వాలన్యూటౌన్: టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ (టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లక్ష్యమని రాష్ట్ర ట్రాయ్ కాగ్ సభ్యులు కళ్లెపు శోభారాణి అన్నారు. గురువారం మండలంలోని శెట్టిఆత్మకూర్‌లో స్వయం సహాయ సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ ప్రజలకు... టెలికాం సంబంధిత వినియోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1997లో టెలికాం వినియోగదారుల హక్కుల కోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకరావడం జరిగిందని చెప్పారు. మొబైల్ వినియోగదారులు టెలికాం సంస్థల నుంచి ఉత్తమ సేవలు పొందేందుకు ఈ తరహా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పత్రాన్ని 2006లో తీసుకరావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 48కోట్ల మంది వినియోగదారులు వినియోగించుకున్నారని తెలిపారు. అవాంచిత కాల్స్ మొబైల్ వినియోగదారులకు ప్రధాన సమస్యగా మారడాన్ని ట్రాయ్ గుర్తించి, 1909 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే ఆ నెంబర్‌ను బ్లాక్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2025 నాటికి అందరూ బ్రాడ్ బ్రాండ్ కలిగి ఉండేలా దేశ వ్యాప్తంగా 6లక్షల గ్రామాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను అడ్డుకోవడానికి డి.ఎన్.డి. అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, నంబర్ని నమోదు చేసుకుంటే అనవసరమైన వ్యాపార సంస్థల కాల్స్ రావని చెప్పారు. ఒకవేళ కాల్స్ వస్తే సంబంధిత వ్యాపార సంస్థలకు ట్రాయ్ జరిమానా విధిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు టెలికాం రంగంపై పూర్థి స్థాయిలో అవగాహన కలిగి ఉండి, తమను తాము కాపాడుకునేవిదంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ డీపీఎం సలోని, ఏపీఎం దేవానంద, సీసీలు వెంకటనారాయణ, రంగన్న, గ్రామకార్యదర్శి దీపమాలిని, కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాతీరానికి సొబగులు
కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాయి. నిధుల కేటాయింపు.. వెల్నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం రూ.45.84 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, నడింతిప్ప ప్రాంతాల్లో కృష్ణానది మధ్యలో గల దీవిలో పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇక్కడ యోగా డెక్, పెవిలియన్, స్పా ఏరియా, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాలు, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూంలు, బోట్లు నిలిపేందుకు జెట్టీలు, వివిధ రకాల చెట్లతో గార్డెనింగ్ వంటి పనులు సుందరంగా చేపట్టనున్నారు. అదేవిధంగా సోమశిలలో వీఐపీ ఘాట్‌కు పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.1.60 కోట్లతో ఘాట్ విస్తరణ, బోటింగ్ వసతులు మెరుగుపర్చే పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఇటీవలే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కన్సల్టెన్సీలతో సంప్రదింపులు.. పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు పలు కన్సల్టెన్సీలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పర్యాటక శాఖ అధికారులను సంప్రదించారు. ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టే వారికే ఈ పనులు అప్పగించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కన్సల్టెన్సీల ప్రతినిధులు అమరగిరి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అమరగిరి సమీపంలోని కృష్ణానది అందాలుహెలీటూరిజంతో ప్రాముఖ్యతసోమశిల నుంచి శ్రీశైలం వరకు హెలీ టూరిజం ప్రారంభిస్తామని ఇటీవల రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. నల్లమల అడవి, కృష్ణానది అందాలు తిలకిస్తూ సాగే హెలీ టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నదిలో లాంచీ ప్రయాణం ఏర్పాటు చేయగా..హెలీ టూరిజం ఏర్పాటుతో జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కృష్ణానది పరివాహకంలో టూరిజం అభివృద్ధికి నిధులు అమరగిరి, సోమశిలలో వసతుల కల్పనకు చర్యలు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్న కన్సల్టెన్సీలు పర్యాటక గ్రామాలకు వెళ్లే రహదారుల ఏర్పాటుకు శ్రీకారం -
నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: నాణ్యమైన విత్తనంతోనే రైతులు అధిక దిగుబడులు సాదించవచ్చునని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి అన్నారు. నాణ్యమైన విత్తనం – రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని తిమ్మాపురం, ఎర్రవల్లి, కొండపేట గ్రామాలను ఆమె సందర్శించి రైతులు సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను గురించి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దీనివల్ల పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీని కోసం ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కూడా ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవికుమార్, ఏఈఓ నరేష్, రైతులు, తదితరులు ఉన్నారు. వసతిగృహం తనిఖీ ఉండవెల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ నుశీత గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేయడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. వసతిగృహం అద్దె భవనంలో కొనసాగుతుండగా.. భవనంలో వెలుతురు కోసం లైటింగ్, అలాగే బాత్రూంలు మరమ్మతు చేయించాలని భవన యజమానికి సూచించారు. విద్యార్థుల హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్ వార్టెన్ శేషన్న తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,592 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 212 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5592, కనిష్టం రూ. 1802, సరాసరి రూ. 4522 ధరలు లభించాయి. అలాగే, 26 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6059, కనిష్టం రూ. 5519, సరాసరి రూ. 5519 ధరలు పలికాయి. హంస క్వింటాల్ రూ.1,744 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం క్వింటాల్‌కు రూ.1,744 ఒకే ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు వంద బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌కు రైతులు కత్తెర పంట కింద సాగు చేసిన వరి దిగుబడులను అమ్మకానికి తెస్తున్నారు. -
దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండటంతో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. ఈమేరకు గురువారం శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లను డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు, ఆలయ ఈఓ దీప్తి ఆలయ ధర్మకర్తలతో కలిసి పరిశీలించారు. ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో జోగుళాంబ అమ్మవారు పలు అవతారాల రూపంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరిలి వచ్చే భక్తులకు దర్శనానికి క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అలాగే, జోగుళాంబ ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, దశమి రోజు జరిగే తెప్పోత్సవం నిర్వహణపై అధికారులు సుధీర్ఘంగా చర్చించారు. ఈమేరకు ఆలయ పరిసరాలు, తుంగభద్ర నది తీరం, పుష్కరఘాట్‌ను పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలతోపాటు పార్కింగ్, రవాణా అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఎస్ఐ వెంకస్వామి, ధర్మకర్తలు నాగశిరోమణి, అడ్డాలకు రాము, జగన్ గౌడ్, గోపాల్, ఆలయ అధికారులు బ్రహ్మయ్య ఆచారి, రాజేష్, కాంతు ఉన్నారు. -
ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి
గట్టు: జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. గురువారం గట్టులో సోషల్ అడిట్పై ప్రజావేదికను నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు 27 గ్రామ పంచాయతీల్లో రూ.5.64 కోట్ల విలువ కల్గిన ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేపట్టారు. ఈ పనులకు సంబంధించి సామాజిక తనిఖి బృందాలు క్షేత్ర స్థాయిలో ఆడిట్ నిర్వహించారు. ఎస్ఆర్పీ భద్రునాయక్ ఆధ్వర్యంలో 11మంది డీఆర్పీలు, ఏవీఓ శ్రీనివాస్‌లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఆడిట్ నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఆడిట్ నివేదికను ప్రజావేదికలో వెల్లడించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పండ్ల తోటలు, కాంటూరి కందకాలు, ఫీడర్ చానల్, వాలు కట్టల నిర్మాణాలు, పశువుల కొట్టాల నిర్మాణం వంటి పనులు చేపట్టడడం జరుగుతుందని తెలిపారు. వీటిని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులకు, గ్రామస్తులకు శాశ్వతంగా ఉపయోగ పడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇదే క్రమంలో ఉపాధి నిధులను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుని, దుర్వినియోగం అయిన నిధులను వెనక్కి రాబడుతామన్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఓ స్వామి, వివిధ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు. -
తొలగనున్న ఇబ్బందులు
సాదాబైనామా ఒప్పందాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం కాగా, రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన వివాదాలు తలెత్తాయి. హైకోర్టు నిర్ణయంతో ఈ దరఖాస్తులు చట్టబద్ధంగా క్రమబద్దీకరించబడి, ఆస్తి యజమానులకు చట్టబద్దంగా హక్కులు లభించనున్నాయి. ఇది బ్యాంకు రుణాలు, ఆస్తి అమ్మకాలు, వారసత్వ హక్కుల విషయంలో ఇబ్బందులను తొలగిస్తుంది. – యువతేజేశ్వర్ రెడ్డి, గుడుదొడ్డి ఆస్తి హక్కులపై భద్రత హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడం హర్షించతగ్గ విషయం. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో జిల్లాలో 2వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం లభించనుంది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఆస్తి హక్కులపై స్పష్టత, భద్రతను అందిస్తుంది. – నజీర్, అయిజ కీలక అడుగు జిల్లా అధికారులు ఈపక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దరఖాస్తుదారులకు సరైన మార్గదర్శకాలు అందించి, అవకతవకలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలి. ఈనిర్ణయం గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్థిరత్వం, భద్రతను అందించే కీలక అడుగు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించేందుకు చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ను ప్రోత్సహించాలి. – సురేంద్ర స్వామి, సింధనూరు ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సాదాబైనామాలకు సంబంధించి 2014 జూన్ 2 లోపల కొనుగోలు అమ్మకం జరిగిన వ్యవహారానికి సంబంధించి, 2020 నవంబర్ 10 లోపల జిల్లాలో 2,392 దరఖాస్తులు ఉన్నాయి. అయితే వాటిని పరిశీలించేందుకు పూర్తి విధివిధానాలు ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. గైడ్‌లైన్స్ అనుసరించి దరఖాస్తులను పరిశీలిస్తాం. – లక్ష్మినారాయణ, అదనపు కలెక్టర్ -
మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి
గద్వాలటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి పిలుపునిచ్చారు. మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరా న్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్య పద్దతుల గురించి ఈతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జన ఔషద సంస్థ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మందులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని, సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
జోరుగా ఉల్లి వ్యాపారం
● గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,100 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వివిధ గ్రామాల నుంచి రైతులు వేయి బస్తాల వరకు ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 పలకగా.. కనిష్టంగా రూ.1,100 ధర వచ్చింది. గత వారం కంటే ధరలు స్వల్పంగా పెరిగాయి. 50 కిలో ఉల్లి బస్తా గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.550, మధ్యస్తంగా రూ.700 చొప్పున విక్రయించారు. ఆర్ఎన్ఆర్ ధర రూ.2,009 దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన ఈనామ్ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2009 ఒకే ధర లభించింది. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,719, కనిష్టంగా రూ.1,629 ధరలు నమోదయ్యాయి. వేరుశనగ క్వింటా రూ.4,239 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 96 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 4239, కనిష్టం రూ. 2419, సరాసరి రూ. 3539 ధరలు లభించాయి. అలాగే, 11 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 6019, కనిష్టం రూ. 6011, సరాసరి రూ. 6011 ధరలు పలికాయి. -
అందరికీ సంక్షేమ ఫలాలు
