విజేత.. ఆశా కార్యకర్త | - | Sakshi
Sakshi News home page

విజేత.. ఆశా కార్యకర్త

Feb 14 2026 8:07 AM | Updated on Feb 14 2026 8:07 AM

విజేత.. ఆశా కార్యకర్త

విజేత.. ఆశా కార్యకర్త

కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడం.. భర్త బీఆర్‌ఎస్‌ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

– కొత్తకోట రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement