చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా
ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్‌ఎస్‌కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు ఐదింటిలో హంగ్
బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ
తారుమారైన బీజేపీ అంచనాలు
‘పేట’లో ఆధిక్యత.. అయినా ఊగిసలాట
దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్‌క్లియర్
అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌కు అవకాశం
గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య దోబూచులాట
చేతిపురం..!
చేతిపురం..!


