ధరూరు: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా వెనుకడిన తరగతుల అభివృద్ది అధికారి అక్బర్ పాష గురువారం సాయంత్రం 7 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. అలాగే బాత్‌రూం, హాస్టల్ పరిసరాలను పరిశీలించి.. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని రుచి చూశారు. పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని, మంచి మార్కులతో పాస్ అయితే ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నర్సింహులు, సిబ్బంది పాల్గొన్నారు.


