ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు
గద్వాల: తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల, మున్సిపాలిటీ స్థాయి, వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. 9 నుంచి 12వ తేదీవ వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కప్ క్రీడల నిర్వహణతో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరగడంతో పాటు క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జతపర్చాలన్నారు. పూర్తి వివరాలకు 98854 79896, 94415 90842, 96039 96900 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీవైఎస్‌ఓ కృష్ణయ్య, ఎంపీడీఓలు, పీడీలు, పీఈటీలు ఉన్నారు.