గద్వాల: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని అధికారంలోకి వచ్చిన 48గంటల్లోనే అమలు చేస్తూ సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రజల ఆత్వగౌరవానికి ప్రతీకగా నిలిచిన రేషన్‌కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై 14వ తేదీన ప్రారంభించామన్నారు. పదేళ్ల తరువాత మళ్లీ ప్రజలకు కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. ఉగాది పండుగ నుంచే ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జిల్లాలో 1,81,352 రేషన్‌కార్డు లబ్ధిదారులకు 4058 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించడం జరిగిందన్నారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులుఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. బాలభవన్ నాట్య మయూరి నృత్యశిక్షణ కేంద్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, మార్కెట్‌యార్డు చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సేవలు
గద్వాల క్రైం: మహిళలు ఎదుర్కొంటుంన్న ఆరోగ్య సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17వ తేది నుంచి ఈక్టోబర్ 2వ తేది వరకు మహిళల ఆరోగ్య సమ్యసలపై ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో సీ్త్ర వ్యాధి, మానసిక, నేత్ర, చెవి, ముక్కు, దంత, చర్మ, పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. రక్తపోటు, షుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్, టీబి తదితర రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మహిళలు శిబిరంలో పాల్గొనాలని, అన్ని రకాల వ్యాధులకు మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, రాజు, ప్రసూన్నరాణి, సంధ్యాకిరణ్మై, శ్రీధర్‌గౌడ్, తదితరులు ఉన్నారు. నేడు, రేపు డిగ్రీలోస్పాట్ అడ్మిషన్లు శాంతినగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గురు, శుక్రవారాల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రామా ఓబులేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక, స్థానికేతర విద్యార్థులకు అడ్మిషన్ చేసుకునేందుకు అవకాశం వుందని తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 18, 19 తేదీల్లో కళాశాలలో హాజరుకావాలని సూచించారు. పారదర్శక పాలనతోప్రజలకు మేలు మహబూబ్‌నగర్ క్రైం: ప్రజా పాలన ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు ఎన్నో లాభా లు ఉంటాయని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం డీఐజీ కార్యాలయంలో డీఐజీ, అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మరింత కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణిబాయి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, భగవంతురెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, ఆర్ఐలు నగేష్, కృష్ణయ్య పాల్గొన్నారు. -
శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించాలి
గద్వాల/అలంపూర్: జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రధానంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. అదేవిధంగా వీఐపీల ప్రోటోకాల్ విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీటిని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రసాద్‌స్కీమ్ భవన్లో నీటికొరత తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్య పనులను పక్కాగా చేపట్టి ఆలయ ప్రాంగణం, ఘాట్పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అలంపూరు వరకు, అలంపూర్ నుంచి దేవస్థానం వరకు బస్సులను పెంచాలన్నారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేలా మెడికల్ క్యాంపు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని, విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో అలివేలు, దేవాలయశాఖ ఈవో దీప్తి, మిషన్‌భగీరథ ఇంట్రా, గ్రిడ్ ఈఈలు శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, ఆర్అండ్బి ఈఈ ప్రగతి, ఇరిగేషన్శాక ఈఈ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులకు ఆహ్వానం జోగుళాంబ ఆలయంలో జరిగే శరన్ననవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ జిల్లా అధికారులను ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ దీప్తి ఆలయ ధర్మకర్తలు.. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ లక్ష్మినారయణను బుధవారం కలిశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో హాజరుకావలని కోరుతూ ఆహ్వానం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, అడ్డాకుల రాము, జగన్ గౌడు, గోపాల్, జయన్న, నాయకులు జోగుల రవి తదితరులు ఉన్నారు. జోగుళాంబ ఆలయంలో పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు కలెక్టర్ బీఎం సంతోష్ -
యూరియా కోసం తప్పని తిప్పలు
ఎర్రవల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎర్రవల్లి: వానాకాలంలో వరి, చెరుకు, వేరుశనగ, పత్తి తదితర పంటలు సాగుచేసిన రైతులకు యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌లు, ఇతర ఎరువుల విక్రయ కేంద్రాలకు చేరుకొని గంటల తరబడి నిరీక్షించినా రెండు బస్తాల యూరియా లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వివిధ గ్రామాల రైతులు ఎర్రవల్లి సింగిల్‌విండో కార్యాలయానికి తెల్లవారుజామునే చేరుకొని యూరియా కోసం క్యూ కట్టారు. కొందరు తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి నిరీక్షించారు. యూరియా కొరత కారణంగా పస్తులుండి పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం సరిపడా యూరియాను అందించాలని కోరారు. -
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు. – అంజన్న, ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి పోరాటంలో ఎంతో పాత్ర.. తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు. – సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి -
అన్ని సౌకర్యాలతో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు
గద్వాల: విద్యార్థులు, యువత భవిష్యత్ కోసం డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ భవనంలో తాత్కాలిక డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా బీఎస్ఎన్ఎల్ కార్యాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ, గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ పర్యవేక్షించి కేంద్రాన్ని త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీతో విద్యార్ధులు పుస్తకాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆన్లైన్ తరగతులు, పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలతో పాటు వివిధ కోర్సులకు సన్నద్ధమయ్యేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్ధ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పండ్లతోటల సాగు.. భలే బాగు
