చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు భంగపాటు | - | Sakshi
Sakshi News home page

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు భంగపాటు

Feb 14 2026 8:07 AM | Updated on Feb 14 2026 8:07 AM

చైర్‌

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు భంగపాటు

కాంగ్రెస్‌

అభ్యర్థి ఓటమి

గద్వాల: స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉంది. గద్వాల మున్సిపల్‌ పీఠం మహిళకు రిజర్వ్‌ కావడంతో చైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా బరిలో దిగిన వారికి భంగపాటు ఎదురైంది. 28వ వార్డులో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ భార్య కళావతి బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన చంద్రశేఖర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 36వ వార్డులో లక్ష్మి కాంగ్రెస్‌ పార్టీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కమ్మరి సునీత చేతిలో ఓటమి పాలయ్యారు.

అలంపూర్‌ రూరల్‌: స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇస్మాయిల్‌ ఓటమి పాలయ్యారు. 3వ వార్డు నుంచి పోటీ చేసిన ఇస్మాయిల్‌ సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆసీఫ్‌ఖాన్‌ చేతిలో ఓటమి చవిచూశారు.

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు భంగపాటు 1
1/1

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు భంగపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement