నిర్భయంగా ఓటు వేయండి
రాజోళి: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ శంకర్ అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
గద్వాల(మల్దకల్): ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు మంగళవారం మల్దకల్, ఎల్కూర్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం వివిధ పంటలను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. డీఏఓ వెంట ఏఓ రాజశేఖర్ ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,506
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 255 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,506, కనిష్టంగా రూ. 4,200, సరాసరి రూ. 5,919 ధర పలికింది. అదే విధంగా 64 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,489, కనిష్టంగా రూ. 3,029, సరాసరి రూ. 7489 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 5,939 ధర పలికింది.
నిర్భయంగా ఓటు వేయండి