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో పండ్ల తోటల సాగు ఏటేటా పెరుగుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా పండ్లతోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు.. అనువైన పరిస్థితులు.. పండ్లతోటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోరుబావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోరుబావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికొస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అవగాహన కరువు.. ఆయా సీజన్లలో పండ్ల తోటలకు రకరకాల తెగుళ్లు ఆశించి.. దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యానశాఖ తగిన సలహలు, సూచనలు అందించి.. రైతులను అప్రమత్తం చేయాలి. దీంతో పాటు మార్కెటింగ్ మెళకువలు తెలియక చాలా మంది రైతులు మధ్యవర్తులకు పండ్లను విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించి.. రైతులకు మెళకువలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సంవత్సరం రైతుల సంఖ్య సాగు 2020–21 2,594 9,315 2021–22 3,354 11,106 2022–23 3,930 12,337 2023–24 4,390 13,568 2024–25 4,936 14,939 2025–26 5,118 15,332 (ఇప్పటివరకు) నడిగడ్డలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం తోటల పెంపకానికి ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలం ఏటా రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి 2020–21 నుంచి పండ్లతోటల సాగు ఇలా (ఎకరాల్లో).. మారిన ఆలోచనా సరళి.. జిల్లాలో పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి సాగుచేస్తూ వస్తున్న రైతుల ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటం.. మూడేళ్ల నుంచి ఐదేళ్ల పాటు మంచి నిర్వహణ పద్ధతులు అవలంబిస్తే దిగుబడి బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటలపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజిర, జామ, డ్రాగన్‌ఫ్రూట్ తదితర తోటలు సాగుచేస్తున్నారు. కాగా, పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్ర ఆధీనంలోని ఎంఐడీహెచ్ పథకంతో పాటు, ఉపాది హమీ పథకం కింద పండ్లతోటల సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఆయా పథకాలతో సన్న, చిన్నకారు రైతులు సైతం పండ్లతోటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. 2020–21లో జిల్లావ్యాప్తంగా 9,315 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా.. ఈఏడాది (2025–26) ఇప్పటివరకు 15,332 ఎకరాలకు పండ్లతోటల సాగు విస్తీర్ణం పెరిగింది. -
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు. -
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి లడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.. రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లడిల్లిన అప్పంపల్లి అమరవీరులకు గుర్తింపేది? -
గిరిజన హక్కుల సాధనకు అలుపెరగని పోరాటం
గద్వాలన్యూటౌన్: లంబాడీ, గిరిజన హక్కుల సాధన కోసం సేవాలాల్ సేన అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఇన్చార్జి మూడావత్ కృష్ణనాయక్, అధ్యక్షుడు ఆంగోత్ రాంబాబు అన్నారు. మంగళవారం సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్ సర్కిల్ సమీపంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్‌శ్రీ తపస్వి రామారావు మహరాజ్ చేతుల మీదుగా సేవాలాల్ సేన ఆవిర్భవించిందని చెప్పారు. రాష్ట్రంలో లంబాడీ, గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. లంబాడీ, గిరిజనుల్లో రాజకీయ చైతన్యం రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవి నాయక్, ఉపాధ్యక్షుడు నెనావత్ రవినాయక్, నర్సింహులు, రేఖానాయక్, పాత్లావత్ రవి నాయక్, ధాన్య నాయక్, నరేంద్రనాయక్, నర్సింహ పాల్గొన్నారు. -
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. స్మరించుకోని పాలకులు.. నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
ఎర్రబారుతున్న పత్తి..!
వాతావరణంలో మార్పులతో తెగుళ్ల బెడద తీవ్రం ధరూరు: పత్తి రైతుపై వాతావరణం పగబట్టింది. ఎన్నడూ లేనిది వానాకాలానికి నెల రోజుల ముందే వరుణుడు పలకరించడం.. పంట వేసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పత్తి పంటకు తెగుళ్ల బెడద తీవ్రమైంది. ఈ ఏడాది వర్షాలు ముందస్తుగా పలకరించగా జూరాల ప్రాజెక్టుకు రెండు నెలల ముందే వరద నీరు వచ్చింది. అదే తరుణంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సాగు నీరు రావడంతో పంట సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు తెగుళ్లతో నిరాశే మిగిలింది. గతేడాది సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ తాము ఈ సారైనా గట్టెక్కుతాము అనుకున్న రైతులకు గడ్డు పరిస్థితే ఎదురైంది. వాతావరణ మార్పుల ప్రభావం.. అధిక వర్షాల ప్రభావంతో మొన్నటి వరకు కళకళలాడుతున్న పత్తి పంట రైతు కళ్లెదుటే ఎర్రబారిపోతుంది. ఎన్ని రకాల మందులు కొట్టినా.. అడుగు మందులు పెట్టినా పంటలను కాపాడుకోలేకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,85,148 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఎర్రతెగుళ్లతో 40వేల నుంచి 50వేల వరకు పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 40వేల నుంచి 50వేల ఎకరాలపై ప్రభావం నడిగడ్డ ప్రాంతంలో సీడ్‌తోపాటు కమర్షియల్ పత్తిని అధికంగా సాగు చేస్తారు. పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ సారి నష్టాలే మిగిలాయి. జిల్లాలో మొత్తం 1,85,148 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. 30 నుంచి 40శాతం వరకు ఎర్రతెగుళ్ల ప్రభావం పడింది. దీనిపై ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ఎలాంటి సర్వే చేపట్టలేదు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం పంటలు 3,55,700 వరి 86,318 వేరుశనగ 5,825 కంది 19,476 మొక్కజొన్న 11,337 జిల్లాలో వానాకాలం సీజన్లో పంటల సాగు ఇలా.. పంటంతా నాశనమైంది ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేశాను. ఎన్ని మందులు కొట్టినా.. అడుగు మందులు పెట్టినా పంట కుదుట పడడంలేదు. నాలాంటి చాలా మంది రైతుల పొలాల్లో ఎర్ర తెగులు సోకి పంటంతా పూర్తిగా నాశనమై పోయింది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – ఆంజనేయులు, రైతు, సోంపురం యూరియా అందకనే.. సకాలంలో పంటలకు మందులు అందిస్తేనే బాగుంటాయి. మార్కెట్లో సకాలంలో ఎరువులు అందడం లేదు. ముఖ్యంగా యూరియా అందక నానా అవస్థలు పడుతున్నాం. డీలర్లను అడిగితే రాలేదు అంటున్నారు. ప్రభుత్వం సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి. – శాంతన్న, రైతు, ధరూరు ఎర్ర తెగులుతో దిగుబడిపై తీవ్ర ప్రభావం సకాలంలో ఎరువులు అందక మరిన్ని ఇక్కట్లు పంట నష్ట పరిహారం అందించాలని రైతుల వేడుకోలు -
ప్రతిరోజూ కాపలానే..
నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – బస్లింగప్ప, చేగుంట, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి. – అంపయ్య, గుడేబల్లూరు, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా ● -
వసతిగృహాలను విధిగా తనిఖీ చేయాలి
● విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి ● క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ● జోగుళాంబ ఆలయం, పలు వసతిగృహాలు, పాఠశాలల సందర్శన అలంపూర్/ఉండవెల్లి: వసతిగృహాలను జిల్లా, మండల అధికారులు విధిగా తనిఖీ చేయాలని, సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం ఆయనతోపాటు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ అలంపూర్ ప్రభుత్వ ఎస్సీ బాలికల, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 145 మంది విద్యార్థులకుగాను 45 మంది గైర్హాజర్ అవగా.. అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాలను జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని, ఆయా సమస్యలపై జిల్లా అధికారులతో మాట్లాడతాని చెప్పారు. వీరితోపాటు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, రాష్ట్ర అడ్వజరీ కమిటి సభ్యుడు మహ్మద్ ఇస్మాయిల్, నాయకులు గట్టు తిమ్మప్ప, నరసింహ్మ మహేష్ గౌడ్ ఉన్నారు. ఉండవెల్లి పాఠశాలకు రూ.కోటి మంజూరు ఉండవెల్లిలో అసంపూర్తిగా నిలిచిన జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ఎంపీ, సీఎస్ఆర్ నిధులు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఎంపీ పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈక్రమంలో చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు నడుచుకుంటూ పాఠశాలకు వస్తామని తెలపడంతో 8 నుంచి 10 వ తరగతి కి చెందిన విద్యార్థుల వివరాల తెలుసుకుని వారికి సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మారుమూల గ్రామాలకు సకాలంలో బస్సు వచ్చేలా కలెక్టర్, డిపో అధికారులతో మాట్లాడతానన్ని అన్నారు. నాయకులు గట్టు తిమ్మప్ప, వెంకటేష్ గౌడు, నాగేష్, రమేష్ పాల్గొన్నారు. యునెస్కో గుర్తింపు తీసుకరావాలి ఇదిలాఉండగా, అలంపూర్ ఆలయాలకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ ఎర్రవల్లి బాలుర గురుకులాన్ని సందర్శించారు. -
ఎట్టకేలకు ముందడుగు..
కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. -
ఉపాధ్యాయుల్లేక.. విద్యకు దూరమవుతున్నాం
గద్వాల: పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యకు దూరమవుతున్నామని.. ఇకనైనా స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని గుర్రంగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలెక్టర్ సంతోష్‌ను కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు విద్యార్థులు గుర్రంగడ్డ నుంచి పడవలో గద్వాలకు చేరుకున్నారు. గత నెల 26న ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతిపై మల్దకల్‌కు బదిలీ అయ్యారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారి తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో 35 మంది విద్యార్ధులు ఉన్నా బోధించేవారు తెరని వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. రెండురోజుల్లో ఉపాధ్యాయుడిని నియమిస్తామని, విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. పడవలో వచ్చి కలెక్టర్‌ను కోరిన గుర్రంగడ్డ విద్యార్థులు -
కోయిల్‌సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్‌సాగర్‌కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్‌సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్‌సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
అద్భుతం.. ఆ కట్టడాలు
జోగుళాంబ గద్వాలసరళమైన కోయిల్‌సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్‌సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
మార్పు వచ్చేనా..?
●బాధ్యతను గుర్తుచేస్తూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది మృతి చెందారు. గడిచిన 9 నెలల వ్యవధిలో 73మందికిపైగా మృత్యువాతపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన క్రమంలో మోతాదుకు మించి మద్యం సేవించినట్లు సిబ్బంది గుర్తించారు. అలాంటి వారిని కోర్టులో హజరుపరచగా జరిమానాలు, జైలు శిక్షలు పడుతున్నాయి. అయితే వారిలో ఆశించిన మార్పు రావడంలేదు. ఈక్రమంలో వారిలో పూర్తిస్థాయిలో మార్పు రావాలనే లక్ష్యంతో బాధ్యతను గుర్తు చేస్తూ సామాజిక స్పృహ కల్పించాలనే దిశగా న్యాయశాఖ చర్యలు చేపట్టింది. వారి ఆదేశాల మేరకు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో ఈ శిక్షలను అమలు చేయిస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో 60 నుంచి 80శాతం ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. మద్యం తాగి వాహనాలు నడపడం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ మద్యం ప్రియులు నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అధికారులు జరిమానాలు విధించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడంలేదు. దీంతో మద్యం ప్రియులకు జరిమానాల కంటే బాధ్యతలను గుర్తు చేయాలనే లక్ష్యంతో న్యాయశాఖ వినూత్న ఆలోచనకు తెరతీసింది. పోలీసులు, సామాన్యులతో కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితోనే మద్యం తాగడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు, వాహనాదారులకు తెలియజేయాల్సిందిగా శిక్ష అమలు చేసింది. ఈ నెల 11వ తేదీన కేటీదొడ్డి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ పట్టుబడగా వారికి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో ప్లకార్డులను చేత పట్టించి సమాజసేవలో భాగస్వాములను చేయాలని తీర్పు ఇచ్చింది. ఇదే తరహాలో అయిజకు చెందిన మద్యంతాగి పట్టుబడిన క్రమంలో న్యాయమూర్తి సదరు వ్యక్తికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 10 మొక్కలు నాటమని సామాజిక సేవ రూపంలో శిక్షను అమలు చేయగా జిల్లా పోలీసుశాఖ శిక్షను అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి వినూత్న శిక్ష అమలు జరిమానాలకు బదులు సమాజసేవలో భాగస్వామ్యం పట్టుబడిన వారితో అవగాహన కార్యక్రమాలు మొక్కలు నాటించి బాధ్యత తెలిసేలా చర్యలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అనేక అనర్థాలు 9 నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో 73 మంది మృత్యువాత -
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ ● నేడు, రేపు ప్రత్యేక చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ ● విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్వకుర్తి టౌన్/గద్వాల టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్‌ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్‌లో వివరాలను పొందుపరిచారు. నేరుగా రిపోర్టు.. దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్‌లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చిన రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్‌టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సద్వినియోగం చేసుకోండి.. దోస్త్ వివిధ విడతలలో అడ్మిషన్ పొందని విద్యార్థుల కోసం సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశం. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. – శ్రీపాద శార్వాణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి ●జోగుళాంబ గద్వాల జిల్లాలో 3,411 మిగులు సీట్లు జిల్లాలో 3 ప్రభుత్వ, 9 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. 3,411 సీట్లు స్పాట్ అడ్మిషన్లో భాగంగా విద్యార్థులకు ఎంచుకునే అవకాశం ఉంది. ఆయా కళాశాలలలో విద్యార్థులను చేర్పించేందుకు గాను లెక్చరర్లు ఎంతో శ్రమించినా.. ఆశించినంతగా అడ్మిషన్లు రాలేదని చెప్పాలి. ఇదిలాఉండగా, స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రణాళికతో చదివితే..
మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. -
పంటల సాగుపై స్పష్టత
పంటల సర్వే, నమోదు వల్ల ప్రభుత్వానికి పలు విషయాల్లో స్పష్టత రానుంది. ప్రధానంగా ఈసీజన్లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఏరకమైన పంటలు సాగు అయ్యాయి. ఇందులో ఆహార ధాన్యాల పంటలు, వాణిజ్య పంటలు సాగు అయ్యాయో తెలుస్తుంది. వీటి ఆధారంగా దిగుబడి అంచనా వేయడానికి వీలు కల్గుతుంది. ఈ దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు ఎంతమేర మద్దతు ధరలు ఇవ్వాలి, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తదితర విషయాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. దీంతో పాటు ఆయా పంటల దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు పట్టిపీడిస్తున్న చీడపీడలు, వైరస్లు ఏవేవీ ఆశిస్తున్నాయో కూడా తెలుస్తుంది. ఈవివరాల ఆధారంగా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియసేసే అవకాశం ఉంటుంది. -
పక్కాగా పంటల నమోదు!
గద్వాల వ్యవసాయం: గడిచిన వారం రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే.. బుకింగ్) పక్కాగా సాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు వేశారు.. దిగుబడి అంచనా.. వ్యవసాయ పంటల సాగు వివరాలు తెలియనుంది. ఈవివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహారధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. సాంకేతికతను జోడించి.. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులతోపాటు జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల దానికింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కిందతో పాటు బోర్లు, బావుల కింద ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్లో 3.80 లక్షలు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పత్తి, సీడ్‌పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలు వేస్తున్నారు. ఇంకా ఉద్యాన, వాణిజ్య పంటల సాగు కూడా ఇక్కడ ఉంది. ఇదిలాఉండగా, పంటల వివరాలు పక్కగా తెలుసుకుని, దాని ద్వార మద్దతు ధరలను నిర్ణయించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితరమైనవి చేసేందుకు గాను ప్రభుత్వం సాంకేతికతను జోడించి (డిజిటల్ క్రాప్ సర్వే అండ్ బుకింగ్) పంటల నమోదు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో దాదాపు 3,28,641 ఎకరాల్లో వివిద రకాల వ్యవసాయ పంటలు సాగు అయ్యాయని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఈఅంచనాకు అనుగుణంగా జిల్లాలో 97వ్యవసాయ క్లస్టర్లలో వారం రోజల క్రితం పంటల నమోదును ఆరంభించింది. ఒక్కో వ్యవసాయవిస్తరణ అధికారికి 2వేల ఎకరాల్లో పంటల సర్వే, నమోదు చేసేలా లక్ష్యంగా నిర్ధేశించారు. ఈసర్వేలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్‌లో మొబైల్ ద్వారా వివరాలు పొందుపరుస్తారు. ఈయాప్ ఓపెన్ చేసిన వెంటనే కెడెస్టల్ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ మ్యాప్‌లో ఐదు నుంచి 10 మంది రైతుల పేర్లు, వారి భూముల సర్వే నెంబర్లు వస్తాయి. అక్షాంశ, రేఖాంశలతో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏఈఓ ఖచ్చితంగా సంబంధిత రైతును సెలక్ట్ చేసుకొని, సర్వే నంబర్ ఉన్న భూమి దగ్గరకు వెళ్తున్నారు. రైతుల పొలాల దగ్గరకు వెళ్లిరైతు పేరు, ఆధార్‌నంబర్‌తో పాటు ఏపంట ఎన్ని ఎకరాల్లో వేశారో నమోదు చేస్తున్నారు. దీంతో ఉదాహరణకు వరి వేస్తే.. సాధారణమా, ఆర్ఎన్ఆర్ రకమా తెలుసుకొని వరి వివరాలన్నీ నమోదు చేయడంతో పాటు, పంట ఫొటోను కూడా అప్లోడ్ చేస్తున్నారు. 3,28,641 ఎకరాల్లో పంటల సర్వే, నమోదు లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 29,200 ఎకరాల్లో (8.89శాతం) పూర్తి అయ్యింది. కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే 3.28 లక్షల ఎకరాలు లక్ష్యం ఇప్పటివరకు 29,200 ఎకరాలు పూర్తి సర్వేతో పంటల దిగుబడిపై అంచనా.. వ్యవసాయ పురోగతికి దోహదం -
