వైభవంగా అంజన్న రథోత్సవం
ధరూరు: వేలాదిగా తరలివచ్చిన భక్తుల అంజన్న నామస్మరణ మధ్య మండలంలోని అల్వాలపాడు తెలుగోనిపలి్‌ల్ ఆంజనేయస్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా స్వామి వారి అలంకరణ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, భక్తుల అంజన్న నామస్మరణ మధ్య స్వామివారి రథోత్సవం కొనసాగింది. జిల్లా నలుమూలలతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచు మాణిక్యమ్మ, మాజీ సర్పంచులు ప్రతాప్, వీరన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అంజన్న రథోత్సవం


