రిటైర్మెంట్ బెనిఫిట్స్‌అందించండి
గద్వాల: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని సీఐటీయూ నాయకుడు ఉప్పేరు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి కలెక్టరేట్‌లో ఏఓ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల కు సేవలు అందించి రిటైర్మెంట్ అయిన అంగన్‌వాడీలకు ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గతేడాది జీఓ నం.8 మేరకు రిటైర్డ్‌మెంట్ అయిన అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2లక్షలు బెనిఫిట్స్ అందిస్తామని హామీ ఇచ్చారని.. కాని అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే జీఓ అమలు చేయాలన్నా రు. అదే విధంగా మరణించిన వారి స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించాలని కోరా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, అంగన్‌వాడీ టీచర్లు శాంతమ్మ, సువార్తమ్మ, మారెమ్మ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.11,590
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 230 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 11,590, కనిష్టంగా రూ. 5,800, సరాసరి రూ. 10,746 ధరలు వచ్చా యి. అదే విధంగా 6 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,946, కనిష్టంగా రూ. 5,619, సరాసరి రూ. 5,619 ధర పలికింది. 198 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,239, కనిష్టంగా రూ. 3,869, సరాసరి రూ. 8,229 ధరలు వచ్చాయి.
నిర్లక్ష్యంతోనే అధిక శాతం ప్రమాదాలు: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్ర మాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో వెళ్లాలని, రోడ్డుపై సిగ్నల్స్‌ను గమ నిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యు వత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, డ్రైవ్ చేసేటప్పుడు సెల్‌ఫో న్లు కూడా మాట్లాడొద్దని సూచించారు. అడిషనల్ డీఎస్పీ రత్నం మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్‌రావు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.