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం
గద్వాల: ‘తన తలను రైలు కింద పైట్టెనా చనిపోతా కానీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు.. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని రాబోయే ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కేటీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా ముందుగా జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్గంలో ర్యాలీ తీసి.. తేరు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల ఈ రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో.. నియోజకవర్గానికి ఒక్క రూపాయి వచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలు ఎగ్గొట్టినందుకు పార్టీ మారాడా? రైతుబంధు రూ.15 వేలు ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఆసరా పింఛన్ ఇవ్వనందుకు పార్టీ మారాడా? షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద ఆడపడుచులకు తులం బంగారం ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఎందుకు పార్టీ మారాడో ఎమ్మెల్యే బండ్ల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంకా సిగ్గులేని విషయం ఏమంటే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి సంకలో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. 2014లో గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, 1,275 డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఇలా అన్ని రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పంటలు సాగు చేసుకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడొద్దని ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుబంధు వారి ఖాతాలో జమచేశామని, పేదింటి ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దని షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు, దళితబంధు వంటి పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్య, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బాసు హనుమంతు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా.. గద్వాలలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాసు హనుమంతు అండగా నిలబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. అలంపూర్ నియోజకవర్గం రాజోళిలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించినందుకు 15 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. నిర్మల్‌లో రద్దు చేసిన విధంగా ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని, ఆ ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూ రెతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే 18 లక్షలఎకరాలకు సాగునీరు అందించాం సొంత అభివృద్ధి కోసమే ‘బండ్ల’ పార్టీ మారాడు ఉప ఎన్నికల్లో ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించండి గట్టు ఎత్తిపోతలను పండబెట్టారని మండిపాటు గద్వాల జిల్లాతో సహా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, ఆస్పత్రుల ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ప్రతిభకు ప్రోత్సాహం
నారాయణపేట రూరల్/గద్వాల టౌన్: పేద విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అర్హత.. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలి. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్ఈ తెలంగాణ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. బాలురు 2,973 బాలికలు 2,621నవంబర్ 23న ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంపికై తే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం 8వ తరగతి విద్యార్థులు 5,594 -
లోక్ అదాలత్‌లో 6,884 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 6,884 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి ఎన్.ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్ తదితర పెండింగ్ కేసులను ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఉదయ్‌నాయక్, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి ఎర్రవల్లి: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతూ.. సురక్షితంగా ఉందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం మండంలోని కోదండాపురంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రతతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై ఎరువులు, పంటలకు మద్దతు ధరలు, కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి పథకాలు అందుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ బీజేపీ పాలనలో మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు చేసిన ఎన్నో వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పి దేశ పవర్ ఎంటో ప్రదాని చూపించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనబెట్టి 2జీ కుంభకోణం, గడ్డి కుంభకోణం, యూరియా వంటి కుంభకోణాలతో పూర్తిగా అవినీతిలో కూడుకుపోయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాద్యక్షుడు కేకే రెడ్డి, పరుశరాం నాయుడు, వెంకటరామిరెడ్డి, శివరాంరెడ్డి, విజయ్, నరేష్, మహేష్, బీసన్న, రవి, తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఎర్రవల్లి: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో హమాలీ యూనియన్ అధ్యక్షుడు యాదన్న ఆధ్వర్యంలో కూడలి బజార్ లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రతిరోజు లోడింగ్ మరియు అన్ లోడింగ్ పనులు చేస్తూ బరువును మోస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలలో హమాలీలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అందులో భాగంగా వారికి ఇందిరమ్మ ఇండ్లు, స్థలాలు కేటాయించాలని అన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బరువును మోస్తూ బతుకును ఈడుస్తున్న హమాలీలకు ప్రభుత్వం తప్పకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. తమ వృత్తితో సమాజానికి సేవచేస్తున్న హమాలీలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి వారికి తగు సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీచుపల్లి, శేఖర్, హుస్సేన్, రామకృష్ణ, తిరుపతి, రాజు, గోపాల్, గోవిందు, నాగేష్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,676 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 181 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5676, కనిష్టం రూ. 2839, సరాసరి రూ. 3621 ధరలు లభించాయి. -
