కాంగ్రెస్.. బీఆర్‌ఎస్.. బీజేపీ..
ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్‌ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్‌బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్‌లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి.