సామాన్యులపై దాడులకు పాల్పడుతున్న పోకిరీలు
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాలలో ఇటీవల రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. నిత్యం మద్యం మత్తులో తూగుతూ సామాన్యులతోపాటు ఏకంగా పోలీసులపైనా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వీధిరౌడీలు ప్రజలపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకునేందుకు ఖాకీలే వెనకంజ వేయడం గమనార్హం. అయితే, కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీమూకలకు రక్షణ కవచంగా ఉంటుండడంతోనే పదుల సంఖ్యలో దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్‌లుగా ఏర్పడి.. పట్టణంలో మొత్తం జనాభా లక్ష వరకు ఉండగా.. ఇందులో 35శాతం మేర అంటే 35వేల మంది యువత ఉంటారు. వీరిలో చదువు మధ్యలో మానివేసిన వారు, దినసరి కూలీలు చేస్తున్నావారు, జల్సాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువకులు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపులు 90కి పైగా ఉన్నట్లు సమాచారం. ఓ యూత్‌కు సంబంధించి ‘చంపు–చావు’ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌పై పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది.ఇలా ఏర్పాటు చేసుకున్న గ్రూపుల ద్వారా నిత్యం ఒకరిమరొకరు టచ్‌లో ఉంటూ సమాచారాన్ని బదిలీ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా తమ గ్రూప్‌లోని ఫ్రెండ్ ఘర్షణలకు పాల్పడుతుంటే వెంటనే వాట్సప్‌గ్రూప్ ద్వారా సమాచారం తెలుసుకుని నిమిషాల్లో ఘర్షణ జరుగుతున్న స్థలాలకు చేరుకుని దాడులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన తాజా మాజీ లీడర్లతో పాటు చిన్నాచితక మరో ముగ్గురు లీడర్లు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా పెంచిపోషిస్తూ అండగా నిలబడుతున్నారనేది బహిరంగ రహస్యం. రాజకీయ ప్రాబల్యంతో కొనసాగుతున్న గ్యాంగ్‌లు మందు పార్టీలు చేసుకునే క్రమంలోనే దాడులకు స్కెచ్‌లు వేస్తూ అమలుచేస్తున్నట్లు సమాచారం. సామాన్యులు బైక్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకున్నా.. నిబంధనలు పాటించకున్నా పోలీసులు వారిని పట్టుకొని చలాన్లు వేయడం, ఇదేమని ప్రశ్నిస్తే లాఠీలు ఝుళిపించడం చూస్తుంటాం. కానీ, జిల్లా కేంద్రంలో ఆర్నెళ్లలో 40 వరకు దాడి ఘటనలు చోటుచేసుకోవడం, ఇందులో 70మంది వరకు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. వీరిపై దాడికి పాల్పడిన రౌడీమూకలపై మాత్రం పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. దాడి ఘటనలకు బాధ్యులుగా పేర్కొంటున్న వీధిరౌడీలకు రాజకీయ నేతలు కొమ్ముకాస్తుండగా.. మరోవైపు రాజకీయ పలుకుబడితో పోస్టింగులు తీసుకున్న కొందరు పోలీసులు సైతం వీధిరౌడీలపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటూ అబాసుపాలవుతున్నారు. -
జూరాలపై వెలుగులేవి?
ప్రాజెక్టు రహదారిపై వెలగని విద్యుద్దీపాలు ●అధికారుల నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టుపై విద్యుద్ధీపాల ఏర్పాటు సమస్యను అధికారులు నేటికీ పరిష్కరించడం లేదు. తాగు, సాగునీటితో పాటు విద్యుదుత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టుపై అంధకారం నెలకొంది. రాత్రిళ్లు వెలుతురు ఉండేలా విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలి. – విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత నిధులు మంజూరయ్యాయి.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాల ఏర్పాటుకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పూర్తిస్థాయిలో విద్యుత్ బల్బులు బిగించేందుకు కార్యాచరణ రూపొందించాం. సంబంధిత పనులను కాంట్రాక్టర్‌కు అప్పజెప్పాం. డ్యాంపై రాత్రిళ్లు చీకటి లేకుండా చర్యలు తీసుకుంటాం. – జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల ఏళ్లుగా తీరని సమస్య.. ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాలు ఏళ్ల తరబడి వెలగకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. రాత్రిళ్లు రహదారిపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. – వెంకటేష్, నందిమళ్ల (అమరచింత) అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంపై రాత్రిళ్లు వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన విద్యుద్ధీపాలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు రహదారి రాత్రి సమయంలో చీకట్లు కమ్ముకొని వాహనదారులు, ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక ప్రజలు ప్రాజెక్టు రహదారి మీదుగా తమ తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గుంతలమయంగా మారిన రహదారి.. ప్రాజెక్టు రహదారిపై అడుగడుగునా గుంతలపడి అధ్వానంగా మారింది. అమరచింత మండలం నందిమళ్ల పీజేపీ క్యాంపు సమీపంలోని సత్యసాయి తాగునీటి పథకం నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు రహదారి జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం చింతరేవుల వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉన్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలే గుంతల రహదారి.. ఆపై రాత్రిళ్లు చీకట్లు అలుముకొని ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. రహదారి మరమ్మతుకు సైతం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సైతం పంపలేని స్థితిలో అధికారులు ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.18 లక్షలు మంజూరైనా.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడంతో రూ.18 లక్షలు మంజూరైనట్లు పీజేపీ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ నేటికీ మరమ్మతుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోని వైనం ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి పట్టించుకోని అధికారులు నిధులు మంజూరైనా.. ముందుకు సాగని పనులు -
యూరియా కోసం రైతుల అగచాట్లు
అలంపూర్: పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. వర్షం పడుతున్నప్పటికి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అధికారుల వచ్చేలోపు వర్షం తగ్గడంతో యూరియా కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధానంగా సుల్తానాపురం, జిల్లెలపాడుతో ఆయా గ్రామాల రైతులు భారీగా తరలిరాగా.. ముందుజాగ్రత్తగా వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు టోకెన్లు అందజేశారు. పీఏసీఎస్ గోదాంకు 450 బస్తాలు వచ్చినట్లు ఏఓ తెలిపారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు అందజేసి 225 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించినట్లు తెలిపారు. సాయంత్రం వరకు పంపిణీ కొనసాగింది. అయితే యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు తరలిరాగా.. చాలామంది నిరాశతో వెనుదిరిగారు.